అక్షయ తృతీయతో మార్కెట్‌లో కళకళ.. ఒక్కరోజే 16 వేల కోట్లు!
నేడు అక్షయ తృతీయ సందర్భంగా దేశవ్యాప్తంగా భారీ బిజినెస్ జరుగుతోంది.
By: Tupaki Desk | 30 April 2025 9:28 AM ISTనేడు అక్షయ తృతీయ సందర్భంగా దేశవ్యాప్తంగా భారీ బిజినెస్ జరుగుతోంది. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (కెయిట్) అంచనా ప్రకారం ఒక్కరోజే ఏకంగా రూ.16 వేల కోట్ల విలువైన కొనుగోళ్లు జరగనున్నాయి. హిందూ, జైన సంప్రదాయాలలో ఈ రోజుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అక్షయ తృతీయ నాడు బంగారం, వెండి కొనుగోలు చేస్తే శుభప్రదంగా భావిస్తారు. ఈ నమ్మకంతో ప్రజలు పెద్ద ఎత్తున కొనుగోళ్లు చేసేందుకు రెడీ అవుతున్నారు.
కెయిట్ అంచనాల ప్రకారం ఈరోజు దాదాపు 12 టన్నుల బంగారం అమ్ముడుపోనుండగా దాని విలువ దాదాపు రూ.12 వేల కోట్లు ఉంటుందని తెలుస్తోంది. ఇక వెండి విషయానికి వస్తే దాదాపు 40 టన్నుల వెండి అమ్మకాలు జరగవచ్చని, దీని విలువ దాదాపు రూ.4 వేల కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు.
అక్షయ తృతీయ రోజున బంగారం, వెండి కొనడం ఒక సంప్రదాయంగా వస్తోంది. ఈ రోజున కొనుగోలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని, సంపద పెరుగుతుందని చాలా మంది నమ్ముతారు. అందుకే ప్రజలు ఈ పవిత్రమైన రోజున తమకు వీలైనంతలో బంగారం లేదా వెండిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు.
ఈసారి అక్షయ తృతీయ సందర్భంగా మార్కెట్‌లో సందడి నెలకొంది. జ్యువెలరీ షాపులు సరికొత్త డిజైన్లతో వినియోగదారులను ఆకర్షించడానికి సిద్ధంగా ఉన్నాయి. ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లు కూడా ప్రత్యేక ఆఫర్‌లతో కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నాయి. దీంతో ఈసారి అమ్మకాలు రికార్డు స్థాయిలో ఉండవచ్చని వ్యాపారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
మొత్తానికి అక్షయ తృతీయ సందర్భంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ భారీ వ్యాపారం ఆర్థిక వ్యవస్థకు కూడా ఊతమిచ్చే అంశంగా చూడవచ్చు. బంగారం, వెండి వ్యాపారులు ఈ పండుగ సీజన్‌ను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
