Begin typing your search above and press return to search.

తుఫానులో విమానం... వీడియో చూడాల్సిందే!

గెరిట్ తుఫాను యూకే, ఐర్లాండ్ లను వణికించిన సంగతి తెలిసిందే. ఈ తుఫాను ఆ రెండు దేశాలనూ బలంగా తాకింది.

By:  Tupaki Desk   |   29 Dec 2023 7:55 AM GMT
తుఫానులో విమానం... వీడియో చూడాల్సిందే!
X

గెరిట్ తుఫాను యూకే, ఐర్లాండ్ లను వణికించిన సంగతి తెలిసిందే. ఈ తుఫాను ఆ రెండు దేశాలనూ బలంగా తాకింది. దీంతో ఈ తుఫాను విమానయానాన్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. దీంతో దేశంలో పలు విమానయాన సర్వీసులను రద్దు చేశారు. ఇదే సమయంలో మరికొన్ని విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

ఇదే సమయంలో తుఫాను కారణంగా బ్రిటిష్ ఎయిర్‌వేస్ సుమరు 13 విమానాలను రద్దు చేసింది. ఈ సమయంలో తుపాను వల్ల చాలా విమానాలు ల్యాండ్ కావడానికి ఇబ్బంది పడ్డాయి. ఈ సమయంలో డిసెంబర్ 27న హీత్రూలో ల్యాండింగ్ అవుతున్న సమయంలో ఒక అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానం ఊగిసలాడిన దృశ్యం కెమెరాకు చిక్కింది.

అవును... అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌ కు చెందిన బోయింగ్‌ 777 ఫ్లైట్‌ 134 లాస్‌ ఏంజెల్స్‌ నుంచి లండన్‌ కు బయల్దేరింది. అయితే లండన్‌ లోని హీత్రో విమానాశ్రయంలో బుధవారం స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 11:30 గంటలకు ల్యాండ్‌ అవుతున్న సమయంలో భారీగా గాలులు వీచాయి. దీంతో విమానం ఒక్కసారిగా కుదుపులకు గురైంది.

ఈ ఘటనతో ప్రయాణికులు, సిబ్బంది, విమానాశ్రయ అధికారులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు! అయితే... ఎటువంటి ప్రమాధం లేకుండా విమానం సేఫ్‌ గా ల్యాండ్‌ కావడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

కాగా... గెరిట్ తుఫాను కారణంగా బ్రిటన్ అతలాకుతలమవుతుంది. తుఫాను ప్రభావంతో సుమారు 70 మైళ్ల వేగంతో బలమైన గాలులు వీస్తున్నాయి. ఈ స్థాయిలో ఏర్పడుతున్న ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. దీంతో బ్రిటన్‌ కు రాకపోకలు సాగించే పలు విమానాలు, రైళ్లు ఆసల్యంగా నడుస్తున్నాయి. ఇప్పటికే మరికొన్నింటిని అధికారులు రద్దు చేశారు.