Begin typing your search above and press return to search.

భారతదేశపు అత్యంత ధనవంతులుగా అంబానీ వారసులు

360 వన్ హెల్త్ క్రియేటర్స్ లిస్ట్ 2025 ప్రకారం.. వీరిద్దరి కలిపిన నికర సంపత్తి ₹3.59 లక్షల కోట్లుగా నమోదైంది.

By:  Tupaki Desk   |   19 Jun 2025 11:31 AM IST
భారతదేశపు అత్యంత ధనవంతులుగా అంబానీ వారసులు
X

రిలయన్స్ ఇండస్ట్రీస్ వారసులు అనంత్ అంబానీ, ఆకాష్ అంబానీ భారతదేశంలోనే అత్యంత ధనవంతులుగా నిలిచారు. 360 వన్ హెల్త్ క్రియేటర్స్ లిస్ట్ 2025 ప్రకారం.. వీరిద్దరి కలిపిన నికర సంపత్తి ₹3.59 లక్షల కోట్లుగా నమోదైంది.

మహిళల విభాగంలో అనంత్-ఆకాష్‌ అంబానీల సోదరి ఇషా అంబానీ అగ్రస్థానంలో నిలిచారు. ఆమె నికర సంపత్తి ₹3.58 లక్షల కోట్లు కాగా మొత్తం ర్యాంకింగ్‌లో ఆమె మూడో స్థానాన్ని దక్కించుకున్నారు.

క్రిసిల్ ‌తో కలిసి 360 వన్ వెల్త్ రూపొందించిన ఈ జాబితాలో కనీసం ₹500 కోట్ల నికర సంపత్తి కలిగిన 2,013 మంది వ్యక్తులు స్థానం పొందారు. వీరి మొత్తం సంపత్తి ₹100 లక్షల కోట్లు, ఇది భారతదేశ జీడీపీలో సుమారు మూడింట ఒక వంతు. ఈ జాబితాలో సగటు నికర సంపత్తి ₹1,423 కోట్లు.

- అదానీ గ్రూప్ కూడా పటిష్టంగానే:

అంబానీల తర్వాత స్థానంలో అదానీ గ్రూప్‌కు చెందిన వినోద్‌భాయ్‌ అదానీ (₹2.72 లక్షల కోట్లు), గౌతంభాయ్‌ అదానీ (₹2.48 లక్షల కోట్లు), రాజేశ్‌ అదానీ (₹2.16 లక్షల కోట్లు) ఉన్నారు.

- యువ సంపద సృష్టికర్తలు:

ఈ జాబితాలో 40 ఏళ్ల లోపు వయస్సున్న 143 మంది యువ సంపత్తి సృష్టికర్తలు ఉండటం విశేషం. వీరిలో అత్యంత చిన్న వయస్సు కలిగిన వ్యక్తి భారత్‌పే సహ వ్యవస్థాపకుడు శశ్వత్ నక్రాణి (27).

-ప్రముఖ వ్యాపార సంస్థల ఆధిపత్యం:

రిలయన్స్‌, అదానీ, టాటా గ్రూప్‌ ప్రమోటర్లు దేశంలోని మొత్తం సంపత్తిలో సుమారు 24% వాటాను కలిగి ఉన్నారు. వీరి కలిపిన సంపత్తి ₹36 లక్షల కోట్లు. దేశంలోని టాప్ 50 బిజినెస్ హౌస్‌లు మొత్తం సంపత్తిలో 59% వాటాను కలిగి ఉండగా, ఇందులో రిలయన్స్‌, అదానీ గ్రూప్‌లు ఒక్కటే 12% సంపదను కలిగి ఉన్నాయి.

- మహిళా వ్యాపారవేత్తల ప్రాతినిధ్యం:

ఈ జాబితాలో 72 మంది మహిళా వ్యవస్థాపకులు, కార్పొరేట్ నేతలు కూడా స్థానం పొందారు.

- ఆన్‌లైన్ వేదికల పాత్ర:

నూతన తరం సంపన్నుల్లో 46% మంది ఆన్‌లైన్‌ వేదికల ద్వారానే సంపదను సృష్టించారు. ఫిన్‌టెక్‌, ఈ-కామర్స్‌, ఎడ్‌టెక్‌, ఇన్వెస్ట్‌మెంట్ ప్లాట్‌ఫాంలు జీరోధా, అప్‌స్టాక్స్‌, స్విగ్గీ, ఫిజిక్స్‌వాలా వీరి సంపద పెరగడంలో కీలక పాత్ర పోషించాయి.

-ప్రధాన పరిశ్రమలు:

పరిశ్రమల పరంగా చూస్తే ఔషధ, ఐటీ, ఆర్థిక సేవల రంగాలు కలిపి 26% సంపదను సృష్టించాయి. ఔషధ రంగంలో 174 మంది, ఆర్థిక సేవల రంగంలో 158 మంది, ఐటీ రంగంలో 134 మంది బిలియనీర్లు ఉన్నారు. బ్యాంకింగ్‌, టెలికాం, విమానయానం రంగాల్లో వ్యక్తికి లభించే సంపద అత్యధికంగా ఉంది.

- ముంబయి అగ్రస్థానం:

భౌగోళికంగా చూస్తే, ముంబయి భారతదేశంలో ధనికుల కేంద్రంగా కొనసాగుతోంది. ఇక్కడ 577 మంది సంపన్నులు నివసిస్తున్నారు, వీరి ద్వారా మొత్తం సంపత్తిలో 40% సమకూరుతోంది. న్యూఢిల్లీ 17%, బెంగళూరు 8%, అహ్మదాబాద్ 5% వాటాను కలిగి ఉన్నాయి.