Begin typing your search above and press return to search.

రాజ‌ధానికి 'స్టార్‌'.. చంద్ర‌బాబు ప‌క్కా ప్లాన్‌

వ‌చ్చే రెండేళ్ల‌లోనే అమ‌రావ‌తి ప్రాంతంలో ఈ స్టార్ హోట‌ళ్ల‌ను అభివృద్ధి చేయాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. త‌ద్వారా విదేశీ ప‌ర్యాట‌కుల‌ను ఆహ్వానించాల‌ని భావిస్తున్నారు.

By:  Garuda Media   |   18 July 2026 7:00 AM IST
రాజ‌ధానికి స్టార్‌.. చంద్ర‌బాబు ప‌క్కా ప్లాన్‌
X

ఏపీ రాజ‌ధాని, ప్రపంచ స్థాయిలో నిర్మాణం జ‌రుగుతున్న అమ‌రావ‌తికి స్టార్ క‌ళ రానుందా? ప్ర‌పంచ స్థాయిలో ఇక్క డ కూడా విలాస‌వంత‌మైన హోట‌ళ్ల‌ను నిర్మించ‌నున్నారా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. తాజాగా అమ రావతిలో 3-5 స్టార్ హోట‌ళ్ల నిర్మాణానికి ప్ర‌భుత్వం సిద్ధ‌మైంది. వ‌చ్చే రెండేళ్ల‌లోనే అమ‌రావ‌తి ప్రాంతంలో ఈ స్టార్ హోట‌ళ్ల‌ను అభివృద్ధి చేయాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. త‌ద్వారా విదేశీ ప‌ర్యాట‌కుల‌ను ఆహ్వానించాల‌ని భావిస్తున్నారు.

పెరుగుతున్న ఆదాయం

అమ‌రావ‌తిలో స్టార్ హోట‌ళ్ల నిర్మాణాన్ని కీల‌కంగా భావిస్తున్న కూట‌మి ప్ర‌భుత్వం.. త‌ద్వారా రాష్ట్రానికి ఆదాయం వ‌స్తుంద‌ని అంచ‌నా వేస్తోంది. దీంతోపాటు.. విదేశీ ప‌ర్యాట‌క‌ల‌కు రాజ‌ధాని అమ‌రావ‌తిని గ‌మ్య స్థానంగా మార్చాల‌ని నిర్ణ‌యించారు. ఈ క్ర‌మంలోనే రాజ‌ధానిలో మొత్తం ఆరు స్టార్ హోట‌ళ్ల‌ను ఈ ఏడాదిలోనే నిర్మాణ ద‌శ‌కు చేర్చేలా ప్ర‌భుత్వంకార్యాచ‌ర‌ణ ప్రారంభిస్తోంది. ప్రైవేటు హోట‌ళ్ల‌లో అత్యంత కీల‌క‌మైన వాటిని ఆహ్వానించ‌నున్నారు. త‌ద్వారా దేశ‌స్థాయిలో పేరున్న వాటికి ప్రాధాన్యం ఇస్తారు.

అలాగే.. రాజ‌ధానిలోని ఆరు ప్రాంతాల‌ను కూడా ఇప్ప‌టికే ఎంపిక చేశారు. ఆయా ప్రాంతాల్లో 3, 5 స్టార్‌హోట‌ళ్ల‌ను నిర్మించ‌డం ద్వారా స‌మావేశాలు, కాన్ఫ‌రెన్సులు నిర్వ‌హించేందుకు, ప్ర‌ముఖుల‌కు అతిథి మ‌ర్యాద‌లు చేసేందు కు కూడా అవ‌కాశం ఉంటుంద‌ని.. త‌ద్వారా రాజ‌ధానిపై మ‌రింత ప్ర‌చారం జ‌రుగుతుంద‌ని అంత‌ర్జాతీయంగా కూడా ఈ వ్య‌వ‌హారం చ‌ర్చ‌కు వ‌స్తుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ప్ర‌స్తుతం దీనికి సంబంధించిన మాస్ట‌ర్ ప్లాన్‌కు కూడా ప్ర‌భుత్వం ఆమోదం తెలిపింది.

ఒబెరాయ్‌, తాజ్ స‌హా ప్ర‌సిద్ధ సంస్థ‌ల‌కు భూములు కేటాయించేందుకు ప్ర‌భుత్వం రెడీ అయింది. పెట్టుబ‌డి దారు ల‌కు ఇస్తున్న విధంగా కొన్ని రాయితీలు ఇవ్వ‌డం ద్వారా.. ప్ర‌ఖ్యాత సంస్థ‌ల‌ను అమ‌రావ‌తికి తీసుకువ‌చ్చేందుకు ప్ర‌య‌త్నాలు సాగుతున్నాయి. ఇవి సాకారం అయితే.. మ‌రింత‌గా అమ‌రావ‌తి పేరు ప్రపంచ‌స్థాయికి చేరుకుంటుం ద‌ని ప్ర‌భుత్వం అంచ‌నా వేస్తోంది. మొత్తంగా సీఎం చంద్ర‌బాబు క‌ల‌లు కంటున్న రాజ‌ధానికి స్టార్ క‌ళ ఉట్టిప‌డ నుంది.