Begin typing your search above and press return to search.

ఆర్కేకి మంగళగిరిలో నో టికెట్...?

ఇదిలా ఉంటే ఆళ్ల రామక్రిష్ణారెడ్డి రెండు టెర్ముల నుంచి ఎమ్మెల్యేగా ఉండడం వల్ల యాంటీ ఇంకెబెన్సీ తీవ్ర స్థాయిలో ఉంది అని అంటున్నారు.

By:  Tupaki Desk   |   25 Aug 2023 2:30 AM GMT
ఆర్కేకి మంగళగిరిలో నో టికెట్...?
X

వైసీపీ సీనియర్ ఎమ్మెల్యే ఆళ్ళ రామక్రిష్ణారెడ్డికి 2024 ఎన్నికల్లో మంగళగిరి నుంచి టికెట్ ఇవ్వడానికి వైసీపీ హై కమాండ్ నో చెబుతోంది అని అంటున్నారు. ఆళ్ల రామక్రిష్ణారెడ్డి 2014, 2019లలో రెండు సార్లు అక్కడ నుంచి గెలిచారు. 2014లో అయితే జస్ట్ 12 ఓట్ల తేడాతో లక్కీగా గెలిచిన ఆర్కే 2019లో నారా లోకేష్ తో పోటీ పడి అయిదు వేల ఓట్ల తేడాతో గెలిచారు. ఈ అయిదు వేల మెజారిటీ కూడా అంత గొప్పదేమీ కాదు

ఇదిలా ఉంటే ఆళ్ల రామక్రిష్ణారెడ్డి రెండు టెర్ముల నుంచి ఎమ్మెల్యేగా ఉండడం వల్ల యాంటీ ఇంకెబెన్సీ తీవ్ర స్థాయిలో ఉంది అని అంటున్నారు. వైసీపీ చేయించుకున్న సర్వే నివేదికలలో ఈ విషయం స్పష్టం అయింది అని అంటున్నారు. దాంతో ఆళ్ల కు టికెట్ ఇవ్వడానికి హై కమాండ్ వెనకంజ వేస్తోంది అని టాక్.

అయితే ఆళ్లను పోటీ చేయనీయకుండా పక్కన పెట్టడానికి కూడా హై కమాండ్ సిద్ధంగా లేదు అని అంటున్నారు. ఆయన అమరావతి రాజధాని భూ కుంభకోణాలను ఎన్నో వెలికి తీసి టీడీపీకి దాని అధినాయకత్వానికి బిగ్ ట్రబుల్స్ కలిగించేలా చేశారు. దాంతో పాటు పార్టీకి ఆయన నమ్మకమైన నేత. జగన్ కి అత్యంత సన్నిహితుడు. దాంతో ఆయనను బాపట్లకు షిఫ్ట్ చేసి అక్కడ నుంచి పోటీ చేయిస్తారు అని అంటున్నారు

ఇక బాపట్ల సిట్టింగ్ ఎమ్మెల్యే కోన రఘుపతి మీద కూడా తీవ్ర వ్యతిరేకత ఉందని సర్వే నివేదికలు వస్తున్నాయి. దాంతో ఆయనకు ఈసారి టికెట్ ఇవ్వకుండా పార్టీ ఆయనకు ఒక గట్టి భరోసా ఇస్తుందని అంటున్నారు. దాంతో కోన రఘుపతి ప్లేస్ లో ఆళ్ళను బాపట్ల పంపించి పార్టీకి ఆ సీటు దక్కేల వైసీపీ భారీ స్కెచ్ వేసింది అని అంటున్నారు.

ఈ విషయం మీద వైసీపీ అధినాయకత్వం నిర్ణయం తీసుకుందని, ఏ క్షణమైనా అధికారిక ప్రకటన వస్తుంది అని అంటున్నారు. ఇక ఆళ్ల బాపట్లకు షిఫ్ట్ అయితే మంగళగిరి నుంచి వైసీపీ తరఫున నారా లోకేష్ మీద పోటీ చేసేది ఎవరు అన్నది తీవ్ర స్థాయిలో చర్చకు వస్తోంది. ఈ సీటుని మంగళగిరిలో భారీ స్థాయిలో ఉన్న చేనేత సామాజికవర్గం నేతల నుంచే ఒకరిని ఎంపిక చేసి ఇస్తారని అంటున్నారు.

ఆ సామాజికవర్గంలో కీలక నేతలుగా ఉన్న మాజీ ఎమ్మెల్యేలు మురుగుడు హనుమంతరావు, కాండ్రు కమల వైసీపీలోకి వచ్చేశారు. అలాగే 2014లో టీడీపీ నుంచి పోటీ చేసి కేవలం 12 ఓట్ల తేడాతో ఓడిన గంజి చిరంజీవి కూడా వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు. దాంతో ఈ ముగ్గురిలో ఒకరికి టికెట్ ఇవ్వడం ఖాయం. అయితే వైసీపీ అధినాయకత్వం మాత్రం గంజి చిరంజీవికే టికెట్ ఇవ్వడానికి మొగ్గు చూపుతోంది అని అంటున్నారు.

ఆయనకు చేనేత కమ్యూనిటీలో గట్టి పట్టు ఉండడమే ఇందుకు కారణం అని అంటున్నారు. 2014లో గెలుపు అంచులను తాకిన చిరంజీవి ఈసారి నారా లోకేష్ మీద గెలిచి తీరుతాను అంటున్నారు. మరో వైపు నారా లోకేష్ కూడా మంగళగిరి నాది అని అంటున్నారు. చూడాలి మరి ఇక్కడ జనం తీర్పు ఎలా ఉంటుందో. ఏది ఏమైనా ఆళ్ళకు మాత్రం బాపట్ల టికెట్ ఖాయమని అంటున్నారు.