Begin typing your search above and press return to search.

భారత్ లో జరిగిన భారీ విమాన ప్రమాదాలివే.. చివరిగా ఎప్పుడంటే..?

ఈ సందర్భంగా స్పందించిన నిపుణులు.. గత ఐదేళ్లలో భారత్ లో జరిగిన భారీ విమాన ప్రమాదాల్లో ఇది ఒకటని భావిస్తున్నారు.

By:  Tupaki Desk   |   12 Jun 2025 4:57 PM IST
భారత్ లో జరిగిన భారీ విమాన ప్రమాదాలివే.. చివరిగా ఎప్పుడంటే..?
X

అహ్మదాబాద్ లోని సర్దార్ వల్లభాయ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నుంచి లండన్ బయలుదేరిన విమానం (ఏఐ-171) ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో ప్రమాదం జరిగిన సమయంలో ఆ విమానంలో 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది ఉన్నారు! ఈ సందర్భంగా స్పందించిన నిపుణులు.. గత ఐదేళ్లలో భారత్ లో జరిగిన భారీ విమాన ప్రమాదాల్లో ఇది ఒకటని భావిస్తున్నారు.

అవును... గుజరాత్ నుంచి లండన్ వెళ్తున్న విమానం ‘ఎయిర్ ఇండియా – 171’ కూలిపోయింది. గురువారం మధ్యాహ్నం 1:39 గంటల సమయంలో టేకాఫ్ అయిన కొద్దిసేపటికే భారీ శబ్ధం చేస్తూ సమీపంలోని బిల్డింగ్స్ పై కూలిపోయింది. ఆ సమయంలో పెద్ద ఎత్తున బూడిద రంగు పొగలు అలుముకున్నాయి. ఈ సందర్భంగా భారత్ లో జరిగిన అతిపెద్ద విమాన ప్రమాదాలేవో చూద్దామ్..!

* 1990 ఫిబ్రవరిలో భారత్ లో ఓ భారీ విమాన ప్రమాదం జరిగింది. ఇందులో భాగంగా... బెంగళూరు విమానాశ్రయంలో ఇండియన్ ఎయిర్ లైన్స్ విమానం కుప్పకూలిపోయింది. రన్ వేను తాకడంతో ఈ ప్రమాదం సంభవించగా.. ఈ ప్రమాదంలో 146 మంది ప్రయాణికులు, 92 మంది సిబ్బంది చనిపోయారు.

* 1993 ఏప్రిల్ లో మహారాష్ట్రలోని ఔరంగాబాద్ విమానాశ్రయం నుంచి బయలుదేరిన ఇండియన్ ఎయిర్ లైన్స్ విమానం టేకాఫ్ సమయంలో రన్ వే పైకి వచ్చిన ట్రక్కును ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 118 మంది ప్రయాణికులతో పాటు.. గ్రౌండ్ సిబ్బందితో కలిపి 55 మంది మరణించారు.

* 1996 నవంబర్ లో సౌదీ అరేబియా ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం, కజికిస్తాన్ ఎయిర్ లైన్స్ విమానం.. హర్యానాలో ఢీకొన్నాయి. సమాచార లోపం కారణంగా జరిగిన ఈ ప్రమాదంలో రెండు విమానాల్లోనూ కలిపి 340 మంది ప్రయాణికులు, సిబ్బంది మరణించారు. అదనంగా నేలపై ఉన్న మరో ఐదుగురు చనిపోయారు.

* 1998 జూలైలో ఆలయన్స్ ఎయిర్ ఫ్లైట్ బోయింగ్ విమానం బీహార్ లోని పాట్నా విమానాశ్రయంలో ల్యాండింగ్ సమయంలో అదుపుతప్పింది. జనాలు ఉన్న ప్రాంతంలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 55 మంది ప్రయాణికులతో పాటు ఐదుగురు స్థానికులు మరణించారు.

* 2010 మేలో దుబాయ్ నుంచి మంగుళూరు ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు వచ్చిన ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ విమానం కుప్పకూలిపోయింది. సకాలంలో రన్ వే పై ఆగలేక, లోయలోకి దూసుకెళ్లింది. దీంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో విమానంలో ఉన్న 166లో 158 మంది మృతి చెందారు. 8 మంది మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు.

* 2020 ఆగస్టులో కరోనా సమయంలో విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు చేపట్టిన ఆపరేషన్ లో భాగంగా... బోయింగ్ విమానం దుబాయ్ నుంచి కేరళ కు బయలుదేరింది. ఆ సమయంలో భారీ వర్షం కారణంగా లోయలో పడిన విమానం రెండుగా చీలిపోయింది. ఈ ప్రమాదంలో 21 మంది మృతి చెందగా.. 100 మందికి పైగా గాయపడ్డారు. ఇదే భారత్ లో జరిగిన చివరి భారీ విమాన ప్రమాదం!