Begin typing your search above and press return to search.

అమ‌రావ‌తిలోనే మంత్రులు.. నివాసాలు రెడీ!

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో రెండు కీల‌క నిర్మాణాలు పూర్త‌య్యాయి. వీటిని ఈ నెల 13న సీఎం చంద్ర‌బాబు స్వయంగా ప్రారంభించ‌నున్నారు.

By:  Garuda Media   |   5 Aug 2026 6:00 PM IST
అమ‌రావ‌తిలోనే మంత్రులు.. నివాసాలు రెడీ!
X

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో రెండు కీల‌క నిర్మాణాలు పూర్త‌య్యాయి. వీటిని ఈ నెల 13న సీఎం చంద్ర‌బాబు స్వయంగా ప్రారంభించ‌నున్నారు. వీటిలో 1) సీడ్ యాక్స‌స్ రోడ్డు నిర్మాణం. ఇది 90 శాతం నిర్మాణం పూర్త‌యింది. అమ‌రావ‌తి నిర్మాణాలు ప్రారంభ‌మైన నాటి నుంచే నిర్మాణం చేప‌ట్టినా.. మ‌ద్య‌లో కొంద‌రు రైతులు భూములు ఇవ్వ‌లేదు. దీంతో ఈ నిర్మాణంలో ఆల‌స్యం జ‌రిగింది. అయితే.. ఇటీవ‌ల భూ సేక‌ర‌ణ ద్వారా వాటిని తీసుకున్నారు. దీంతో నిర్మాణాలు వ‌డివ‌డిగా ముందుకు సాగుతున్నాయి.

జ‌రుగుతున్న ప‌నులు జ‌రుగుతుండ‌గానే.. ఇప్ప‌టికే పూర్త‌యిన 90 శాతం సీడ్ యాక్స‌స్ ర‌హ‌దారిని సీఎం చంద్ర‌బాబు ఈ నెల 13న ప్రారంభించ‌నున్నారు. దీనికి సంబంధించి ఇప్ప‌టికే ట్ర‌య‌ల్ ర‌న్‌ను కూడా ప్రారంభించారు. మొత్తంగా 6 గ్రామాల‌ను క‌వ‌ర్ చేస్తూ నిర్మించిన‌.. ఈ సీడ్ యాక్సిస్ రోడ్డు .. అమ‌రావ‌తికి త‌ల‌మానికంగా నిలిచింది. ఇది అందుబాటులోకి రావ‌డంతో అమ‌రావ‌తి నిర్మాణంలో కీల‌క ఘ‌ట్టం పూర్త‌యిన‌ట్టేన‌ని అంటున్నారు.

ఇక‌, రాష్ట్ర మంత్రివ‌ర్గం మొత్తం అమ‌రావ‌తిలోనే నివాసం ఉండేలా ప్లాన్ చేశారు. దీనికి సంబంధించి కూడా.. నిర్మాణాలు పూర్త‌య్యాయి. ఇండివిడ్యువ‌ల్‌గా 3 స్టార్ రేటింగ్‌తో ఈ నివాసాల నిర్మాణాల‌ను పూర్తి చేశారు. ఇటీవ‌ల ప్రారంభించిన అండ‌ర్ గ్రౌండ్ డ్రైనేజీ ప‌నులు కూడా రెండు రోజుల్లో పూర్తి కానున్నాయి. వీటిని కూడా ఈ నెల 13నే సీఎం చంద్ర‌బాబు ప్రారంభిస్తారు. అనంత‌రం.. సాధార‌ణ ప‌రిపాల‌న శాఖ (జీఏడీ)కి వీటిని బ‌దలాయిస్తారు.

జీఏడీఅధీనంలో ఉండే ఈ మంత్రుల నివాసాల‌ను ప్రాధాన్యాల వారీగా మంత్రుల‌కు కేటాయిస్తారు. త‌ద్వారా.. మంత్రులు పూర్తిస‌మ‌యం అమ‌రావ‌తిలోనే ఉండ‌నున్నారు. మొత్తం రాష్ట్ర మంత్రివ‌ర్గంలో 26 మంది మంత్రులు ఉన్నారు. వీరికి అనుకూలంగా 3 స్టార్ రేటింగ్‌తో ఆధునిక వ‌స‌తుల‌తో ఈ భ‌వ‌నాల‌ను నిర్మించారు. 26 నివాసాల‌తో పాటు.. అతి పెద్ద పార్కులు, స్విమ్మింగ్ పూల్స్‌, ఆట స్థ‌లాలు, ఎమ్యూజ్‌మెంటు పార్కులు, వాహ‌నాల పార్కింగ్ కోసం ప్ర‌త్యేక ప్రాంతాల‌ను నిర్మించారు. అలానే మ‌రో 8 ప్ర‌త్యేక నివాసాల‌ను కూడా ఏర్పాటు చేశారు. వీటిని గెస్టుల‌కు కేటాయించేలా ప్లాన్ చేయ‌డం గ‌మ‌నార్హం.