ఆమంచి యూటర్న్.. టీడీపీలోకి లైన్ క్లియర్ ..!
ఈ క్రమంలోనే ఆమంచి వర్గంగా ఉన్న ఐదుగురు కౌన్సిలర్లను ఆయన తన వైపు తిప్పుకొన్నారన్నది ప్ర స్తుతం జరుగుతున్న చర్చ.
By: Tupaki Desk | 15 May 2025 4:15 PMచీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ యూటర్న్ తీసుకున్నారా.? ఆయన త్వరలోనే టీడీపీ గూటి కి చేరనున్నారా? దీనికి సంబంధించిన ప్రక్రియ కూడా.. దాదాపు పూర్తయిందా? అంటే.. ఔననే అంటు న్నారు చీరాల నియోజకవర్గం రాజకీయ నేతలు. తాజాగా చీరాల మునిసిపాలిటీని వైసీపీ నుంచి టీడీపీ కూటమి కైవసం చేసుకుంది. దీనికి ఎమ్మెల్యే కొండయ్య, ఎంపీ కృష్ణ ప్రసాద్‌లు చక్రం తిప్పారు. ముఖ్యం గా వీరిలోనూ కొండయ్య వ్యూహాత్మకంగా వ్యవహరించారు.
ఈ క్రమంలోనే ఆమంచి వర్గంగా ఉన్న ఐదుగురు కౌన్సిలర్లను ఆయన తన వైపు తిప్పుకొన్నారన్నది ప్ర స్తుతం జరుగుతున్న చర్చ. దీంతో కౌన్సిల్లో కూటమి బలం 27 కు చేరింది. పైకికూటమి అంటున్నా.. పూర్తి గా టీడీపీ ఆధిక్యం దక్కించుకుంది. అయితే.. ఇలా ఐదుగురు కౌన్సిలర్లు కొండయ్య చెప్పినట్టు వినడం వెనుక ఆమంచి అంగీకారం.. అనుమతి ఉందన్నది రాజకీయ వర్గాలు చెబుతున్న మాట. అంతేకాదు.. వ్యూహాత్మకంగా ఆమంచి కూడా తొలిస్టెప్ వేశారని తెలుస్తోంది.
ముందు తన వారిని పంపించి.. తర్వాత తాను టీడీపీ గూటికి చేరే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. ఈ విషయంలో ఎంపీ, ఎమ్మెల్యేల ఆశీర్వాదం పూర్తిగా దక్కించుకున్నారని తెలుస్తోంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన ఆమంచి చీరాలలో ఓడిపోయారు. తర్వాత.. ఆయన రాజకీయంగా సైలెంట్ అయ్యారు. కానీ.. ఇలా సైలెంట్‌గా నే ఉండిపోతే.. రాజకీయంగా ఎదుగుదల ఉండదని భావించినట్టుగా ఆమంచి వర్గం చెబుతోంది. దీంతో టీడీపీ వైపు చూస్తున్నారని సమాచారం.
దీనిలో భాగంగానే తొలుత తన వర్గం కౌన్సిలర్లుగా ఉన్న ఐదుగురిని సైకిల్ ఎక్కించారని రాజకీయ విశ్లేష కులు సైతం చెబుతున్నారు. దీంతో టీడీపీ చీరాలను దక్కించుకోవడంలో ఆమంచి కీలక రోల్ పోషించారు. ఆయన వైసీపీలో ఉండగానే.. అప్పటి మంత్రి బాలినేనిశ్రీనివాసరెడ్డికి ఎదురొడ్డి.. తన వారిని గెలిపించుకున్నారు. తర్వాత.. వైసీపీకి మద్దతు ఇచ్చేలా జగన్ వ్యవహరించారు. కానీ, పార్టీ ఓటమి, ఆమంచి పార్టీని వీడడంతో వారు ఇప్పుడు టీడీపీ వైపు మళ్లేలా చేశారు. ఈ క్రమంలో త్వరలోనే ఆమంచి కూడా.. పార్టీ మారే అవకాశం కనిపిస్తోందని అంటున్నారు.