ప్రమాదం తర్వాత డీజే పార్టీలో ఎయిరిండియా స్టాఫ్!... వీడియో వైరల్!
అవును... గురు గ్రామ్ కార్యాలయంలో జరిగిన డీజే పార్టీలో ఎయిరిండియా ఎస్ఏటీఎస్ (ఏఐ ఎస్ఏటీఎస్) ఉన్నతాధికారులు డ్యాన్స్ చేస్తున్నట్లు చూపించే వీడియో సోషల్ మీడియాలో కనిపించి, వైరల్ గా మారింది.
By: Tupaki Desk | 28 Jun 2025 9:00 AM ISTఈ నెల 12న అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన ఎయిరిండియా విమానం ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా.. టెకాఫ్ అయిన కొద్దిక్షణాల్లోనే సమీపంలోని బిల్డింగ్స్ పై కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో మొత్తం 275 మంది మృతి చెందారు. అయితే... ఈ ఘటన జరిగిన తర్వాత ఎయిరిండియాకు చెందిన ఎస్ఎటీఎస్ ఉన్నతాధికారులు డ్యాన్స్ చేస్తున్నట్లున్న వీడియో వైరల్ గా మారింది.
అవును... గురు గ్రామ్ కార్యాలయంలో జరిగిన డీజే పార్టీలో ఎయిరిండియా ఎస్ఏటీఎస్ (ఏఐ ఎస్ఏటీఎస్) ఉన్నతాధికారులు డ్యాన్స్ చేస్తున్నట్లు చూపించే వీడియో సోషల్ మీడియాలో కనిపించి, వైరల్ గా మారింది. అహ్మదాబాద్ లో 275 మంది మరణించిన ఫ్లైట్ ఏఐ171 ప్రమాదం జరిగిన కొద్ది రోజులకే ఈ వీడియో రావడంతో ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారింది.
టాటా గ్రూప్ కంపెనీ ఎయిరిండియా లిమిటెడ్, సింగపూర్ కు చెందిన ఎస్ఏటీఎస్ లిమిటెడ్ మధ్య జాయింట్ వెంచర్ అయిన 'ఏఐ ఎస్ఏటీఎస్'.. అనేక భారతీయ విమానాశ్రయాలలో గ్రౌండ్ సేవలను అందిస్తుంది. జాతీయ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం జూన్ 20న జరిగిన ఈ పార్టీకి బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లిమిటెడ్ కు చెందిన నలుగురు ఉన్నతాధికారులు హాజరైనట్లు తెలుస్తోంది.
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. బాధితుల కుటుంబాలు తమ ప్రియమైనవారి అవశేషాలను సైతం ఇప్పటికీ దక్కించుకోలేక, తీవ్ర ఆవేదనలో ఉండగా.. ఈ వేడుక జరిగిందని చెబుతూ నెటిజన్లు నిప్పులు చెరిగుతున్నారు!
ఈ నేపథ్యంలో స్పందించిన ఏఐ ఎస్ఏటీఎస్ ప్రతినిధి... ఎయిరిండియా ప్రమాదంలో తమ ప్రియమైన వారిని కోల్పోయిన బాధిత కుటుంబాలకు కంపెనీ సంఘీభావం తెలియజేస్తుందని.. తాజాగా వెలుగులోకి వచ్చిన అంతర్గత వీడియో పట్ల విచారం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా నలుగురు అధికారులపై క్రమశిక్షణా చర్యలు తీసుకోబడ్డాయని.. వారిని విధుల నుంచి తొలగించామని తెలిపారు!
