ఎయిరిండియాకు బిగ్ టాస్క్ ఇచ్చిన కేంద్రం.. కీలక పోస్ట్!
అవును... ఎయిరిండియా బోయింగ్ విమానం ఘోర ప్రమాదానికి గురవ్వడం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 13 Jun 2025 11:00 PM ISTఅహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన ఎయిరిండియా బోయింగ్ విమానం.. ఒక్కసారిగా కుప్పకూలిపోయిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంతో ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ ఘటనలో 265 మంది మృతి చెందారు. ఈ సమయంలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం ప్రకటించింది.
అవును... ఎయిరిండియా బోయింగ్ విమానం ఘోర ప్రమాదానికి గురవ్వడం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా... అన్ని బోయింగ్ 787 విమానాల్లో భద్రతా తనిఖీలు చేపట్టాలని ఎయిరిండియాను ఆదేశించింది. అనంతరం.. తనిఖీల నివేదిక ఇవ్వాలని పేర్కొంది.
ఇదే సమయంలో.. ఇంధనం, ఇంజిన్, హైడ్రాలిక్ వ్యవస్థల పర్యవేక్షణ కూడా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఆదేశించిన అధునాతన తనిఖీలలో ఉన్నాయి. జెన్-ఎక్స్ ఇంజిన్లతో కూడిన ఎయిరిండియా బోయింగ్ డ్రీమ్ లైనర్ విమానాలన్నీ భద్రతా తనిఖీలు చేయబడతాయని కేంద్రం పేర్కొంది.
అదే విధంగా... పెట్రోల్ ఇనిస్పెక్షన్, ఇంజిన్ సామర్థ్యాలకు సంబంధించిన తనిఖీలను రెండు వారాల్లో పూర్తి చేయాలి.
బోయింగ్ డ్రీమ్ లైనర్ విమానాల్లో గత పదిహేను రోజుల్లో తరచుగా సంభవించిన సమస్యలను వీలైనంత త్వరగా సమీక్షించుకోవలి.
సమీక్ష తర్వాత నిర్వహణ చర్యలను ముగించాలి. సంబంధిత తనిఖీల నివేదికను డీజీసీఏకు అందజేయాలి అని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తెలిపింది.
