Begin typing your search above and press return to search.

ఇలా అయితేనే.. అమ‌రావ‌తి 'శాశ్వ‌తం'!

అమ‌రావ‌తికి చ‌ట్ట‌బ‌ద్ధ‌త క‌ల్పిస్తే.. అది శాశ్వ‌త రాజ‌ధాని అవుతుంద‌ని ప్ర‌భుత్వం చెబుతున్న వాద‌న బాగానే ఉన్న‌ప్ప‌టికీ.. శాశ్వ‌త నిర్మాణాలు క‌ల్పిస్తేనే.. అది శాశ్వ‌త రాజ‌ధాని అవుతుంద‌ని ప‌లువురు విశ్లేష‌కులు వ్యాఖ్యానిస్తున్నారు

By:  Garuda Media   |   3 April 2026 3:41 PM IST
ఇలా అయితేనే.. అమ‌రావ‌తి శాశ్వ‌తం!
X

అమ‌రావ‌తికి చ‌ట్ట‌బ‌ద్ధ‌త క‌ల్పిస్తే.. అది శాశ్వ‌త రాజ‌ధాని అవుతుంద‌ని ప్ర‌భుత్వం చెబుతున్న వాద‌న బాగానే ఉన్న‌ప్ప‌టికీ.. శాశ్వ‌త నిర్మాణాలు క‌ల్పిస్తేనే.. అది శాశ్వ‌త రాజ‌ధాని అవుతుంద‌ని ప‌లువురు విశ్లేష‌కులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్ర‌ధానంగా రాజ‌ధానికి కావాల్సింది.. శాశ్వ‌త నిర్మాణాల‌ని పేర్కొంటు న్నారు. గ‌తంలో వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. మూడు రాజ‌ధానుల పేరుతో కొత్త ప్ర‌తిపాద‌న‌కు శ్రీకారం చుట్ట‌డం వెనుక ఇదే కార‌ణ‌మ‌ని అంటున్నారు.

అప్ప‌ట్లో తాత్కాలిక నిర్మాణాలు మాత్ర‌మే చంద్ర‌బాబు ప్ర‌భుత్వం చేసింది. దీనిని చూపించిన జ‌గ‌న్‌.. అ న్నీ తాత్కాలిక‌మేన‌ని.. గ్రాఫిక్స్ అంటూ హేళ‌న చేశారు. గ‌త 2019-24 మ‌ధ్య ఒక్క ఇటుక‌ను కూడా పేర్చ‌లే దు. పైగా.. ల‌క్ష కోట్ల రూపాయ‌ల ఖ‌ర్చును కూడా చూపించారు. దీంతో ఆయ‌న మూడు రాజ‌ధానుల ప్ర‌తి పాదన‌ను తీసుకువ‌చ్చి.. రాజ‌ధాని అమ‌రావ‌తిని ఎటూకాకుండా చేసిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు అలా కాకూడ‌ద‌న్న సూచ‌న‌లు వ‌స్తున్నాయి.

ప్ర‌ధాన, శాశ్వ‌త నిర్మాణాల‌ను సాధ్య‌మైనంత వేగంగా పూర్తి చేయాల‌న్న‌ది సూచ‌న‌. అదేవిధంగా వ‌చ్చే భ‌విష్య‌త్తుకు సంబంధించి రాజధాని ఎలానూ సొంత‌గా నిధులు స‌మ‌కూర్చుకునే ప్ర‌య‌త్నం చేస్తుంది కాబ‌ట్టి.. దానికి సంబంధించిన ప్లాన్‌ను కూడా ఆవిష్క‌రిస్తే.. ఇక‌, రాజ‌ధానికి తిరుగు ఉండ‌ద‌న్న చ‌ర్చ న‌డుస్తోంది. అదేస‌మ‌యంలో ప్ర‌జాబాహుళ్యానికి సాధ్య‌మైనంత వేగంగా దీనిని అందుబాటులోకి తీసుకురావాలి.

అంటే.. ప్ర‌స్తుతం.. చెట్టుకొక‌టి .. పుట్ట‌కొక‌టిగా ఉన్న రాష్ట్ర ప్ర‌భుత్వ శాఖల ప్ర‌ధాన కార్యాల‌యాల‌ను అమ‌రావ‌తికి చేరేస్తే.. చాలని సూచిస్తున్నారు. ప్ర‌స్తుతం విజ‌య‌వాడలో కొన్ని.. మంగ‌ళ‌గిరిలో కొన్ని గుంటూరులో మ‌రికొన్ని.. హైద‌రాబాద్‌-విజ‌య‌వాడ రూటులో ఇంకొన్ని ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్యాల‌యాలు ఉన్నాయి. వాటిని అమ‌రావ‌తికి త‌క్ష‌ణం త‌ర‌లించేస్తే.. ప్ర‌జ‌ల రాక‌పోక‌లు పెరుగుతాయి. త‌ద్వారా చిన్న చిన్న వ్యాపారాలు కూడా ప్రారంభం అవుతాయి.

దీంతో ప్ర‌జ‌ల‌కు వ‌చ్చే ఎన్నిక‌ల‌కు ఏడాది ముందు.. అమ‌రావ‌తితో కార్య‌కలాపాల‌కు సంబంధించిన అనుబంధం పెరుగుతుంది. త‌ద్వారా.. రేపు ఎవ‌రు వ‌చ్చినా.. అది ప్ర‌జ‌ల సెంటిమెంటుతో ముడిప‌డి ఉంటుంది కాబ‌ట్టి క‌ద‌లించేందుకు.. ప్ర‌త్యేక తీర్మానాలు చేసేందుకు అవ‌కాశం ఉండ‌ద‌ని సూచిస్తున్నారు. ప్ర‌భుత్వం త‌లుచుకుంటే ఇది పెద్ద విష‌యం కూడా కాద‌ని అంటున్నారు.