Begin typing your search above and press return to search.

కొత్త మార్గదర్శకాలు: 3 గంటలకు పైగా లేట్ అయితే ఫ్లైట్ రద్దు

అదే సమయంలో ప్రయాణికులకు సరైన సమాచారాన్ని అందించాల్సిన అంశాల్ని పేర్కొంది

By:  Tupaki Desk   |   16 Jan 2024 8:30 AM GMT
కొత్త మార్గదర్శకాలు: 3 గంటలకు పైగా లేట్ అయితే  ఫ్లైట్ రద్దు
X

డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) కీలక ప్రకటన చేసింది. విమానాల ఆలస్యం.. రద్దుకు సంబంధించి చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో కొత్త మార్గదర్శకాల్ని వెల్లడించింది. పొగమంచు కారణంగా దేశ రాజధాని డిల్లీలో విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం కలుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా విమాన యాన సంస్థలకు.. ప్రయాణికులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంటోంది. తమ విమాన ప్రయాణాలకు సంబంధించిన వివరాల్ని ఎప్పటికప్పుడు ప్రయాణికులకు తెలిపేలా జాగ్రత్తలు తీసుకోవటంతో పాటు.. చేపట్టాల్సిన చర్యల గురించి అందులో వివరించింది.

అదే సమయంలో ప్రయాణికులకు సరైన సమాచారాన్ని అందించాల్సిన అంశాల్ని పేర్కొంది. ప్రతికూల వాతావరణం కారణంగా మూడు గంటలకు మించి విమానాలు ఆలస్యమైన పక్షంలో విమానాన్ని ముందస్తుగా రద్దు చేయొచ్చని పేర్కొంది. అయితే.. విమానం మూడు గంటలకు మించి ఆలస్యమయ్యే అవకాశం ఉన్నట్లైయితే.. వాటికి సంబంధించిన సమాచారాన్ని ప్రయాణికులకు సమాచారాన్ని ఇచ్చి.. రద్దు చేయొచ్చని పేర్కొంది. దీనికి సంబంధించి తాజాగా కొత్త మార్గదర్శకాల్ని జారీ చేసింది. అంతేకాదు.. ఈ నిబంధనల్ని అన్నీ విమానయాన సంస్థలు తక్షణమే పాటించాలని ఆదేశించింది.

కొత్త రూల్స్ ఇవే..

- విమాన ఆలస్యానికి సంబంధించి సరైన సమాచారాన్ని విమానయాన సంస్థ వెబ్ సైట్ లో పేర్కొనాలి. ముందస్తు సమాచరాన్ని ప్రయాణికులకు మెసేజ్ రూంలోనూ.. వాట్సాప్.. ఈ మొయిల్ రూపంలో తెలపాలి.

- విమాన ఆలస్యానికి సంబంధించిన వాస్తవిక సమాచారాన్ని ఎయిర్ పోర్టులో వెయిట్ చేస్తున్న ప్రయాణికులకు తెలపాలి. ప్రయాణికులతో సంప్రదింపులు జరిపేందుకు.. నిరంతరం మార్గనిర్దేశం చేసేందుకు సిబ్బందిని అందుబాటులో ఉంచాలి.

- ప్రతికూల వాతావరణం ఉన్న పరిస్థితుల్లో విమానాలు మూడు గంటలకు మించి ఆలస్యమయ్యే సందర్భాల్లో వాటిని ముందస్తుగా రద్దు చేసేలా చూసుకోవాలి.

- విమాన సర్వీసుల రద్దుకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రయాణికులకు తెలియజేయాలి. విమానాశ్రయంలో రద్దీని నివారించటం.. ప్రయాణికులకు అసౌకర్యాన్ని తగ్గించటమే తాజా మార్గదర్శకాల లక్ష్యంగా పేర్కొంటున్నారు.