అమరావతిలో ఎన్టీఆర్ విగ్రహం.. మోడీ తోనే..!
ఏపీ రాజధాని అమరావతిలో పలునిర్మాణాల పునః ప్రారంభానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రానున్న విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 21 April 2025 10:01 AM ISTఏపీ రాజధాని అమరావతిలో పలునిర్మాణాల పునః ప్రారంభానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రానున్న విషయం తెలిసిందే. వచ్చేనెల 2న ఆయన అమరావతికి వచ్చి.. కొత్త గా చేపట్టబోయే ఐకానిక్ టవర్ల నిర్మా ణానికి శ్రీకారం చుడతారు. వీటికి సంబంధించిన టెండర్లు కూడా ఇప్పటికే పూర్తయ్యాయి.. ఈ నెల 30న వాటిని తెరవనున్నారు. అనంతరం.. బిడ్డర్లను ఖరారు చేయనున్నారు.
అయితే.. తాజాగా మరో వార్త కూడా.. తెరమీదికి వచ్చింది. రాజధాని అమరావతి నిర్మాణాలు.. భూములు, ఇతర వ్యవహారాలు చూస్తున్న మంత్రి నారాయణ.. ప్రస్తుతం గుజరాత్‌లో పర్యటిస్తున్నారు. అక్కడ నిర్మిం చిన దేశంలోనే ఎత్తయిన సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని ఆయన పరిశీలించారు. మొత్తం ఎంత విస్తీ ర్ణంలో నిర్మించారు.. దీనికి అయిన ఖర్చు.. ఇంజనీర్లు.. ఇతరత్రా వివరాలను సేకరించారు. ఈ సందర్భం గా ఆయన అక్కడి మీడియాతో మాట్లాడారు.
అమరావతిలో టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ సీఎం ఎన్టీఆర్ విగ్రహాన్ని నిర్మించనున్నట్టు తెలిపారు. పటేల్ విగ్రహం స్థాయిలో నిర్మించాలన్న ప్రతిపాదన ఉందన్నారు. ఈ క్రమంలోనే గుజరాత్‌లో ఉన్న పటేల్ విగ్రహాన్ని అన్ని కోణాల్లోనూ అధ్యయనం చేసేందుకువ చ్చామన్న ఆయన..అన్నీ అనుకున్నట్టు గా కుదిరితే.. మే 2న రానున్న ప్రధాని మోడీ చేతుల మీదుగానే.. ఎన్టీఆర్ విగ్రహ నిర్మాణానికి కూడా భూమి పూజ చేయించే అవకాశం ఉంటుందన్నారు.
ఒకవేళ మంత్రి చెప్పినట్టు నిజమైతే.. అదొ పెద్ద రికార్డే అవుతుంది. బీజేపీతో తొలిసారి దక్షిణాది నుంచి పొత్తు పెట్టుకున్న టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడికి ఘన నివాళే అవుతుంది. అయితే.. ఇది సాధ్యమేనా? అన్నది ప్రశ్న. ఎందుకంటే.. పటేల్ విగ్రహం లెక్కవేరు. అక్కడ లైబ్రరీ.. చిన్నపాటి సాగునీటి ప్రాజెక్టు అన్నీ ఉన్నాయి. ఈ నేపథ్యంలో అంత భూసేకరణ.. ఇంత తక్కవ వ్యవధిలో జరుగుతుందా? అనేది చూడాలి. అయితే.. ముందుగా సభా వేదిక వద్దే.. శంకుస్థాపన శిలా ఫలకాన్ని ఆవిష్కరించే అవకాశం లేకపోలేదు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
