మరో టెన్షన్ ఇష్యూ... జమ్మూలో ఎయిరిండియా విమానానికి ఏమైంది?
ఈ క్రమంలో తాజాగా ఢిల్లీ నుంచి శ్రీనగర్ కు బయల్దేరి వెళ్లిన ఎయిరిండియా విమానం ల్యాండ్ అవ్వకుండానే తిరిగి వచ్చేయడం చర్చనీయాంశంగా మారింది.
By: Tupaki Desk | 23 Jun 2025 6:06 PM ISTజూన్ 12న అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదం అనంతరం విమానాలకు సంబంధించిన ఏ విషయం అయినా తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్న సంగతి తెలిసిందే. పైగా.. ఆ ఘటన జరిగిన తర్వాత పలు సంస్థలకు చెందిన విమానలకు సంబంధించిన పలు వార్తలు హల్ చల్ చేశాయి. ఈ నేపథ్యంలో ఓ అనూహ్య ఘటన తెరపైకి వచ్చింది.
అవును... గత కొన్ని రోజులుగా దేశంలోని విమానసంస్థలకు చెందిన విమానల్లో జరుగుతున్న ఘటనలకు సంబంధించిన వార్తలు చర్చనీయాంశంగా మారుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఢిల్లీ నుంచి శ్రీనగర్ కు బయల్దేరి వెళ్లిన ఎయిరిండియా విమానం ల్యాండ్ అవ్వకుండానే తిరిగి వచ్చేయడం చర్చనీయాంశంగా మారింది.
వివరాళ్లోకి వెళ్తే... సోమవారం ఢిల్లీ నుంచి జమ్మూ మీదుగా శ్రీనగర్ వెళ్లాల్సిన ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ ఐఎక్స్-2564 మధ్యాహ్నం జమ్మూలో ల్యాండ్ కాకుండానే ఢిల్లీకి తిరిగి వచ్చేసినట్లు అధికారులు తెలిపారు. అయితే.. ఈ పరిస్థితికి దారితీసిన కారణాలు ఏమిటనేది మాత్రం తెలియరాలేదని పేర్కొన్నారు. సాంకేతిక సమస్యలు ఏవీ తెరపైకి వచ్చినట్లు వెల్లడించలేదు!
వాస్తవానికి శ్రీనగర్ కన్నా ముందు ఈ విమానం జమ్మూలో ల్యాండ్ కావాల్సి ఉంది. అయితే, పైలట్ ఆ విమానాన్ని జమ్మూలో ల్యాండింగ్ చేయకుండా తిరిగి ఢిల్లీకి వెళ్లాలని నిర్ణయించుకొన్నారు. అయితే.. ఈ నిర్ణయానికి ముందు జమ్మూ విమానాశ్రయం పైనే ఆ విమానం కాసేపు చక్కర్లు కొట్టినట్లు అధికారులు తెలిపారు.
అయితే... ఆ సమయంలో జమ్మూ విమానాశ్రయం పరిశరాల్లో వాతావరణం అనుకూలంగానే ఉందని.. రన్ వే క్లియర్ గానే ఉందని.. అయినప్పటికీ పైలట్ ల్యాండింగ్ ప్రాంతాన్ని గుర్తించలేకపోయాడని చెబుతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది!
