Begin typing your search above and press return to search.

ఏఐ సాయంతో అంధులకు చూపు ఇచ్చిన యూపీ యువకుడు.. ప్రపంచం ఫిదా!

ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీ విస్తృతంగా విస్తరిస్తోంది. వైద్యశాఖ నుంచి విద్యారంగం వరకు ఎన్నో సేవలలో ఏఐ కీలకపాత్ర పోషిస్తోంది.

By:  Tupaki Desk   |   16 Jun 2025 4:00 PM IST
ఏఐ సాయంతో అంధులకు చూపు ఇచ్చిన యూపీ యువకుడు.. ప్రపంచం ఫిదా!
X

ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీ విస్తృతంగా విస్తరిస్తోంది. వైద్యశాఖ నుంచి విద్యారంగం వరకు ఎన్నో సేవలలో ఏఐ కీలకపాత్ర పోషిస్తోంది. అయితే ఉత్తరప్రదేశ్‌కు చెందిన మునీర్ ఖాన్ అనే యువకుడు ఏఐ సాయంతో మానవ సేవలో ఓ గొప్ప చరిత్ర సృష్టించాడు.

‘విజన్ ప్రో’ స్మార్ట్ గ్లాసెస్ ఆవిష్కరణ

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లఖింపుర్ ఖేరీ అనే చిన్న గ్రామానికి చెందిన మునీర్ ఖాన్, ఏఐ టెక్నాలజీని పూర్తిగా నేర్చుకుని, అంధుల కోసం ప్రత్యేకంగా ‘విజన్ ప్రో’ అనే స్మార్ట్ గ్లాసెస్‌ను అభివృద్ధి చేశాడు. ఈ గ్లాసెస్ సాయంతో అంధులు కేవలం పరిసరాలను మాత్రమే గుర్తించగలరు కాకుండా, పుస్తకాల్లో ఉన్న సమాచారం కూడా టెక్స్ట్ టు స్పీచ్ సాంకేతికత ద్వారా వినగలుగుతున్నారు.

ఆబ్జెక్ట్ రికగ్నిషన్ టెక్నాలజీతో నూతన ఆశలు

ఈ గ్లాసెస్‌లో ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన ఆబ్జెక్ట్ రికగ్నిషన్ టెక్నాలజీ అమర్చారు. ఇది ముందు ఉన్న వస్తువులను గుర్తించి, దాని వివరాలను వినిపించగలదు. అంతేకాక ట్రాఫిక్ లైట్స్‌ను చదవడం, వాయిస్ కంట్రోల్‌తో పనులను నిర్వహించడం వంటి ఫీచర్లు ఈ గ్లాసెస్‌లో ఉన్నాయి. దాంతో అంధులు స్వేచ్ఛగా బయటకి వెళ్లి, రహదారి దాటి, పుస్తకాలు చదవడం వంటి పనులు సులభంగా చేయగలుగుతున్నారు.

-విద్యా నేపథ్యం - అంతర్జాతీయ గుర్తింపు

ఈ ప్రాజెక్టుకు ‘విజన్ ప్రో’ అనే పేరుపెట్టిన మునీర్ ఖాన్, తన విద్యాభ్యాసాన్ని నైనిటాల్‌లోని బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అప్లైడ్ సైన్సెస్‌లో పూర్తి చేశాడు. అనంతరం దేశంలోని వివిధ ఐఐటీల్లో ఏఐపై షార్ట్ టర్మ్ కోర్సులు చేశాడు. అలాగే అనేక వర్క్‌షాప్‌లకు హాజరై టెక్నాలజీలో దిట్టగా మారాడు.

ఆయన కృషికి గుర్తింపు లభించి న్యూయార్క్‌లోని ప్రముఖ సంస్థ ‘హ్యూమానిటీ ఫౌండేషన్’ నుంచి ప్రతిష్టాత్మక గ్లోబల్ అవార్డు వరించింది. మునీర్ చేసిన ఈ ఆవిష్కరణ ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. "ఈ గ్లాసెస్ అంధుల జీవితాన్ని పూర్తిగా మార్చివేస్తుంది. వారు ఇక పరాధీనులు కారు. స్వతంత్రంగా బతకగలుగుతారు" అని మునీర్ ఖాన్ గర్వంగా చెబుతున్నాడు.

మునీర్ ఖాన్ ఈ విజయంతో నిరూపించాడు ఏఐ సాంకేతికతను మంచి పనులకు ఉపయోగిస్తే, అది లక్షల మందికి వెలుగు నింపగలదని! ఇప్పుడు అందరూ అతడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.