Begin typing your search above and press return to search.

అకాశ్ అంబానీలో ఇంత మ్యాటర్ ఉందా?

ఐఐటీ బాంబే నిర్వహించిన టెక్ ఫెస్ట్ లో పాల్గొన్న అకాశ్ అంబానీ.. విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు

By:  Tupaki Desk   |   29 Dec 2023 4:28 AM GMT
అకాశ్ అంబానీలో ఇంత మ్యాటర్ ఉందా?
X

వ్యాపార పరంగా తీసుకునే దూకుడు నిర్ణయాలు.. కార్పొరేట్ ప్రపంచంలో ఒద్దికగా.. పొందికగా మాట్లాడే మాటలకు భిన్నంగా.. రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ఛైర్మన్ గా వ్యవహరిస్తున్న అకాశ్ అంబానీ తాజాగా అదరగొట్టేశారు. బాంబే ఐఐటీలో నిర్వహించిన టెక్ ఫెస్ట్ లో పాల్గొన్న ఆయన.. తనను ఐఐటీ బాంబేకు అతిధిగా ఆహ్వానించారని.. తనకు మాట్లాడే అవకాశం కల్పించిన విషయాన్ని తన తండ్రి ముకేశ్ అంబానీకి చెప్పినప్పుడు ఆయన రియాక్షన్ గురించి చెప్పి.. అందరిని నవ్వేలా చేశారు.

ఐఐటీ బాంబే నిర్వహించిన టెక్ ఫెస్ట్ లో పాల్గొన్న అకాశ్ అంబానీ.. విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఈ క్రమంలో ఐఐటీ బాంబేకు రావటం ఎలా ఉందన్న ప్రశ్నకు బదులిస్తూ.. ''ఇక్కడకు రావటం నా టర్గెట్లలో ఒకటి. నేను ఇంజినీర్ ను కావాలని మా నాన్న కోరుకునే వారు. కానీ.. నేను ఇంజినీర్ ను కాలేదు. కానీ.. ఈ ప్రతిష్ఠాత్మక ఇంజినీరింగ్ కాలేజీలో ప్రసంగించేందుకు ఛాన్స్ రావటం ఎంతో ఆనందంగా ఉంది. కానీ.. ఇక్కడ ప్రసంగించే ఛాన్సు వచ్చిందని మా నాన్నకు చెబితే నమ్మలేదు. అందుకు సాక్ష్యం కోసం నా వెంట నా భార్యను పంపారు'' అంటూ చేసిన వ్యాఖ్యకు విద్యార్థుల నుంచి భారీ స్పందన లభించింది.

తన మాటలతో ఐఐటీ బాంబే విద్యార్థులతో ఇట్టే కనెక్టు అయిన ఆకాశ్ అంబానీ.. తన కాలేజీ డేస్ గురించి చెప్పుకొచ్చారు. లక్కీగా తనకు కాలేజీ లైఫ్ కు సంబంధించి మంచి మెమరీస్ ఉన్నాయన్న అతను.. ''జీవితంలో ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే.. కాలేజీలో గడిపిన సమయమే బెస్ట్ టైం'' అని వ్యాఖ్యానించటం విశేషం. అంతేకాదు.. తనకుమళ్లీ కాలేజీ రోజుల్లోకి వెళ్లే అవకాశం వస్తే మాత్రం తాను ఇంజనీరింగ్ విద్యను అభ్యసించేందుకు ప్రయత్నిస్తానని వ్యాఖ్యానించారు.

తాను చదువుకునే రోజుల్లో క్లాస్ లో తన క్లాస్ మేట్స్ నుంచి ఎక్కువగా నేర్చుకోవటం మీద తాను ఫోకస్ చేయలేదని.. వారి నుంచి కూడా నేర్చుకొని ఉంటే బాగుండేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేయటం గమనార్హం. అకాశ్ అంబానీ నోటి నుంచి వచ్చిన ఈ వ్యాఖ్యను అండర్ లైన్ చేసుకోవాల్సిన అవసరం ప్రతి విద్యార్థికి ఉందని చెప్పాలి. ఒక విద్యార్థికి చదువుతో పాటు సమాజంలో కలివిడిగా ఉండటం ముఖ్యమన్న అతను.. తన వ్యక్తిగత విషయాలతో పాటు.. తమ సంస్థ ఫ్యూచర్ ప్లాన్ గురించి మాట్లాడారు.

బాంబే ఐఐటీ టెక్ ఫెస్ట్ లో అకాశ్ అంబానీ మాట్లాడిన మాటల ప్రసంగం వైరల్ గా మారింది. ఐఐటీ బాంబేతో కలిసి భారత్ జీపీటీ ప్రోగ్రాంపై పని చేస్తున్నామని.. ఏఐతో ప్రతి రంగంలోనిఉత్పత్తులు.. సేవల్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావొచ్చని పేర్కొన్నారు. టెక్ ఫెస్ట్ లో అకాశ్ అంబానీ స్పీచ్ వీక్షించాలనుకుంటే..