బ్లాక్ బాక్స్ దొరకలేదు కానీ... ఏమిటీ ఎఫ్ఏడీఈసీ?
ఈ నేపథ్యంలో బ్లాక్ బాక్స్ గురించి ఎయిరిండియా కీలక అప్ డేట్ ఇచ్చింది. ఇందులో భాగంగా.. బ్లాక్ బాక్స్ దొరకలేదని తెలిపింది.
By: Tupaki Desk | 13 Jun 2025 1:59 PM ISTఅహ్మదాబాద్ నుంచి లండన్ కు బయలుదేరిన ఎయిరిండియా విమానం గురువారం మధ్యాహ్నం ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ప్రమాద సమయంలో విమానంలో 230 మంది పాసింజర్లు 12 మంది సిబ్బంది కలిపి మొత్తం 242 మంది ఉండగా వారిలో ఒక్కరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదంలో మొత్తంగా 265 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఈ సమయంలో... ప్రమాదానికి కారణం ఏమై ఉంటుందనేది కచ్చితంగా తెలియదని.. కాక్ పీట్ వాయిస్ రికార్డర్, బ్లాక్ బాక్స్ ను డీకోడ్ చేస్తే కచ్చితంగా కారణం తెలిసే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో బ్లాక్ బాక్స్ గురించి ఎయిరిండియా కీలక అప్ డేట్ ఇచ్చింది. ఇందులో భాగంగా.. బ్లాక్ బాక్స్ దొరకలేదని తెలిపింది.
ఈ సందర్భంగా... విమాన ప్రమాదానికి సంబంధించిన కీలక సమాచారం అందించే బ్లాక్ బాక్స్ ఇంకా లభించలేదని.. అయితే, ఇప్పటికే బ్లాక్ బాక్స్ దొరికినట్లు వస్తున్న వార్తలు పూర్తిగా ఊహాగానాలు మాత్రమే అని ఓ ప్రకటనలో తెలిపింది.
మరోవైపు... అహ్మదాబాద్ ఎయిరిండియా విమానా ప్రమాదానికి గల ప్రాథమిక కారణాన్ని నిపుణులు గుర్తించినట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగా... ఈ విమాన ప్రమాదానికి "ఫుల్ అథారిటీ డిజిటల్ ఇంజిన్ కంట్రోల్" (ఎఫ్ఏడీఈసీ) కారణం అని ప్రాథమికంగా తేలిందని చెబుతున్నారు!
ఈ ఫెయిల్యూర్ తో ఫ్యుయల్ ఫిల్టర్ జామ్ అయ్యి, ఇంజిన్ కు ఇందనం అందకపోవడంతో ఎగరలేక కూలిందని ప్రాథమికంగా అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో... బ్లాక్ బాక్స్ అనాలసిస్ తో పాటు మరిన్ని అంశాల పరిశీనతో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
