Begin typing your search above and press return to search.

గేదెల పోటీ పండుగకి ఐశ్వర్య, అనుష్క

కర్ణాటకకు చెందిన కంబళ ఉత్సవాలు ఈ మధ్య కాలంలో మొత్తం దేశం దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

By:  Tupaki Desk   |   6 Nov 2023 8:06 AM GMT
గేదెల పోటీ పండుగకి ఐశ్వర్య, అనుష్క
X

కర్ణాటకకు చెందిన కంబళ ఉత్సవాలు ఈ మధ్య కాలంలో మొత్తం దేశం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. కంబళ ఉత్సవం అంటే గేదెల పరుగు పందాలు. ఒకప్పుడు కర్ణాటక తీర ప్రాంతంలో మాత్రమే కంబళ ఉత్సవాలు జరిగేవి. కానీ గత కొన్నాళ్లుగా ఈ ఉత్సవాల గురించి దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో క్యాష్ చేసుకునేందుకు బెంగళూరు లో ఏర్పాటుకు రెడీ అయ్యారు.

నవంబర్ నుంచి మార్చి వరకు కర్ణాటకలో ఏదో ఒక మూల కంబళ ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి. స్థానిక పరిస్థితులను బట్టి పోటీ సమయం ఆధార పడి ఉంటుంది. బెంగళూరు లో కంబళ ఉత్సవాలను నవంబర్‌ 25, 26న నిర్వహించేందుకు గాను పాలెస్ గ్రౌండ్స్ ను రెడీ చేస్తున్నారు. బురదలో గేదెలను పరిగెత్తిస్తూ వాటితో పాటు మనుషులు కూడా పరిగెత్తుతూ ఉంటారు.

మొదటి సారి బెంగళూరు లో ఈ ఉత్సవం జరుగబోతున్న నేపథ్యం లో భారీ ఎత్తున జనాలు వస్తారనే చర్చ జరుగుతోంది. ప్రభుత్వ అంచనా ప్రకారం 10 లక్షల మంది జనాలు రెండు రోజుల పాటు ఈ ఉత్సవం చూసేందుకు గాను బెంగళూరు లోని పాలెస్ గ్రౌండ్స్ కి తరలి వస్తారని అంచనా. వేరే రాష్ట్రాల నుంచి కూడా భారీ ఎత్తున ప్రేక్షకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

నిర్వాహకులు కంబళ ఉత్సవాలకు గ్లామర్ తీసుకు వచ్చే విధంగా సినీ తారలను ఆహ్వానించారు. ఇప్పటికే ఐశ్వర్య రాయ్, అనుష్క శెట్టి, కేజీఎఫ్‌ స్టార్ యశ్‌ తో పాటు పలువురు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఓకే చెప్పారు. కార్యక్రమంకు మరో ఇరవై రోజుల సమయం ఉంది కనుక అప్పటి వరకు ఈ జాబితా మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి.

వందల ఏళ్లుగా కర్ణాటక ప్రజలు ఆచారంగా, సాంప్రదాయంగా సాగిస్తూ వస్తున్న కంబళ ఉత్సవం ను ఈసారి బెంగళూరు లో నిర్వహించడం ను కొందరు తప్పుబడుతూ ఉంటే.. మరి కొందరు మాత్రం బెంగళూరు లో కంబళ ఉత్సవం నిర్వహించడం ద్వారా కన్నడ సంస్కృతి ప్రపంచానికి చూపించినట్లు అవుతుందని అంటున్నారు.