Begin typing your search above and press return to search.

అంబ‌టి ఎఫెక్ట్‌.. మోదుగుల బెంబేలు... !

స‌రే.. అంబ‌టి పేరు ఎలా.. ఈ ఎఫెక్ట్ మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డిపై భారీగా ప‌డింద‌నే వాద‌న‌లు వినిపిస్తున్నాయి. ఆయ‌న గ‌త ఎన్నిక‌ల్లో గుంటూరు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు.

By:  Tupaki Desk   |   2 Jan 2024 12:30 AM GMT
అంబ‌టి ఎఫెక్ట్‌.. మోదుగుల బెంబేలు... !
X

తాజాగా వైసీపీ తీర్థం పుచ్చుకున్న భార‌త క్రికెట‌ర్‌.. అంబ‌టి రాయుడుకు గుంటూరు పార్ల‌మెంటు స్థానాన్ని ఇస్తున్నారా? ఆయ‌న పేరును ఈ స్థానానికి ప‌రిశీలిస్తున్నట్టు తాడేప‌ల్లి వ‌ర్గాలు చెబుతున్నాయి. వాస్తవానికి స‌త్తెన‌ప‌ల్లి లేదా.. న‌ర‌స‌రావుపేట‌ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల నుంచి అంబ‌టి రాయుడు పోటీ చేసే వ‌హించే అవ‌కాశం ఉంద‌ని ఓనాలుగు మాసాల కింద‌ట వార్త‌లువ చ్చాయి. అయితే.. అప్ప‌ట్లో ఆయ‌న పార్టీలో చేరిక‌పై క్లారిటీ ఇవ్వ‌లేదు. ఇక‌, ఇప్పుడు అనూహ్యంగా వైసీపీ బాట‌ప‌ట్టారు.

ఆ వెంట‌న రాయుడుకు గుంటూరు ఎంపీ సీటును ఇస్తున్న‌ట్టు తాడేప‌ల్లి వ‌ర్గాలు లీకులు ఇచ్చాయి. స‌రే.. అంబ‌టి పేరు ఎలా.. ఈ ఎఫెక్ట్ మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డిపై భారీగా ప‌డింద‌నే వాద‌న‌లు వినిపిస్తున్నాయి. ఆయ‌న గ‌త ఎన్నిక‌ల్లో గుంటూరు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఎన్నిక‌ల‌కు ముందు చివ‌రి నిముషంలో టీడీపీ నుంచి వ‌చ్చి వైసీపీలో చేరిన మోదుగుల కోసం.. అప్ప‌టిక‌ప్ప‌డు ఈ సీటు ను ఖాళీ చేసి (లావు శ్రీకృష్ణ దేవ‌రాయులును న‌ర‌సారావుపేట‌కు పంపించి) మ‌రీ ఇచ్చారు.

టీడీపీ ఎంపీ.. గ‌ల్లా జ‌య‌దేవ్‌కు స‌మ ఉజ్జీగా వైసీపీ నేత‌లు మోదుగుల‌ను రంగంలోకి దింపారు. అయితే.. ఆ ఎన్నిక‌ల్లో ఆయ‌న ఓడిపోయారు. ఇక అప్ప‌టి నుంచి ఎమ్మెల్సీ కోసం ట్రై చేశారు. కానీ, ద‌క్క‌లేదు. కానీ.. ఆరు మాసాల కింద‌ట మ‌రోసారి సీఎం జ‌గ‌న్ స్వ‌యంగా తాడేప‌ల్లికి పిలిచి.. గుంటూరులో కార్య‌క్ర‌మాలు చేయాల‌ని .. పార్టీని ప‌రుగులు పెట్టించాల‌ని పిలుపునిచ్చారు. దీంతో ఆయ‌న గుంటూరు నుంచి పోటీ ఖాయ‌మ‌ని అనుకున్నారు.

కానీ, ఇంత‌లోనే రాయుడు పేరును తాజాగా ప్ర‌క‌టించేందుకు సిద్ధ‌మ‌వుతున్నట్టు వార్త‌ల నేప‌థ్యంలో మ‌రి మోదుగుల ప‌రిస్థితి ఏంటి? అనేది ఆస‌క్తిగా మారింది. పోనీ.. టీడీపీలోకి వెళ్తారా? అంటే.. ఇక్క‌డ కూడా గుంటూరు, న‌ర‌సారావు పేట ఎంపీ స్థానాల‌కు ఇద్ద‌రేసి చొప్పున నాయ‌కులు రెడీగా ఉన్నారు. పైగా టీడీపీ-జ‌న‌సేన ఉమ్మ‌డి అభ్య‌ర్థికి గుంటూరును కేటాయిస్తున్నార‌నే వార్త‌లు కూడా వ‌స్తున్నాయి. దీంతో మోదుగుల‌కు దారులు మూసుకు పోయిన‌ట్టేన‌నే చ‌ర్చ సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఆయ‌న ఏం చేస్తారో చూడాలి.