'ఇకపై ఎయిరిండియా విమానం ఎక్కను'... స్టార్ క్రికెటర్ షాకింగ్ కామెంట్స్!
అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన ఎయిరిండియా విమానం ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 14 Jun 2025 10:52 AM ISTఅహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన ఎయిరిండియా విమానం ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఇప్పటివరకూ 274కు చేరినట్లు అధికారులు వెల్లడించారు. ఇది భారతదేశ చరిత్రలో అత్యంత ఘోరమైన విమాన ప్రమాదాల్లో ఒకటిగా నిలిచిన పరిస్థితి. ఈ సమయంలో ఎయిరిండియాపై సోషల్ మీడియా వేదికగా వచ్చిన ఫిర్యాదులపై డెవిడ్ వార్నర్ స్పందించారు.
అవును... అహ్మదాబాద్ విమాన ప్రమాదం అనంతరం ఎయిరిండియాపై సోషల్ మీడియా వేదికగా వరుస ఫిర్యాదులు కనిపిస్తోన్నాయి! విమానం ఫిట్ నెస్ లు, సౌకర్యాలు వంటి విషయాలపై పలువురు వీడియోలతో సహా నెట్టింట పోస్టులు పెడుతున్నారు! అహ్మదాబాద్ లో ప్రమాదానికి గురైన విమానంలో ఢిల్లీ - అహ్మదాబాద్ వరకూ ప్రయాణించిన వ్యక్తి ఓ కీలక పోస్ట్ పెట్టిన పరిస్థితి.
ఈ వరుస ఫిర్యాదుల నేపథ్యంలో.. తాను ఎయిరిండియాలో పనిచేసినట్లు పరిచయం చేసుకున్న వివేక్ అనే ఆ సంస్థ మాజీ ఉద్యోగి.. ఆ కంపెనీపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఇందులో భాగంగా... బోయింగ్ విమానాలతో చాలా సంవత్సరాలుగా సమస్యలు ఉన్నాయని స్పష్టం చేశారు. ఇదే సమయంలో.. రాబిన్ హుడ్ సినిమా ప్రమోషన్స్ సమయంలో ఈ సంస్థ విమానాల వల్ల వార్నర్ ఇబ్బందిపడ్డ విషయాన్ని గుర్తు చేశారు.
ఇదే సమయంలో... ఈ సమస్యల గురించి పైలట్లు, ఇంజినీర్లతో పాటు ఇతర సిబ్బంది తమ తమ ఆందోళనలను వ్యక్తం చేశారని తెలిపారు. ఈ విషయాన్ని యాజమాన్యం దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు వెల్లడించారు. అయినప్పటికీ ఫలితం లేదని తన పోస్టులో వివరించారు. ఈ సుదీర్ఘ పోస్టు వైరల్ గా మారింది. ఇప్పటికే ఎయిరిండియాపై వస్తోన్న ఆరోపణలకు ఇది బలం చేకూర్చినట్లయ్యిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, ఐపీఎల్ స్టార్ క్రికెటర్ డెవిడ్ వార్నర్ స్పందించారు. వివేక్ అనే ఎయిరిండియా మాజీ ఉద్యోగిగా చెప్పుకున్న వ్యక్తి ఆరోపణలు పంచుకుంటూ... "ఇది నిజమైతే.. నేను మళ్లీ ఎప్పటికీ ఎయిరిండియా విమానం ఎక్కను" అని స్పందించారు. దీంతో.. ఈ రియాక్షన్ నెట్టింట చర్చనీయాంశంగా మారింది!
