Begin typing your search above and press return to search.

అన్నా డీఎంకేలో ఎత్తిన కత్తులు...వేటు ఎవరికి ?

అన్నా డీఎంకేకి 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఏకంగా ఉనికినే సవాల్ చేసేలా కనిపిస్తున్నాయి.

By:  Satya P   |   14 May 2026 10:53 PM IST
అన్నా డీఎంకేలో ఎత్తిన కత్తులు...వేటు ఎవరికి ?
X

అన్నా డీఎంకేకి 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఏకంగా ఉనికినే సవాల్ చేసేలా కనిపిస్తున్నాయి. అతి పెద్ద సంక్షోభంలో పార్టీ చిక్కుకుంది. ఐదున్నర దశాబ్దాల అన్నా డీఎంకే ఉంటుందా లేక చరిత్రలో కలుస్తుందా అన్న చర్చ అంతటా సాగుతోంది. ఎంతో జనాకర్షణ కలిగిన ఎంజీఆర్, జయలలిత వంటి వారు ఒంటి చేత్తో నడిపిన అన్నా డీఎంకే ఈ రోజున నాయకత్వ సమస్యతో కొట్టుమిట్టాడుతోంది. మాజీ ముఖ్యమంత్రి అన్నా డీఎంకే అధినేత పళనిస్వామి వర్సెస్ సీనియర్ నేత చీలిక వర్గం నాయకుడు షణ్ముగంల మధ్య ఇపుడు రాజకీయ చిచ్చు రగుతోంది. ఒకరి మీద మరొకరు ఎత్తిన కత్తితో ఎవరి మీద వేటు పడుతుందో అన్నది చూడాల్సి ఉంది.

పీక్స్ కి చేరిన ముసలం :

అసలే అంతంత మాత్రంగా అన్నా డీఎంకే ఉంది. జయలలిత మరణం తరువాత అధికారంతో నాలుగున్నరేళ్ళు, ఆ తరువాత ప్రధాన ప్రతిపక్ష పాత్రతో బీజేపీ అండతో మరో అయిదేళ్ళూ కాలం వెళ్ళబుచ్చిన అన్నా డీఎంకేకి టీవీకే అధికారంలోకి రావడం ప్రాణ సంకటంగా మారింది. పైగా ఈసారి ప్రధాన ప్రతిపక్షం హోదా కూడా దక్కలేదు. మూడవ పార్టీగా ఉన్న అన్నా డీఎంకేలో ముసలం తో అసలుకే ఎసరు వచ్చేలా ఉంది.

రివర్స్ విప్ తో :

అన్నా డీఎంకే అధినేతగా పళనిస్వామి ఉన్నారు. అయితే ఆయన వైపు అచ్చంగా 22 మంది ఎమ్మెల్యేలు మాత్రమే మిగిలారు. పాతిక మంది ఎమ్మెల్యేలు షణ్ముగం వర్గంలో చేరారు. వారిని కూడా తమిళనాడు స్పీకర్ గురించారు. వారికి విప్ జారీ చేసే అధికారం కూడా ఇచ్చారు. దాంతో షణ్ముగం వర్గం నుంచి విప్ ని విజయ భాస్కర్ జారీ చేశారు. దాని ప్రకారం అంతా టీవీకేకి మద్దతు తెలపాలి. కానీ పళనిస్వామి వర్గం 22 మంది ఎమ్మెల్యేలు అయితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు చేశారు. దాంతో వారి మీద చర్యలు తీసుకోవాలని విజయ భాస్కర్ స్పీకర్ ని కోరడం ఇపుడు బిగ్ ట్విస్ట్ గా మారింది.

పళనిస్వామి రియాక్షన్ :

మరో వైపు అన్నా డీఎంకే మీద తన పట్టుని నిరూపించే ప్రయత్నం లో ఉన్న మాజీ సీఎం పళని స్వామి షణ్ముగం సహా కీలక నేతలను అన్నా డీఎంకే లో ఉన్న పదవుల నుంచి తొలగించారు. వారందరికీ అన్నా డీఎంకే కి సంబంధం లేదని కూడా ఆయన తేల్చేశారు. అయితే ఎవరిది అసలైన అన్నా డీఎంకే అన్నది తేల్చుకునేందుకు జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేయాలని షణ్ముగ వర్గం డిమాండ్ చేస్తోంది. ఇలా రెండుగా చీలిన రెండాకుల పార్టీలో ఎవరు నెగ్గుతారు, ఎవరి కత్తికి ఎవరు వేటుకు గురి అవుతారు అన్నది ఆసక్తిని పెంచే అంశగా ఉంది. చిత్రమేంటి అంటే రెండు వర్గాల నేతలకు ప్రజాకర్షణ అయితే లేదని అంటున్నారు. వారి నియోజకవర్గాలలో మాత్రమే గెలిచే నేతలుగా ఉన్నారు. దాంతో అన్నా డీఎంకే వంటి చారిత్రాత్మకమైన పార్టీ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతోంది అన్నది తమిళనాడుని మాత్రమే కాదు దేశాన్ని కూడా ఆసక్తి కలిగిస్తున్న అంశగా ఉంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.