గుజరాత్ మాజీ సీఎం మృతదేహం గుర్తింపు... ఇప్పటి వరకూ ఎన్నంటే..?
అహ్మదాబాద్ లో ఈ నెల 12న జరిగిన ఘ్గోర విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత విజయ్ రూపానీ మృతి చెందిన సంగతి తెలిసిందే
By: Tupaki Desk | 15 Jun 2025 4:32 PM ISTఈ నెల 12న అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన ఎయిరిండియా విమానం ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఆ ప్రమాదం మిగిల్చిన విషాదం ఇంకా కళ్లముందు కదలాడుతూనే ఉందని అంటున్నారు. ఈ ప్రమాదంలో దేశం మొత్తం ఒక్కసారిగా తీవ్ర దిగ్భ్రాంతికి గురవ్వగా.. వందల కుటుంబాలు దుఃఖ సాగరంలో మునిగిపోయాయి.
ఈ ప్రమాదంలో విమానంలో ప్రయాణిస్తున్న 242 మందిలో 241 మంది మృతి చెందగా.. జనావాసాల్లో ఉన్న వారు సుమారు 33 మంది మరణించారని అధికారులు చెబుతున్నారు. ఇలా విమానంలో ప్రయాణించి మరణించిన వారిలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన మృతదేహాన్ని డీఎన్ఏ సాయంతో వైద్యులు గుర్తించారు.
అవును... అహ్మదాబాద్ లో ఈ నెల 12న జరిగిన ఘ్గోర విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత విజయ్ రూపానీ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటన జరిగి మూడు రోజులు అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఈ ప్రమాదానికి గల కారణాలను దర్యాప్తు బృందలు తీవ్రంగా పరిశోధిస్తున్నాయి. .
మరోవైపు మృతులను గుర్తించడానికి వైద్య బృందాలు అవిరామంగా శ్రమిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా విజయ్ రూపానీ మృతదేహాన్ని గుర్తించారని.. రూపానీ కుటుంబ సభ్యుల శాంపిల్స్ తో మృతదేహం డీఎన్ఏ సరిపోలిందని.. గుజరాత్ హోమంత్రి హర్ష్ సంఘ్వీ తెలిపారు. దీంతో.. భౌతికకాయాన్ని వారి కుటుంబసభ్యులకు అప్పగించామని అన్నారు.
ఈ సందర్భంగా స్పందించిన బీజే మెడికల్ కాలేజ్ సీనియర్ గవర్నమెంట్ డాక్టర్.. ఇప్పటివరకూ 32 మంది మృతుల డీ.ఎన్.ఏ., వారి కుటుంబ సభ్యుల జన్యు పరీక్షలతో సరిపోలినట్లు తెలిపారు. ఈ క్రమంలో డీ.ఎన్.ఏ పరీక్షలు నిర్వహించిన అనంతరం ఇప్పటివరకూ 14 మంది మృతదేహాలను వారి వారి కుటుంబ సభ్యులకు అప్పగించామని అన్నారు.
ఇదే సమయంలో.. డీ.ఎన్.ఏ పరీక్షలతో పనిలేకుండా బంధువులు గుర్తుపట్టిన 8 మృతదేహాలను ఇప్పటికే వారి కుటుంబసభ్యులకు ఇచ్చేశామని తెలిపారు. ప్రమాద తీవ్రత వల్ల ఒక్కో డీ.ఎన్.ఏ పరీక్షకు ఎక్కువసమయం పడుతుందని.. అందువల్ల గుర్తింపు ప్రక్రియ ఆలస్యం అవుతుందని పేర్కొన్నారు.
