Begin typing your search above and press return to search.

రేణును ఉద్దేశించి మరో ప్రశ్న అడిగిన అంబటి... ఇది వైరల్!

ఈ సమయంలో అంబటి రాంబాబు ఆన్ లైన్ వేదీకగా స్పందించారు. రేణు దేశాయ్ కి ఒక సూచన చేశారు.

By:  Tupaki Desk   |   14 Aug 2023 6:35 AM GMT
రేణును ఉద్దేశించి మరో ప్రశ్న అడిగిన అంబటి... ఇది వైరల్!
X

రెండు మూడు రోజులుగా ఏపీ పాలిటిక్స్ లో పవన్ కల్యాణ్ రెండో మాజీ భార్య, నటి రేణూ దేశాయ్ విడుదల చేసిన ఒక వీడియో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ వీడియో విడుదలయిన అనంతరం.. రేణూలో ఏమిటీ మార్పు అనే చర్చ విపరీతంగా జరిగింది. ఈ సమయంలో అంబటి రాంబాబు ఆన్ లైన్ వేదీకగా స్పందించారు. రేణు దేశాయ్ కి ఒక సూచన చేశారు.

అవును... "అమ్మా రేణూ! మీ మాజీకి చెప్పు.. మా క్యారెక్టర్లు పెట్టి శునకానందం పొందొద్దని!" అంటూ ఆన్ లైన్ వేదికగా స్పందించారు అంబటి రాంబాబు. అయితే ఆ సూచనకు సమాధానం ఏ పక్కనంచీ రాలేదు! ఈ సమయంలో మరోసారి స్పందించారు అంబటి. ఈసారి పవన్ మోసం చేయడా అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇటీవ‌ల రేణు ఓ వీడియోను సోష‌ల్ మీడియాలో విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. ఒక్క త‌న విష‌యంలో మాత్రం ప‌వ‌న్‌ క‌ల్యాణ్ కచ్చితంగా మోసం చేశార‌ని, కాకపోతే మిగిలిన వాటిలో మంచోడ‌ని రేణు వెన‌కేసుకొచ్చారు. రాజ‌కీయాల్లో ఒక్కసారి ఆయ‌నకు అవ‌కాశం ఇవ్వాల‌ని వేడుకున్నారు. దీత్మో రేణు త‌న‌కు మోసం చేశార‌నే మాట‌ల్ని తీసుకుని ప‌వ‌న్‌ పై అంబ‌టి ఫైరయ్యారు.

పదిమంది ముందూ తాళిక‌ట్టి, భగవంతుడి సాక్షిగా ప్రమాణాలు చేసి, ఏడ‌డుగులు న‌డిచిన భార్యనే మోస‌గిస్తే.. ఇక స‌మాజం ఒక్క లెక్కా అనేది అంబ‌టి లాజిక్‌. ఆ కోణంలోనే ప‌వ‌న్‌ పై సెటైర్స్ విసిరారు. రేణుని మోసం చేసినోడు రాష్ట్రాన్ని మోసం చేయడా అనేది ఆయన లాజికల్ క్వశ్చన్ గా ఉంది. దీంతో... ప‌వ‌న్‌ ను మోస‌గాడిగా అంబ‌టి రాంబాబు అభివ‌ర్ణించారు.

ఇదే సమయంలో త‌న‌కు అన్యాయం చేసినా.. హిందూ మ‌హిళ‌గా విశాల దృక్పథంతో త‌న కుమారుడి తండ్రి సీఎం కావాల‌ని రేణు దేశాయ్ కోరుకోవ‌డంలో త‌ప్పులేద‌ని వ్యంగ్యంగా అంటూ... ప్రజలు పవన్‌ కు అవకాశమిచ్చేందుకు సిద్ధంగా లేరని తెలిపారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని వైసీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడిన సందర్భంగా మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే... గతకొన్ని రోజులుగా పవన్ పై ఈగవాలకుండా తీసుకునే జాగ్రత్తల్లో భాగంగా... ఆయనపై వచ్చిన విమర్శలను ఒక వర్గం మీడియా కవర్ చేయడం లేదు.. అచ్చేయడం లేదు! అయితే తాజాగా అంబటి చేసిన ఈ వ్యాఖ్యలను మాత్రం ఎల్లో మీడియా కవర్ చేసింది. ఇప్పుడు ఇది మరోరకంగా చర్చనీయాంశమైంది.