ఏడాదిలో వచ్చిన మేడే కాల్స్ ఇవే.. అన్నింటినీ సేఫ్ ల్యాండ్ చేసిన ప్లైలట్లు..
మానవ రవాణా వ్యవస్థల్లో వాయు వ్యవస్థ అత్యంత కీలకమైంది. తక్కువ సమయంలో ఎక్కువ దూరం ప్రయాణించాలంటే ఇదొక్కటే మార్గం బినా మరోటి లేదు.
By: Tupaki Desk | 15 July 2025 5:00 PM ISTగత నెల జూన్ 12న ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 787-8 వీటీ-ఎన్‌బీ టేకాఫ్ అయిన కొన్ని క్షణాల్లో కూలిపోయింది. అహ్మదాబాద్ లోని బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్ పై కూప్ప కూలింది. ఈ ప్రమాదంలో ప్లయిన్ లో ఉన్న 12 మంది సిబ్బంది 242 మంది ప్రయాణికుల్లో ఒక్కరు మాత్రమే బతికి బయటపడ్డారు. ఇక హాస్టల్ కు చెందిన 29 మంది కూడా మరణించారు. అందరూ అగ్నికి ఆహుతయ్యారు. ఈ ఘటన మొత్తం దేశాన్ని కుదిపివేసింది. డీఎన్ఏ పరీక్షలు నిర్వహించి సగం కాలిన మృతదేహాలను అప్పగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ప్రమాదం భారత విమానాయాన చరిత్రలో మాయని మచ్చగా మిగిలిపోతుంది. ఇది ఉగ్రదాడి అని కొందరంటే.. మానవ తప్పిదం అని మరికొందరు.. లేదు లేదు టెక్నికల్ ఎర్రర్ అని ఇంకొందరు అన్నారు. ఏది ఏమైనా 253 మంది బతికి రాలేరు కదా.. కన్న వారి కట్టుకున్న వారికి జీవితకాలం కన్నీరే కదా..
మానవ రవాణా వ్యవస్థల్లో వాయు వ్యవస్థ అత్యంత కీలకమైంది. తక్కువ సమయంలో ఎక్కువ దూరం ప్రయాణించాలంటే ఇదొక్కటే మార్గం బినా మరోటి లేదు. అందుకే ఎక్కువ మంది దీన్నే ఆశ్రయిస్తుంటారు. దాదాపు విమానయానంలో ప్రమాదాలు తక్కువగానే జరిగాయి. కానీ ప్రమాదం జరిగినప్పుడల్లా వందల్లో ప్రాణాలు గాల్లోనే కలిసిపోతున్నారు. ఒక్కోసారి ఒక్కో ఫ్లయిట్ ఎక్కడ మిస్ అయ్యిందో కూడా తెలియకుండా మిస్టరీగా మిగిలిపోతుంది. విమాన ప్రమాదాలను తగ్గించేందుకు చాలా వరకు సైంటిస్టులు ప్రయత్నాలు చేస్తున్నారు. సాధ్యం అయినంత వరకు తగ్గిస్తూనే వస్తున్నారు. ఒక్కోసారి హ్యూమన్ ఎర్రర్, మరోసారి టెక్నికల్ ఎర్రర్ తో ప్రమాదాలు జరుగుతున్నాయి.
ఇటీవల జరిగిన 787-8 విమానానికి సంబంధించి బ్లాక్ బాక్స్ ను పరిశీలించిన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) కొన్ని విషయాలను వెల్లడించింది. 2024, జనవరి 1 నుంచి 2025, మే 31 వరకు విమాన, నౌకాయానికి సంబంధించి 11 మేడే కాల్స్ నమోదైతే అందులో దాదాపుగా అన్ని పైలట్ల చాకచక్యంతో తప్పాయని పేర్కొంది. చాలా వరకు సమస్యలను పైలట్లే పరిష్కరిస్తారని అర్థం అయ్యింది. మరి ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8కు సంబంధించి ఏం జరిగి ఉంటుంది. క్లుప్తంగా చెప్పుకంటే ఎయిర్ ఇండియా విమాన సర్వీసుల్లో కొన్ని లోపాలు ఉన్నట్లు డీజీసీఏ వెల్లడించింది.
200కు పైగా ప్రాణాలను పొట్టన పెట్టుకున్న స్విచ్..
బోయింగ్ విమానాలను నడిపే పైలెట్లు చాలా వరకు సీనియర్లు అయ్యుంటారు. ఎక్కువ కిలో మీటర్లు ఫ్లయింగ్ చేసిన వారినే వీటిని నడిపేందుకు ఆయా సంస్థలు ఎన్నుకుంటాయి. ఈ విమానం నడిపిన పైలట్ కు కూడా చాలా అనుభవం ఉంది. కాక్ పిట్ లో కూడా వీరి మధ్య సంభాషణలు జరిగినట్లు రికార్డు అయ్యింది. 787-8 బోయింగ్ విమానంలో ఇంజిన్లకు ఇంధనం సరఫరా చేసే స్విచ్ కటాఫ్ (బంద్)లో ఉన్నట్లు ఒక పైలట్ గుర్తించాడు. ఇది టేకాఫ్ అయిన క్షణాల్లో గుర్తించి మరో పైలట్ ను ప్రశ్నించాడు. తాను చేయలేదని కో పైలట్ చెప్పాడు. వెంటనే ఆన్ చేసినా ఫలితం లేకుండా పోయింది. ఇంజిన్ ఆగి ఆగి స్ట్రాట్ కావడంతో వేగం అందుకోలేక కుప్పకూలింది. సాధారణంగా ఈ స్విచ్ అంత తేలికగా కటాఫ్ కాదని టెక్నీషియన్స్ చెప్తున్నారు. కానీ ఈ ప్రమాదంలో హ్యూమన్ ఎర్రరా.. లేదంటే టెక్నికల్ ఎర్రరా అనేది ఇంకా స్పష్టతరాలేదు.
