భారత యువత మధ్యానికి భానిస అవుతుందా..? కారణం ఏమై ఉంటుందంటే..?
సినిమాకెళ్లినా.. అంతెందుకు సీరియల్ చూడాలనుకున్నా మొదట కనిపించేది కన్జమ్షన్ యాడ్.
By: Tupaki Desk | 7 Aug 2025 4:00 PM ISTసినిమాకెళ్లినా.. అంతెందుకు సీరియల్ చూడాలనుకున్నా మొదట కనిపించేది కన్జమ్షన్ యాడ్. లిక్కర్ తీసుకోకండి, స్మోకింగ్ చేయకండి అనే కనిపిస్తుంది. ఇది చూసి జనం మారుతారనే లక్ష్యంతో దీన్ని ముందుగా ప్రదర్శిస్తారు. సినిమా రన్నింగ్ లో కూడా ఆల్కహాల్, స్మోకింగ్ ఉన్న చోట కిల్స్, ఆరోగ్య కరమైన హెచ్చరికలు వేస్తుంటారు. అయితే ఇది చూసిన జనం మానేస్తారనడం ఎంత వరకు నిజమో తెలియదు కానీ. నేడు పెరగుతున్న లిక్కర్ వియోగాన్ని చూసి వైద్యులు, ఆరోగ్య నిపుణులు మాత్రం ఆందోళన చెందాల్సి వస్తుంది.
ఇటీవల సర్వేలో సంచలన విషయాలు..
ఇటీవల ఒక సర్వేలో సంచలన విషయాలు వెలువడ్డాయి. ప్రపంచ వ్యాప్తంగా ఆల్కహాల్ వాడకం తగ్గిందట. ఇది సంతోషించే విషయమే కానీ భారత్ కు మాత్రం కాదు. ఎందుకంటే అంతటా తగ్గుతున్నా.. భారత్ లో మాత్రం పెరుగుతుందంట. మారుతున్న జీవినశైలి దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తోందని సర్వేలు చెప్తున్నాయి. భారత్ ప్రస్తుతం ఎదుగుతోంది. ఆర్థిక పరంగా వరల్డ్ లోనే ఐదో స్థానంలో కొనసాగుతోంది. సగటు వ్యక్తి సంపాదన కూడా కొంతలో కొంత వరకు పెరిగింది. దీంతో యువత మద్యం వైపు చూస్తున్నారు.
పెరిగేందుకు కారణం ఇదేనా..?
పెరుగుతున్న పని ఒత్తిడి కూడా కొంత కారణం కావచ్చన్న వార్తలు వినిపిస్తున్నాయి. ప్రపంచంలోనే ఇండియా కార్మిక శక్తిలో పెద్దది. ఇక్కడి జనాభా ప్రపంచంలోనె నెంబర్-1 కాబట్టి కార్మికులు కూడా ఎక్కువ, ఇందులో భారతీయ యువత శ్రమశక్తిని నమ్ముకుంటారు. అందుకే వీదేశాలలో ఇండియన్ వర్కర్స్ కు విలువ ఎక్కువ ఉంటుంది. వారికి ఇచ్చే వేతనం మాత్రం తక్కువగానే ఉంటుంది. ఎక్కువ వర్క్, తక్కువ వేతనం, దీనికి తోడు ఇండియన్స్ కుటుంబానికి ఎక్కువ విలువలిస్తారు. కాబట్టి పండుగలు, కుటుంబ పరమైన ఫంక్షన్లు కూడా వీటికి కారణమని కొందరు చెప్తారు. ఏది ఏమైనా గ్లోబల్ గా ఆల్కహాల్ కన్జమ్షన్ తగ్గుతున్నా.. భారత్ లో మాత్రం పెరగడం కొంత ఇబ్బందులకు దారం తీస్తుంది.
