ఆ హీరోయిన్ అవమానం... బన్నీ సిక్స్ ప్యాక్ వెనుక స్టోరీ
ఒక హీరోయిన్ చేసిన అవమానకర వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకుని అల్లు అర్జున్ సిక్స్ ప్యాక్ బాడీని చేసినట్లు చెప్పుకొచ్చాడు.
By: Tupaki Desk | 3 May 2025 9:30 AMసౌత్ హీరోల్లో మొదటి సారి సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించిన హీరో అల్లు అర్జున్. అప్పటి వరకు చాలా మంది బాలీవుడ్ హీరోలు సిక్స్ ప్యాక్ బాడీలో కనిపించారు, కానీ తెలుగు లేదా ఇతర సౌత్ హీరోలు ఆ సాహసం చేయలేదు. సిక్స్ ప్యాక్ బాడీ చేయడం అంత సులభమైన విషయం కాదని, ఫిజికల్‌గా, మెంటల్‌గా చాలా ఒత్తిడి ఉంటుందని అంటూ ఉండేవారు. అలాంటి కష్టమైన సిక్స్ ప్యాక్ బాడీతో అల్లు అర్జున్ దాదాపు ఇరవై ఏళ్ల క్రితమే కనిపించాడు. అల్లు అర్జున్ తాజాగా ఒక మీడియా సంస్థ నిర్వహించిన సమ్మిట్‌లో పాల్గొన్నారు. ఆ సమయంలో తన సిక్స్ ప్యాక్ బాడీ గురించిన ప్రస్థావన వచ్చిన సమయంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఒక హీరోయిన్ చేసిన అవమానకర వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకుని అల్లు అర్జున్ సిక్స్ ప్యాక్ బాడీని చేసినట్లు చెప్పుకొచ్చాడు. కసితో తెలుగు సినిమా ఇండస్ట్రీ గౌరవంను పెంచడం కోసం అల్లు అర్జున్ సాహస నిర్ణయం తీసుకున్నాడట. ఆ హీరోయిన్ ఎవరు, ఆమె చేసిన వ్యాఖ్యలు ఏంటి, ఎవరితో అలా మాట్లాడింది అనే విషయాలను అల్లు అర్జున్ క్లారిటీగా చెప్పలేదు. కానీ ఆమె చేసిన వ్యాఖ్యల కారణంగానే తాను సిక్స్ ప్యాక్ బాడీని చేయాలనే పట్టుదల కల్పించిందని బన్నీ చెప్పుకొచ్చాడు. ఆ మీడియా సమ్మిట్‌లో అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ హీరోయిన్ ఎవరా అంటూ అంతా ఆసక్తికగా చర్చించుకుంటున్నారు.
సమ్మిట్‌లో అల్లు అర్జున్ మాట్లాడుతూ... ఇరవై ఏళ్ల క్రితం నేను సిక్స్ ప్యాక్ బాడీలో కనిపించాను. దేశ ముదురు సినిమా కోసం తాను సిక్స్ ప్యాక్ బాడీ చేసిన సమయంలో అంతా షాక్ అయ్యారు. ఇంతకు ముందు ఎవరు చేయని పనిని చేస్తున్న సమయంలో చాలా ఉత్సాహంగా అనిపిస్తుంది. పైగా ఒక నార్త్ హీరోయిన్ తెలుగు సినిమాలో నటించే సమయంలో ఇక్కడి హీరోలు సిక్స్ ప్యాక్ చేయలేరు అంటూ వ్యాఖ్యలు చేసిందట. ఆమె మాట్లాడిన మాటలను సీరియస్‌గా తీసుకుని సిక్స్ ప్యాక్ బాడీ కోసం గట్టిగా ట్రై చేశాను. ఆ సమయంలో ఫిజికల్‌గానే కాకుండా మెంటల్‌గా చాలా ఇష్యూస్‌ను అల్లు అర్జున్ ఎదుర్కొన్నట్లు సమాచారం.
అల్లు అర్జున్ సినిమాల విషయానికి వస్తే పుష్ప 2 సినిమాతో వరల్డ్ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసిన విషయం తెల్సిందే. బాహుబలి రికార్డ్‌ను బ్రేక్ చేయడం ద్వారా బన్నీ తన సత్తా చాటాడు. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో సినిమాను చేస్తున్నాడు. ఆ సినిమాకు సంబంధించిన అనౌన్స్‌మెంట్ వచ్చింది. త్వరలోనే సినిమా నుంచి ఫస్ట్ లుక్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. వచ్చే ఏడాదిలో సినిమా విడుదల ఉండే అవకాశాలు ఉన్నాయి. అట్లీ సినిమా తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ సినిమా ఉండబోతుంది. పుష్ప 3 సినిమా కూడా ఉంటుంది అంటూ వార్తలు వస్తున్నాయి. మొత్తానికి బన్నీ రాబోయే రోజుల్లో ఫుల్ బిజీ బిజీగా ఉండబోతున్నారు.