వియన్నాలో ఆగిపోయిన ఎయిరిండియా విమానం.. కారణం ఇదే!
జపాన్ నుండి ఢిల్లీకి బయలుదేరిన ఎయిరిండియా విమానం ఏఐ 357.. పలు సమస్యల కారణంగా ముందుజాగ్రత్తగా కోల్ కతాకు మళ్లించి సేఫ్ ల్యాండ్ చేయబడిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 3 July 2025 6:00 PM ISTజపాన్ నుండి ఢిల్లీకి బయలుదేరిన ఎయిరిండియా విమానం ఏఐ 357.. పలు సమస్యల కారణంగా ముందుజాగ్రత్తగా కోల్ కతాకు మళ్లించి సేఫ్ ల్యాండ్ చేయబడిన సంగతి తెలిసిందే. దీంతో.. ఈ విమానం టోక్యోలోని హనేడా విమానాశ్రయం నుండి న్యూఢిల్లీ విమానాశ్రయానికి వెళుతుండగా.. సాంకేతిక సమస్యను సిబ్బంది నివేదించారు.
ఇదే సమయంలో... జూన్ 27న ముంబై నుండి చెన్నైకి బయలుదేరిన ఎయిరిండియా విమానం ఏఐ639.. క్యాబిన్ లోపల మండుతున్న వాసనను సిబ్బంది గుర్తించిన తర్వాత టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ముంబైకి తిరిగి రావాల్సి వచ్చింది! ఈ సమయంలో తాజాగా... ఢిల్లీ నుంచి బయలుదేరిన మరో విమానాన్ని అత్యవసరంగా మధ్యలోనే ఆపేశారు!
అవును... బుధవారం తెల్లవారుజామున 12:45 గంటలకు బయలుదేరి గురువారం రాత్రి 8:45 గంటలకు వాషింగ్టన్, డీసీ చేరుకోవాల్సిన ఏఐ103 విమానం రద్దు చేయబడింది. ఇందులో భాగంగా.. సాంకేతిక లోపంతో వియన్నాలో ఆపేసి, క్యాన్సిల్ చేశారు! ఫలితంగా... వాషింగ్టన్, డీసీ నుండి వియన్నా మీదుగా ఢిల్లీకి వెళ్లే ఏఐ104 విమానం కూడా రద్దు చేయబడింది.
ఈ సందర్భంగా స్పందించిన ఎయిరిండియా ప్రతినిధి ఒకరు... జూలై 2 - 2025న ఢిల్లీ నుండి వాషింగ్టన్, డీసీ వెళ్లే ఏఐ 103 విమానం వియన్నాలో ప్రణాళికాబద్ధమైన ఇంధన స్టాప్ ను ఏర్పాటు చేసిందని.. సాధారణ విమాన తనిఖీల సమయంలో, అదనపు మెయింటినెన్స్ పనిని గుర్తించారని.. దీనిని నెక్స్ట్ ఫ్లైట్ కంటే ముందు సరిదిద్దడానికి అదనపు సమయం అవసరం అని తెలిపారు!
దీని కారణంగా.. వియన్నా నుండి వాషింగ్టన్, డిసికి వెళ్లే విమానం రద్దు చేయబడింది.. ప్రయాణీకులను దింపేశారు. ఈ సందర్భంగా... ఈ అసౌకర్యానికి తీవ్రంగా చింతిస్తున్నామని.. ప్రయాణీకులందరి భద్రతతో పాటు సిబ్బంది భద్రతకు ప్రాధాన్యత ఇవ్వడానికి కట్టుబడి ఉన్నామని ఎయిర్ లైన్ తెలిపింది.
ఇదే సమయంలో... వీసా రహిత ప్రవేశానికి అర్హత ఉన్న ప్రయాణీకులకు లేదా చెల్లుబాటు అయ్యే స్కెంజెన్ వీసాలు ఉన్నవారికి నెక్స్ట్ విమానం అందుబాటులోకి వచ్చే వరకు వియన్నాలో హోటల్ వసతి కల్పించబడిందని తెలిపింది. ప్రవేశ అనుమతి లేని వారికి.. ఆస్ట్రియన్ అధికారులతో మాట్లాడి ప్రత్యేక వసతి ఏర్పాట్లు చేయబడ్డాయని తెలిపింది!
