Begin typing your search above and press return to search.

ఇన్‌ కమ్‌ ట్యాక్స్‌ అలర్ట్‌... అతిముఖ్యమైన సమాచారం ఇది!

ఈ విషయంలో అతితెలివి చూపిస్తూ అవకతవకలకు పాల్పడే వారిపై కేంద్రం నిఘావేసి ఉంచిందని తెలుస్తుంది.

By:  Tupaki Desk   |   14 Aug 2023 11:45 AM GMT
ఇన్‌  కమ్‌  ట్యాక్స్‌  అలర్ట్‌... అతిముఖ్యమైన సమాచారం ఇది!
X

ఇన్‌ కమ్‌ ట్యాక్స్‌ రిటన్స్ ఫైల్ చేసే విషయలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. ఈ విషయంలో అతితెలివి చూపిస్తూ అవకతవకలకు పాల్పడే వారిపై కేంద్రం నిఘావేసి ఉంచిందని తెలుస్తుంది. ఇందులో భాగంగా ఆదాయపు పన్ను శాఖ వారు లక్ష మందికి నోటీసులు పంపారు.

అవును... రిటర్నులు వేయని వారు, ఆదాయం తక్కువ చూపించి రిటర్ను వేసిన వారు, తప్పుడు సమాచారంతో రిటర్ను వేసిన వారు అంటూ మూడురకాలుగా విభజించిన ఆదాయపుపన్ను శాఖ... లక్ష నోటీసులు పంపించింది. ఏదో మొక్కుబడిగా వేసిన రిటర్నులు లేదా ఏదో కట్టేశాం లే తప్పదుకదా అనుకుంటూ, మమ అని చేతులు దులుపుకున్న వారిపై ఐటీ ప్రత్యేక శ్రద్ధ పెట్టిందంట.

ఇందులో భాగంగా ముందుగా ముందుగా.. ఆదాయపు పన్ను శాఖ అధికారులు సేకరించిన సమాచారాన్ని బట్టి రూ. 50,00,000 ఆదాయం ఉన్న వారిని ముందుగా టార్గెట్ చేశారని తెలుస్తోంది! ఆదాయం ఇలా ఉన్న వారిలో ఐటీ రిటన్స్ వేయని వారు, తక్కువగా చూపించిన వారు, తప్పుగా చూపించిన వారిని ఎంచుకున్నారట.

అలా అని ఇవేవో అల్లాటప్పగా, రెగ్యులర్ గా జరిగే కార్యక్రమం లాంటిది అనుకోవద్దని బల్లగుద్ది మరీ చెబుతున్నారంట అధికారులు! ఇదే సమయంలో 2021–22 ఆర్థిక సంవత్సరానికి గాని వేతన జీవులకు నోటీసులు పంపుతున్నారట.

ఇదే సమయంలో వేతన జీవుల్లో అయితే ముఖ్యంగా... ఇంటద్దె అలవెన్సు, లీవ్‌ ట్రావెల్‌ అలవెన్సు, ఇంటి రుణంపై వడ్డీ, మున్సిపల్‌ ట్యాక్స్‌ చెల్లింపులు, సెక్షన్‌ 80 కింద చెల్లింపులు, పెట్టుబడులు, సేవింగ్స్‌, పిల్లల స్కూలు ఫీజులు మొదలైన వంటి వాటిలో దొంగ రసీదులు పుట్టించే పనులు మానుకోవాలని ఐటీ అధికారులు సూచిస్తున్నారని తెలుస్తోంది.

అవును... కొంత మంది దొంగ రశీదులు, బిల్లులు పెడుతున్నారని.. కుటుంబ సభ్యుల మీద ఇల్లు ఉంటే అద్దె చెల్లించకుండా అద్దె చెల్లించినట్లు క్లెయిమ్‌ చేస్తున్నారని అంటున్నరు. దీనివల్ల మరింత ప్రమాధం అని చెబుతున్నారు. డిపార్ట్మెంట్‌ వారికున్న అధికారం ప్రకారం అవసరమైతే ఆరేళ్లు వెనక్కి వెళ్లి అసెస్మెంటుని రీ–ఓపెన్‌ చేయొచ్చనే విషయాన్ని మరిచిపోవద్దని చెబుతున్నారంట.

సో... ఇకపై ఆదాయపు పన్ను దాఖలు చేసే విషయంలో వీలైనంత నిజాయితీగా, నిబద్దతగా నడుచుకుంటూ.. తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట. అలాకానిపక్షంలో ఇబ్బందులు తప్పవన్నమాట.