Begin typing your search above and press return to search.

భారత వినోద పరిశ్రమ రేంజ్ ఎంతో చెప్పిన ముకేశ్ అంబానీ

ఇటీవల కాలంలో ఎప్పుడై లేని రీతిలో ఆయన భారత మీడియా.. వినోద పరిశ్రమ రేంజ్ ఎంతన్న విషయాన్ని చెప్పుకొచ్చారు.

By:  Tupaki Desk   |   2 May 2025 2:00 PM IST
Ambani Predicts Media Boom
X

బోలెడన్ని ఆసక్తికర అంశాల్ని వెల్లడించారు రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ. ఆయన గ్రూపు చేసే అనేక వ్యాపారాల్లో మీడియా.. వినోద పరిశ్రమకు చెందిన సంస్థలు ఉండటం తెలిసిందే. ఇటీవల కాలంలో ఎప్పుడై లేని రీతిలో ఆయన భారత మీడియా.. వినోద పరిశ్రమ రేంజ్ ఎంతన్న విషయాన్ని చెప్పుకొచ్చారు. రానున్న పదేళ్లలో భారత మీడియా.. వినోద పరిశ్రమ పరిమాణం భారీగా పెరుగుతుందన్నారు.

దీని మార్కెట్ ఏకంగా రూ.8.50 లక్షల కోట్లకు చేరుకుంటుందన్న అంచనాను వెల్లడించారు. ముకేశ్ అంబానీ గ్రూపునకు చెందిన నెట్ వర్కు 18తో పాటు పలు డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లు.. వినోద ఛానళ్లు.. కంటెంట్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫారాలు ఉండటం తెలిసిందే. దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో ‘వేవ్స్ 2025’ సదస్సు జరిగింది. ఈ ప్రోగ్రాంకు హాజరైన ముకేశ్ అంబానీ పలు కీలక అంశాల్ని తన ప్రసంగంలో ప్రస్తావించారు.

రాబోయే పదేళ్ల వ్యవధిలో భారత మీడియా.. వినోద పరిశ్రమ వంద బిలియన్ డాలర్ల రేంజ్ కు చేరుకుంటుందని.. లక్షల సంఖ్యలో ఉద్యోగాల్ని క్రియేట్ చేస్తుందని చెప్పారు. అంతేకాదు.. ప్రపంచ వినోద రంగానికి భారత్ ప్రధాన కేంద్రంగా అవతరించేందుకు ఎక్కువ టైం తీసుకోదన్నారు. ప్రపంచంలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించిన నేపథ్యంలో దేశ మీడియా.. వినోద రంగం ప్రపంచంలోనే అగ్రగామిగా అవతరిస్తుందన్న అంచనాను వెల్లడించారు.

ప్రస్తుతం భారత మీడియా.. వినోద పరిశ్రమ విలువ రూ.2.4 లక్షలకోట్లుగా పేర్కొన్నారు. వచ్చే పదేళ్లలో 100 బిలియన్ డాలర్లుగా పేర్కొన్నారు. పలువురు ఈ రంగంలోకి అడుగు పెట్టనున్నట్లు చెప్పారు. డిజిటల్ రంగంలో భారత్ అగ్రగ్రామిగానిలుస్తుందని.. కథల క్రియేషన లో భారత్ విలక్షణత చూపుతుందని చెప్పారు. కథల్ని క్రియేట్ చేయటం.. డిజిటల్ టెక్నాలజీని మిళితం చేయటం ద్వారా.. గతానికి భిన్నమైన కంటెంట్ ను జనరేట్ చేయొచ్చన్నారు.

5 వేల ఏళ్ల నాటి చరిత్ర.. నాగరికతో పాటు మనదైన రామాయణం.. మహాభారతం లాంటి ఇతిహాసాల నుంచి డజనకు పైగా భాషల్లో జానపద సాహిత్యం ఉందన్నారు. మన కథల్ని ప్రపంచానికి పరిచయం చేయాల్సి ఉందన్నారు. మన కథనాలు ప్రపంచ ప్రజల మనసుల్ని టచ్ చేస్తాయని చెప్పిన మాటలు ఆసక్తికరంగా మారాయని చెప్పక తప్పదు. ఒక దిగ్గజ పారిశ్రామికవేత్త భారత మీడియా.. వినోద పరిశ్రమ మీద ఇంత క్లియర్ గా మాట్లాడటం ఇదేనని చెప్పక తప్పదు.