ఆళ్లగడ్డలో మరో పంచాయతీ.. ప్రమాణానికి అఖిల ప్రియ సిద్ధం!
ప్రస్తుతం గ్రామాల్లో పనులు జరుగుతున్నాయి. రహదారుల నిర్మాణం, పచ్చదనం అభివృద్ది వంటి కార్య క్రమాలు.. పంచాయతీ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ముమ్మరంగా జరుగుతున్నాయి.
By: Tupaki Desk | 3 May 2025 3:56 PMఉమ్మడి కర్నూలు జిల్లాలోని పలు నియోజకవర్గాలు రాజకీయంగా హాట్‌హాట్‌గా ఉన్న విషయం తెలిసిందే. వీటిలోనూ ప్రధానంగా ఆళ్లగడ్డ నియోజకవర్గం మరింత హాట్‌గా ఉంటుంది. ఇక్కడ నుంచి గత ఎన్నికల్లో విజయం దక్కించుకున్న భూమా అఖిల ప్రియ ఫైర్ బ్రాండ్ పాలిటిక్స్‌కుకేరాఫ్‌గా ఉన్నారు. సొంత పార్టీ నాయకులపైనే ఆమె కారాలు మిరియాలు నూరుతారు. ఎవరూ తనను ఎదిరించేవారు లేరని ఆమె చెబుతారు. అయితే.. తాజాగా ఆమెపై కొన్నాళ్లుగా ఆరోపణలు గుప్పుమంటున్నాయి.
ప్రస్తుతం గ్రామాల్లో పనులు జరుగుతున్నాయి. రహదారుల నిర్మాణం, పచ్చదనం అభివృద్ది వంటి కార్య క్రమాలు.. పంచాయతీ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ముమ్మరంగా జరుగుతున్నాయి. వీటిని చిన్నపా టి కాంట్రాక్టర్లు చేస్తున్నారు. అయితే.. వీరి నుంచి భూమా లంచాలు తీసుకుంటున్నారన్నది సొంత పార్టీ నాయకులు చేస్తున్న ఆరోపణ. వారు ఆధారాలతో సహా .. రెండు రోజుల కిందట టీడీపీ వ్యతిరేక మీడియాకు ఉప్పందించారు. దీంతో విషయం బయట పడింది.
దీంతో తాజాగా భూమా అఖిల ప్రియ నిప్పులు చెరిగారు. సొంత పార్టీ నాయకులే తనకు గోతులు తీస్తున్నా రని ఆమె ఆరోపించారు. అంతేకాదు.. తను తప్పులు చేయకపోయినా.. చేశానని చెబుతున్నారని.. ఇంగితం లేని టీడీపీ వ్యతిరేక మీడియా దీనిని ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. తనకు ధైర్యం.. సత్తా ఉన్నాయని.. తాను అవినీతి చేయలేదని నిరూపిస్తానని ఆమె సవాల్ రువ్వారు.
తనపై ఆరోపణలు చేసిన వారు.. అహోబిలం నృసింహస్వామి ఆలయానికి రావాలని.. ఇక్కడ తాను లంచాలు తీసుకోలేదని ప్రమాణం చేస్తానని.. చెప్పారు. వారు లంచాలు తీసుకున్నట్టుగా నిరూపించి ప్రమాణం చేయాలని సవాల్ రువ్వారు. ఇది నిజమైతే.. తాను ఎమ్మెల్యే సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తానని ఆమె హెచ్చరించారు. దీంతో మరోసారిఆళ్లగడ్డలో టీడీపీ అంతర్గత కుమ్ములాటలు బహిర్గతం అయ్యాయని.. వీటిని కంట్రోల్ చేయాలని నాయకులు సూచిస్తున్నారు.