అమరావతికి మరో 'గుర్తింపు'!
ఏపీ రాజధాని అమరావతి వ్యవహారం.. రోజు రోజుకు ఆసక్తిగా మారుతోంది. ఇటీవలే రాష్ట్ర ఏకైక రాజధానిగా పార్లమెంటు ఉభయ సభల్లోనూ బిల్లు ఆమోదం పొందింది.
By: Garuda Media | 5 April 2026 5:00 AM ISTఏపీ రాజధాని అమరావతి వ్యవహారం.. రోజు రోజుకు ఆసక్తిగా మారుతోంది. ఇటీవలే రాష్ట్ర ఏకైక రాజధానిగా పార్లమెంటు ఉభయ సభల్లోనూ బిల్లు ఆమోదం పొందింది. ఇక, త్వరలోనే దీనికి రాష్ట్రపతి ద్రౌపది ము ర్ము కూడా ఆమోద ముద్ర వేయనున్నారు. దీంతో ఇది చట్టంగా మారనుంది. ఇక, ఇప్పుడు తాజాగా.. కేం ద్ర పోస్టల్ విభాగం అమరావతికి కొత్తగా `పిన్ కోడ్` మంజూరు చేసే పనులు చేపట్టింది.
ప్రస్తుతం ఎప్పుడో.. 2014-19 మధ్య వెలగపూడి అడ్రస్‌తో రాజధానికి పిన్ కోడ్ 522237 కేటాయించారు. దీని నే ఇప్పటికీ వినియోగిస్తున్నారు. కానీ.. ఇప్పుడు అమరావతిని ప్రత్యేకంగా గుర్తించిన నేపథ్యానికి తోడు.. ఏకైక రాజధానిగా పేర్కొన్న క్రమంలో ప్రత్యేకంగా పిన్‌కోడ్‌ను కేటాయించనున్నారు. అలాగే.. ఎస్‌టీడీ, ఐఎస్ డీ కోడ్‌ను కూడా కేటాయించనున్నారు. తద్వారా ఉత్తరప్రత్యుత్తరాలు.. లావాదేవీలు చేసుకునేం దుకు అవకాశం ఉంటుంది.
అంతేకాదు.. రాజధానిలో పోస్టల్ శాఖ పరంగా కొత్త వ్యవస్థ అందుబాటులోకి వస్తుది. వాస్తవానికి ఇప్పటి వరకు రాజధాని అమరావతికి ప్రత్యేకంగా పిన్ కోడ్ లేదు. అంటే.. కేరాఫ్ లేదు!. దీనినే వైసీపీ నాయకులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా రాష్ట్ర ప్రభుత్వం పిన్ కోడ్‌తో పాటు.. ఐఎస్‌డీ, ఎస్ టీడీ పిన్‌ల కోసం కేంద్రానికి లేఖ రాసింది.
దీంతో ప్రత్యేకమైన పిన్‌కోడ్‌ను పోస్టల్ శాఖ కేటాయించనుంది. మరోవైపు.. అమరావతి రాజధాని ప్రాంతంలో `జనరల్ పోస్ట్ ఆఫీస్ నిర్మాణం` కోసం ప్రభుత్వం భూమిని కేటాయించింది. ఈ నిర్మాణాలను కూడా త్వరలోనే ప్రారంభించనున్నారు. ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వానికి చెందిన భవనం కావడం గమనార్హం.
