విమాన ప్రమాదం... ఎయిరిండియాకు డీజీసీఏ కీలక ఆదేశాలు!
దీనిపై కేంద్రం దర్యాప్తు ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే డీజీసీఏ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా... ముగ్గురు అధికారులను తొలగించాలని ఆదేశించినట్లు సమాచారం.
By: Tupaki Desk | 21 Jun 2025 3:04 PM ISTఅహ్మదాబాద్ నుంచి లండన్ బయల్దేరిన ఎయిరిండియా బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ విమానం జూన్ 12న కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఆ ప్రమాదంలో విమానం ఒక్కసారిగా అగ్నిగోళంలా మారిపోయింది. ఆ సమయంలో 1000 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు ఏర్పడ్డాయని అధికారులు తెలిపారు. దీంతో... విమానంలో ప్రయాణిస్తున్న 242 మందిలో ఒక్కరు మినహా మిగిలినవారంతా మృతి చెందారు.
ఇదే సమయంలో.. ఈ విమానం జనావాసాలపై కూలడంతో సుమారు 33 మంది ప్రజలు మరణించారు! ఈ ఘటనతో దేశం మొత్తం ఒక్కసారిగా తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యింది. దీనిపై కేంద్రం దర్యాప్తు ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే డీజీసీఏ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా... ముగ్గురు అధికారులను తొలగించాలని ఆదేశించినట్లు సమాచారం.
అవును... అహ్మదాబాద్ విమాన ప్రమాదం నేపథ్యంలో ఎయిరండియాకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) కీలక ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా... ఆ సంస్థలో పనిచేస్తున్న ముగ్గురు సీనియర్ అధికారులను తొలగించాలని ఆదేశించింది! ఈ ముగ్గురు అధికారులు సిబ్బంది షెడ్యూల్, రోస్టర్ విధులు నిర్వహిస్తున్నట్లు సంబంధిత వర్గాల సమాచారం.
కాగా.. అహ్మదాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్ కు బయల్దేరిన ఎయిరిండియా విమానం.. టేకాఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా.. మృతదేహాలకు డీ.ఎన్.ఏ పరీక్షలు నిర్వహించి, వారి కుటుంబీకులకు అందజేసే ప్రక్రియ కొనసాగుతోంది.
ఈ క్రమంలోనే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా.. ఆ ముగ్గురు అధికారులను వెంటనే విధుల నుంచి తొలగించాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.
