Begin typing your search above and press return to search.

విమాన ప్రమాదం... ఆ మూడింటిలో ఏది అసలు కారణం?

అవును... అహ్మదాబాద్ లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదానికి గల కారణాలు ఏమిటనే విషయంపై తీవ్ర చర్చ జరుగుతోంది.

By:  Tupaki Desk   |   13 Jun 2025 3:20 PM IST
విమాన ప్రమాదం... ఆ మూడింటిలో ఏది అసలు కారణం?
X

అహ్మదాబాద్ లో జరిగిన విమానం ప్రమాదానికి గల కారణాలు ఏమిటనే విషయంపై తీవ్ర చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పటికే ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ) రంగంలోకి దిగింది. ఈ సమయంలో.. ఈ ప్రమాదానికి కచ్చింతంగా మూడింటిలో ఒకటి కారణం అయ్యే అవకాశం ఉందనే చర్చ బలంగా నడుస్తోంది.

అవును... అహ్మదాబాద్ లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదానికి గల కారణాలు ఏమిటనే విషయంపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ సమయంలో.. ఈ ప్రమాదానికి పక్షులు ఢీకొనడం కారణమా అనే ప్రశ్న తెరపైకి వచ్చింది. అయితే... అంత భారీ విమానాన్ని ఒకటి రెండు పక్షులు ఢీకొన్నంతమాత్రాన్న కలిగే నష్టం ఏమీ ఉండదని నిపుణులు చెబుతున్నారు.

అలా కాకుండా ఒకేసారి వందలు, వేల సంఖ్యలో పక్షులు గుంపుగా ఉన్నప్పుడు విమానాన్ని ఢీకొడితే కచ్చితంగా ప్రమాదం ఉంటుందని చెబుతున్నారు. ఆ సమయంలో కొన్ని పక్షలు ఇంజిన్ లోకి వెళ్తే అప్పుడు ప్రమాదం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు. అయితే.. తాజా ఘటనలో పెద్ద సంఖ్యలో పక్షులు ఉన్నట్లు లేదని చెబుతున్నారు!

ఇదే సమయంలో... ఇంజిన్ లో లోపం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండోచ్చనే చర్చా మొదలైంది. దీంతో.. .బోయింగ్ 787 విమానం అధునాతనమైందని (11 ఏళ్లు) .. కచ్చితంగా రెండు ఇంజిన్లు ఒకేసారి ఫెయిల్ అయ్యే అవకాశాలు గరిష్టంగా ఉండవని.. దానికి తోడు అనుభవం కలిగిన పైలెట్లు ఉన్నారని.. వీరు ముందే అన్నీ టెస్ట్ చేసుకుంటారని చెబుతున్నారు.

ఈ సమయంలో... ఉగ్రవాదుల కుట్ర ఏమైనా ఉందా అనే చర్చ సోషల్ మీడియా వేదికగా మొదలవ్వడం గమనార్హం. మరోపక్క ఈ కోణంలో కూడా దర్యాప్తు జరుగుతుందని అంటున్నారు. ఈ విషయాన్ని కేంద్రం సీరియస్ గా తీసుకుందని తెలుస్తోంది. దీంతో... ఈ ఘోర ప్రమాదానికి గల కారణం ఏమై ఉంటుందనేది తీవ్ర ఆసక్తిగా మారింది.

మరోవైపు అహ్మదాబాద్ ఎయిరిండియా విమానా ప్రమాదానికి గల ప్రాథమిక కారణాన్ని నిపుణులు గుర్తించినట్లు కథనాలొస్తున్నాయి. ఇందులో భాగంగా... ఈ విమాన ప్రమాదానికి "ఫుల్ అథారిటీ డిజిటల్ ఇంజిన్ కంట్రోల్" (ఎఫ్ఏడీఈసీ) కారణం అని ప్రాథమికంగా తేలిందని చెబుతున్నారు!

అంటే... ఈ ఫెయిల్యూర్ తో ఫ్యుయల్ ఫిల్టర్ జామ్ అయ్యి, ఇంజిన్ కు ఇందనం అందకపోవడంతో ఎగరలేక కూలిందని ప్రాథమికంగా అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో... బ్లాక్ బాక్స్ అనాలసిస్ తో పాటు మరిన్ని అంశాల పరిశీనతో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది.