ఆళ్ల నాని.. అడ్రస్ చెప్పవేమీ ..!
మరోవైపు.. వైసీపీని వీడి బయటకు వచ్చినా.. ఆ పార్టీ నాయకులు ఆళ్లతో టచ్‌లో ఉన్నారన్నది టీడీపీ నేతలు చెబుతున్న మాట.
By: Tupaki Desk | 13 Aug 2025 8:00 AM ISTఏలూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, కాపు సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీని వాస్.. ఉరఫ్ నాని.. అడ్రస్ ఎక్కడా కనిపించడం లేదు. ఆయన నియోజకవర్గంలోనే ఉన్నారా? లేక.. వేరే ప్రాంతంలో ఉంటున్నారా? అనేది పెద్ద చర్చగా మారింది. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన తర్వాత.. ఆళ్ల ఎక్కడా కనిపించలేదు. వాస్తవానికి పార్టీలో చేరిన వారికి కూడా సీఎం చంద్రబాబు పనులు అప్పగించారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొనాలని దిశానిర్దేశం చేశారు.
ఈ క్రమంలో ఒకరిద్దరు జంపింగులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కానీ, ఆళ్ల విషయానికి వస్తే మా త్రం దీనికి భిన్నంగా జరుగుతోంది. ఆయన తొలి రెండు రోజులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కానీ, ఇత ర నాయకులు కలిసి రాలేదు. దీనిపై స్థానిక నాయకత్వాన్ని కోట్ చేస్తూ.. అధిష్టానానికి ఫిర్యాదులు చేశారు. అయితే.. అధిష్టానం ఈ విషయంపై పెద్దగా స్పందించలేదు. ఇతర నేతలను కలుపుకొని పోవాలని ఆళ్లకు కొందరు నేతలు సూచించారు. కానీ.. ఆయన అప్పటి నుంచి మౌనంగా ఉంటున్నారు.
మరోవైపు.. వైసీపీని వీడి బయటకు వచ్చినా.. ఆ పార్టీ నాయకులు ఆళ్లతో టచ్‌లో ఉన్నారన్నది టీడీపీ నేతలు చెబుతున్న మాట. దీనిలో ఎంత వాస్తవం ఉందో తెలియదు కానీ.. కొందరు నాయకులతో ఆళ్ల హైదరాబాద్‌లో పార్టీ చేసుకున్నారన్నది టీడీపీ నేతలు చెబుతున్నారు. దీనిపై చర్చకొనసాగుతూనే ఉం ది. మరోవైపు.. ఆళ్ల వైసీపీలోకి వెళ్లే దిశగా అడుగులు పడుతున్నాయని ఆయన అనుచరులు హింటిస్తు న్నారు. వైసీపీపై ఎలాంటి విమర్శలు చేయకపోవడం, పార్టీ పరంగా ఆయనకు ఎలాంటి అన్యాయం చేయలేదన్న వాదన కూడా ఉండడం దీనికి బలాన్ని చేకూరుస్తోంది.
ఈ చర్చ జరుగుతున్న సమయంలోనే ఆళ్ల నాని ఎక్కడా కనిపించకుండా వ్యవహరిస్తున్నారు. ఈ విష యంపై మీడియా వర్గాల్లో చర్చకు రాగానే ఆయన కోసం రెండు మూడు ఆన్‌లైన్ ఛానెళ్లు ప్రయత్నించా యి. కానీ, నానీ మాత్రం వారికి కూడా అందుబాటులోకి రాకపోగా, ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ చేసుకున్నట్టు తెలిసింది. ప్రస్తుతం ఏలూరులో ఆళ్ల నానీ వ్యవహారం ఆసక్తిగా మారింది. మరి ఆయనకు టీడీపీలో చోటు ఉంటుందా? లేక.. వైసీపీలోకే ఆయన తిరిగి వెళ్లిపోతారా? అనేది చూడాలి. ఏదేమైనా.. పార్టీ మారడం తేలికే అయినా.. ఆ పార్టీలో కొనసాగడం మాత్రం నానీకి ఇబ్బందిగానే మారిందన్నది వాస్తవం అంటున్నారు పరిశీలకులు.
