Begin typing your search above and press return to search.

అందమే ఆమెకు శాపం.. 50 ఇంటర్వ్యూలలో విఫలం.. ఆవేదన వ్యక్తం చేస్తున్న యువతి!

ఆమె అందమే ఆమెకు శాపంగా మారింది.. చాలామంది అందంగా ఉండడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.

By:  Tupaki Desk   |   20 Sept 2025 6:00 PM IST
అందమే ఆమెకు శాపం.. 50 ఇంటర్వ్యూలలో విఫలం.. ఆవేదన వ్యక్తం చేస్తున్న యువతి!
X

ఆమె అందమే ఆమెకు శాపంగా మారింది.. చాలామంది అందంగా ఉండడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.అంద విహీనంగా ఉంటే సమాజంలో చిన్న చూపు ఉంటుంది.అందుకే ప్రతి ఒక్కరూ అందంగా ఉండాలని తాపత్రయపడతారు. అయితే అందరూ ఏమో గానీ ఈమె పాలిట అందమే శాపంగా మారింది. ఎందుకంటే అందంగా ఉన్నందుకు ఉద్యోగాలు ఇవ్వట్లేదట.. మరి ఇంతకీ ఆమె ఎవరు? అందం కారణంగా ఉద్యోగం రాకపోవడం ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ మధ్యకాలంలో వివాహేతర సంబంధాలు ఎక్కువైపోతున్నాయనే వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఉద్యోగం చేసే మహిళలు తమ తోటి ఉద్యోగులతో లేక బాస్ లతో రాసుకుపూసుకు తిరుగుతూ.. వివాహేతర సంబంధం పెట్టుకుంటున్నారని, అలాగే బిజినెస్ చేసే బిజినెస్ పార్టనర్లతో ఇలా ప్రతి ఒక్కరంగంలో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారు అనే వార్తలు కూడా ఎప్పటికప్పుడు మనకు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంటాయి. అయితే ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్పాల్సి వస్తోంది అంటే బ్రెజిల్ కి చెందిన 21 ఏళ్ల అలే గౌచా అనే అమ్మాయి తనకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ ఉద్యోగం ఎవరూ ఇవ్వట్లేదు అంటూ వాపోయింది. దానికి సంబంధించిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..

విషయంలోకి వెళ్తే.. బ్రెజిల్ కి చెందిన అలే గౌచా ఇప్పటివరకు దాదాపు 50 ఇంటర్వ్యూలకు వెళ్లిందట. కానీ ఏ ఇంటర్వ్యూలో కూడా తనని సెలెక్ట్ చేయడం లేదట.అన్ని నైపుణ్యాలు, అర్హతలు ఉన్నప్పటికీ కూడా తనని ఆ ఉద్యోగం కోసం ఎంపిక చేయకపోవడంతో అలే గౌచా కాస్త నిరుత్సాహపడింది. దాంతో తన బాధను అంతా సోషల్ మీడియా ద్వారా బయటపెట్టింది. "నేను కేర్ టేకర్ పోస్ట్ కి అప్లై చేశాను. కానీ నా అందమే నా ఉద్యోగానికి శాపం అయింది. ఎందుకంటే నేను అందంగా ఉన్నాను. ఆకర్షణీయంగా ఉన్నాను అనే కారణంతో ఎవరూ కూడా నన్ను కేర్ టేకర్ గా తీసుకోవడం లేదు.

అయితే అందానికి - ఉద్యోగానికి మధ్య సంబంధం ఏముందని మీరు అనుకోవచ్చు. కానీ నేను అందంగా ఉండడం వల్ల కేర్ టేకర్ గా తీసుకుంటే ఎక్కడ వివాహేతర సంబంధాలు పెట్టుకుంటారో అనే ఉద్దేశంతో నన్ను చాలామంది రిజెక్ట్ చేస్తున్నారు. చాలామంది మహిళలు కేర్ టేకర్ గా వారి ఇంట్లోకి ఆహ్వానిస్తే.. ఎక్కడ వాళ్ళ మగవాళ్ళు నాతో వివాహేతర సంబంధం పెట్టుకుంటారో అని భయపడుతున్నారు. ఈ కారణం వల్లనే నాకు ఉద్యోగం లభించడం లేదు" అంటూ వాపోయింది. అయితే ఎక్కడా ఉద్యోగం దొరకకపోవడంతో అలే గౌచా ప్రస్తుతం కంటెంట్ క్రియేటర్(అడల్ట్) గా మారినట్లు తెలిపింది.

అలా ఎవరూ పని కల్పించకపోవడంతో తనకు తానే పని కల్పించుకుంది. ప్రస్తుతం అలే గౌచా పెట్టిన పోస్ట్ నెట్టింట్లో వైరల్ గా మారడంతో చాలామంది రకరకాలుగా స్పందిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కొంతమంది మహిళలు ఇలా వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం వల్లే నిజాయితీగా ఉన్నవారిపై కూడా అలాంటి ముద్ర పడుతుంది అని కామెంట్స్ పెడుతున్నారు. అలా ఒకరు చేసిన తప్పు అందరికీ వర్తిస్తుంది అన్నట్లుగా ఎవరో చేసే తప్పు మరొకరికి శాపంగా మారుతుంది అని నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.