Begin typing your search above and press return to search.

ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు.. థాయిలాండ్ లో ఏమి జరుగుతోంది?

ఈ సమయంలో తాజాగా మరో ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు వచ్చినట్లు నివేదికలు అందుతున్నాయి. దీంతో.. ఈ విమానాన్ని థాయిలాండ్ లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసారు!

By:  Tupaki Desk   |   13 Jun 2025 1:06 PM IST
ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు.. థాయిలాండ్  లో ఏమి జరుగుతోంది?
X

గురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన ఎయిరిండియా విమానం ఘొర ప్రమాదానికి గురవ్వడంతో విమానంలోని ఒక్కరు మినహా మిగిలినవారంతా మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో తాజాగా మరో ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు వచ్చినట్లు నివేదికలు అందుతున్నాయి. దీంతో.. ఈ విమానాన్ని థాయిలాండ్ లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసారు!

అవును.. శుక్రవారం థాయిలాండ్ లోని ఫుకెట్ విమానాశ్రయం నుంచి భారత రాజధాని ఢిల్లీకి బయలుదేరిన ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపులు వచ్చాయని అధికారులు తెలిపారని రాయిటర్స్ నివేదించింది. దీంతో.. 156 మంది ప్రయాణికులతో బయలుదేరిన ఏఐ 379 విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేసినట్లు థాయిలాండ్ ఎయిర్ పోర్ట్ అధికారులు తెలిపారని పేర్కొంది!

అయితే... ప్రాథమిక సెర్చ్ లో ఎయిరిండియా విమానంలో బాంబును కనుగొనలేదని అధికారులు తెలిపారు! శుక్రవారం ఉదయం 9:30 గంటలకు ఫుకెట్ నుంచి న్యూఢిల్లీకి బయలుదేరిన విమానం.. థాయ్ ద్వీపంలో తిరిగి దిగడానికి ముందు అండమాన్ సముద్రం మీదుగా విస్తృతంగా చక్కర్లు కొట్టినట్లు ఫ్లైట్ ట్రేడర్ 24 ట్రాకింగ్ డేటా చూపిస్తోంది!

కాగా... గురువారం అహ్మదాబాద్ లో ఎయిరిండియా విమానం ఏఐ 171 టేకాఫ్ అయిన కొన్ని నిమిషాలకే బీజే మెడికల్ కాలేజీ హాస్టల్స్ పై కూలిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 265 మంది మృతి చెందారు. ఈ ప్రమాదం నుంచి ఒక్క ప్రయాణికుడు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. ఈ పరిస్థితుల్లో మరో ఎయిరిండియా విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అనే వార్తలు ఆందోళనకు గురి చేస్తున్నాయని అంటున్నారు!

కాగా... గత ఏడాది భారతీయ విమానయాన సంస్థలు, విమానాశ్రయాలు బాంబు బెదిరింపులకు సంబంధించి పలు ఫేక్ కాల్స్ ని ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా.. మొదటి పది నెలల్లోనే సుమారు 1,000 ఫేక్ కాల్స్, ఫేక్ మెసేజ్ లు వచ్చాయి. ఇది 2023 ఏడాది కంటే సుమారు 10 రెట్లు ఎక్కువ కావడం గమనార్హం.