అమరావతి పనులు ప్రారంభం.. పోలీసుల అలెర్ట్.. ఏం జరిగింది?
అంతేకాదు.. అసాంఘిక కార్యక్రమాల్లో పాల్గొన్నవారిని.. కేసులు ఉన్నవారిని పనుల్లో పెట్టుకోవద్దని ఆయన సూచించారు.
By: Tupaki Desk | 4 Jun 2025 2:41 PM ISTఏపీ రాజధాని అమరావతి పనులు ప్రారంభం అవుతున్నాయి. ఇప్పటికే చాలా పనులు ప్రారంభమైనా.. బుధ, గురువారాల్లో కీలకమైన పనులకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఆయా పనులను దక్కిం చుకున్న కాంట్రాక్టు సంస్థలు.. పనులు చేసేందుకు రెడీఅయ్యారు. దీంతో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల నుంచి కార్మికులను అమరావతికి తరలించారు. వారిలో కొందరికి స్థానికంగా బస ఏర్పాటు చేశారు. మరి కొందరికి సమీపంలోని అద్దె ఇళ్లను తీసుకుని కేటాయించారు.
మొత్తంగా బుధ, గురు వారాల్లో పనులు వేగం పుంజుకోనున్నాయి. అయితే.. ఇప్పటికే కొన్ని అసాంఘిక శ క్తులు.. కార్మికులపై దాడులు చేసేందుకు.. పనులు చెడగొట్టేందుకు.. పక్కా వ్యూహాలు సిద్ధం చేసుకున్నా యని.. పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయా అడ్డంకులను తొలగించేందుకు, రాజధాని పనులను సజావుగా సాగేలా చూసేందుకు పోలీసులు అలెర్ట్ అయ్యారు. ఈ క్రమంలోనే తుళ్లూరు డీఎస్పీ నిర్మాణ కంపెనీలతో తాజాగాభేటీ అయ్యారు. కార్మికుల వివరాలను తమకు ఇవ్వాలని ఆయన ఆదేశించారు.
అంతేకాదు.. అసాంఘిక కార్యక్రమాల్లో పాల్గొన్నవారిని.. కేసులు ఉన్నవారిని పనుల్లో పెట్టుకోవద్దని ఆయన సూచించారు. అలాగే.. రాజధాని ప్రాంతంలో ఎక్కడెక్కడ కార్మికులు ఉంటున్నారు? వారికి అందిస్తున్న సదుపాయాలు ఏంటనే వివరాలు తెలుసుకున్నారు. ఎట్టి పరిస్థితిలోనూ శాంతి భద్రతలకు విఘాతం కల్పించవద్దని ఆయన సూచించారు. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా వ్యవహరించాలని.. నిరంతరం.. పోలీసులు అందుబాటులో ఉంటారని.. పనులు సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని నిర్మాణ సంస్థలను ఆయన ఆదేశించారు.
అసలు ఏం జరిగింది?
అమరావతి పనులు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో దీనిని వ్యతిరేకిస్తున్న కొందరు నాయకులు, వ్యక్తు లు.. పనులకు విఘాతం కల్పించేలా చర్యలు తీసుకుంటున్నారన్నది పోలీసులకు అందిన సమాచారం. అంటే.. స్థానికంగా ఉన్న కూలీలు, తాపీ మేస్త్రీలకు(బేల్దార్ పనులు చేసేవారు) అవకాశం ఇవ్వకుండా.. వేరే ప్రాంతం నుంచి తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో పనులు జరిగే ప్రాంతంలో వారు నిరసనలు, ధర్నాలు చేపట్టే అవకాశం ఉందని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలోనే ముందుగా అప్రమత్తం అవుతున్నారు.
