Begin typing your search above and press return to search.

ఎయిరిండియాలో మరో షాకింగ్ ఇష్యూ... వీడియో వైరల్!

ఈ నేపథ్యంలో తాజాగా ఎయిరిండియాకు సంబంధించిన మరో వీడియో వైరల్ గా మారింది. దీనికి ఇప్పటివరకూ సుమారు 18 మిలియన్స్ పైగా వ్యూస్ రావడం గమనార్హం!

By:  Tupaki Desk   |   16 Jun 2025 1:13 PM IST
ఎయిరిండియాలో మరో షాకింగ్ ఇష్యూ... వీడియో వైరల్!
X

జూన్ 12న జరిగిన ఘోర విమాన ప్రమాదం అనంతరం ఎయిరిండియా విమానాల్లో భద్రతా ఏర్పాట్ల గురించి తీవ్ర చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. దానికి తగ్గట్లుగానే ఈ నాలుగు రోజుల్లో కనీసం రెండు మూడు ఇలాంటి సమస్యలు తలెత్తిన పరిస్థితి! ఎయిరిండియా విమానం గురించిన వార్త కనిపిస్తే హడలెత్తిపోయే పరిస్థితి అని చెప్పినా కాదు అతిశయోక్తి! ఈ నేపథ్యంలో తాజాగా మరో వీడియో వైరల్ గా మారింది.

అవును... గత గురువారం అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో సుమారు 274 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియనప్పటికీ.. సాంకేతిక సమస్యలే ప్రధాన కారణం అయ్యి ఉండే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెబుతున్నారు! పైగా ఆ విమానంలో ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ ప్రయాణించిన ఓ వ్యక్తి చేసిన వీడియో, పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది.

ఆ విమానంలో ఏదో తేడా కొడుతోందని.. ఏసీలు పని చేయకపోవడంతో మ్యాగజైన్స్ తో ప్రయాణికులు గాలి విసురుకుంటున్నారని.. టచ్ స్క్రీన్స్ పనిచేయడం లేదని వరుస ఫిర్యాదులు చేశారు. ఆ పోస్ట్ నేషనల్ మీడియా దృష్టిని ఆకర్షించింది. ఈ నేపథ్యంలో తాజాగా ఎయిరిండియాకు సంబంధించిన మరో వీడియో వైరల్ గా మారింది. దీనికి ఇప్పటివరకూ సుమారు 18 మిలియన్స్ పైగా వ్యూస్ రావడం గమనార్హం!

వివరాళ్లోకి వెళ్తే... ఆర్జూ సేథి అనే మహిళ జైపూర్ నుంచి దుబాయ్ వెళ్లే విమానంలో ప్రయాణం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సమయంలో విమానంలో ఎయిర్ కండిషనింగ్ పనిచేయలేదని.. సిబ్బంది నుంచి స్పందనా కరువైందని.. పరిస్థితి గురించి ఎటువంటి ప్రాథమిక సమాచారం లేకుండా ఐదు గంటలకు పైగా ప్రయాణికులను విమానం లోపల ఉక్కిరిబిక్కిరి చేసేశారని ఆమె ఆరోపించారు.

ఈ విమానం బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించడం చూసి తాను నిజంగా షాక్ అయ్యానని ఆమె అన్నారు. తాము సిబ్బంది బటన్ నొక్కుతూనే ఉన్నాము కానీ ఎవరూ రావడం లేదని.. తాము సిబ్బందికి 100 సార్లు కంటే ఎక్కువ కాల్స్ చేసాము కానీ ఎవరూ స్పందించలేదని.. ఏమి జరుగుతుందో ఎవరికీ తెలియదని.. సాంకేతిక సమస్య ఉంటే మరో ఏర్పాట్లు చేయాలని ఆమె తెలిపారు!

ఇదే సమయంలో.. తన తోటి ప్రయాణికులు కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొన్నారని.. అయితే.. ఏమి జరుగుతుందో స్పష్టం చేయడానికి విమానయాన సంస్థ ఎటువంటి ప్రయత్నం చేయలేదని ఆమె అన్నారు. దీనిని తీవ్రమైన భద్రతా లోపంగా అభివర్ణించిన సేథి.. ఇలాంటి సంఘటనలు తీవ్ర పరిణామాలకు దారితీయకముందే బాధ్యత వహించాలని విమానయాన సంస్థను కోరారు.