Begin typing your search above and press return to search.

సీఎం వ్యాఖ్యలపై ఏఐ వీడియోతో ఎంపీ ధర్మపురి అర్వింద్ ట్రోలింగ్.. మామూలు మాస్ కాదు ఇదీ..

తెలంగాణ భౌగోళిక రూపురేఖలు ఒక్కసారిగా మారిపోయాయి. మనం ఇన్నాళ్లూ పుస్తకాల్లో చదువుకున్న భూగోళ శాస్త్రాన్ని కొద్దిసేపు పక్కన పెట్టేయాల్సిందే.

By:  A.N.Kumar   |   5 Aug 2026 10:13 PM IST
సీఎం వ్యాఖ్యలపై  ఏఐ వీడియోతో ఎంపీ ధర్మపురి అర్వింద్ ట్రోలింగ్.. మామూలు మాస్ కాదు ఇదీ..
X

తెలంగాణ భౌగోళిక రూపురేఖలు ఒక్కసారిగా మారిపోయాయి. మనం ఇన్నాళ్లూ పుస్తకాల్లో చదువుకున్న భూగోళ శాస్త్రాన్ని కొద్దిసేపు పక్కన పెట్టేయాల్సిందే. ఎందుకంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అపారమైన దార్శనికతకు బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను జోడించి ఒక అద్భుతమైన "నూతన తెలంగాణ" మ్యాప్‌ను డిజిటల్ ప్రపంచం ముందుకు తీసుకొచ్చారు. రేవంత్ రెడ్డి గారు వివిధ సందర్భాల్లో మాట్లాడిన ప్రసంగాల ఆధారంగా ఆయన ఉద్దేశించిన తెలంగాణ రూపురేఖలు ఎలా ఉంటాయో చూపిస్తూ రూపొందించిన ఈ ఏై విజువల్ వండర్ ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది.

ఈ కొత్త సరిహద్దుల మహిమ చూస్తే ఎవరికైనా మతిపోవాల్సిందే. ఇన్నాళ్లూ తెలంగాణకు సముద్ర తీరం లేదనే చిన్నతనంతో బాధపడే తెలంగాణవాసులకు ఈ ఏఐ మ్యాప్ కొండంత ఉపశమనాన్ని కలిగిస్తోంది. ఇందులో ఒకవైపు అరేబియా సముద్రం, మరోవైపు బంగాళాఖాతం, దిగువన హిందూ మహాసముద్రం అల్లలాడుతుంటే ఉత్తరాన ఏకంగా మంచు కురిసే హిమాలయ పర్వతాలు రాష్ట్ర సరిహద్దులుగా పహారా కాస్తున్నాయి. అంటే ఒక్క దెబ్బకు తెలంగాణ గ్లోబల్ టూరిజం హబ్‌గా మారిపోయిందన్నమాట. అంతేకాకుండా ప్రస్తుతం నగరంలో చెరువుల ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతున్న ‘హైడ్రా’ ప్రభావం ఏ స్థాయిలో ఉందో చూపిస్తూ ఆ మ్యాప్‌లో హైడ్రా సూచనలను కూడా ప్రత్యేకంగా పొందుపరిచారు.

“ఇదే రేవంత్ నూతన తెలంగాణ.. ఇందులో హైడ్రా కూడా ఉంది” అంటూ ఎంపీ ధర్మపురి అర్వింద్ జత చేసిన క్యాప్షన్‌తో ఈ వీడియో ఎక్స్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో విపరీతంగా షేర్ అవుతోంది. రాజకీయ ప్రత్యర్థుల మాటలను ఆధారంగా చేసుకుని ఏఐ సాంకేతికతతో ఇటువంటి సెటైరికల్ కంటెంట్ తయారు చేయడం ఈమధ్య బాగా ఫ్యాషన్ అయిపోయింది. అర్వింద్ వదిలిన ఈ ఏఐ బాణానికి నెటిజన్లు కూడా జోరుగా కామెంట్లు జోడిస్తున్నారు. కొందరు “మన రాష్ట్రానికి ఉచితంగా హిమాలయాలు, సముద్ర తీరం వచ్చేశాయి” అని తెగ నవ్వుకుంటుంటే మరికొందరు మాత్రం రాజకీయం మరీ ఈ స్థాయికి దిగజారాలా అంటూ సీరియస్ అవుతున్నారు.

ఈ ఏఐ క్రియేటివిటీపై తెలంగాణ ప్రభుత్వం లేదా కాంగ్రెస్ వర్గాల నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స్పందన రాలేదు. బహుశా రేవంత్ రెడ్డి గారు కూడా తమ కొత్త ‘సముద్ర తీర ప్రాంతాల్లో’ నౌకాశ్రయాలు ఎలా కట్టాలా లేదా హిమాలయాల సరిహద్దుల్లో టూరిజం ఎలా పెంచాలా అనే ఆలోచనలో పడి ఉంటారని నెటిజన్లు చలోక్తులు విసురుతున్నారు. దీనికి రేవంత్ ఏమీ వదిలిపెట్టరని..ఎంపీ అరవింద్ కు తనదైన శైలిలోనే అప్పజెప్పుతారని ఆశిస్తున్నారు.

మొత్తంగా పాతకాలపు మైకుల గోల, సభల దూషణలు తగ్గి... ఇప్పుడు ఏఐ వీడియోలు, డిజిటల్ మీమ్‌ల రూపంలో వ్యంగ్యాస్త్రాలు దాడి చేస్తున్నాయి. భవిష్యత్తు రాజకీయాల్లో ఈ ఏఐ ట్రోలింగ్ ఇంకెన్ని వింతలను చూపుతుందో వేచి చూడాల్సిందే.

ఏమయ్య విద్యా శాఖ కమ్ ముఖ్య మంత్రి...ప్రతిపక్ష నాయకుడి లెక్క చెయ్యకు!

ఈ రాష్ట్రంల బ్లాక్ బోర్డులు, చాక్ పీస్ లు లేని స్కూళ్ళు ఉన్నయ్...ముందు అవి సక్కవెట్టు! విద్యార్థులను, టీచర్లను అవహేళన చేశుడు కాదు!