ఇక, అంతా 'ఏఐ'నే.. పార్టీలు బీ రెడీ.. !
2026లో భారీ మార్పులు చోటు చేసుకోనున్నాయి. దీనిలో ప్రధానం `ఏఐ` పాత్ర ఎక్కువకానుంది.
By: Garuda Media | 2 Jan 2026 12:00 AM IST2026లో భారీ మార్పులు చోటు చేసుకోనున్నాయి. దీనిలో ప్రధానం `ఏఐ` పాత్ర ఎక్కువకానుంది. ఇప్పటి వరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాత్ర ఎలా ఉంటుందన్న దానిపై 2025సంవత్సరం ఒక టేస్ట్ చూపిం చింది. ఈ ఏడాది చివరి మూడు నాలుగు మాసాల్లో ఏఐ వీడియోలు, ఏఐ చిత్రాలు సోషల్ మీడియాను ఒక కుదుపు కుదిపేశాయి. అయితే.. 2026లో పూర్తిస్థాయిలో ఏఐ ఇటు రాజకీయపరంగానే.. కాకుండా, అటు సామాజిక పరంగా కూడా ప్రభావం చూపుతుందన్న చర్చ జోరుగా సాగుతోంది.
మారుతున్న కాలానికి అనుగుణంగా.. ఇప్పటికే ఏఐ అనేక రూపాల్లో ప్రజలకు చేరువ అయింది. ఇక, ఇప్పుడు సోషల్ మీడియాలోనూ ఏఐ ప్రభావం ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. రాజకీయ పార్టీలు.. నాయకుల వ్యవహారశైలి.. ప్రకటనలు.. పథకాలు.. ఇలా.. అనేక రూపాల్లో ఏఐ విస్తృతంగా ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు.. సోషల్ మీడియాకు మాత్రమే పరిమితమైన రాజకీయ పార్టీలు.. ఇప్పుడు ఏఐని కూడా విస్తృతంగా వినియోగించుకునే దిశగా 2026లో అడుగులు వేయనున్నాయి.
వైసీపీ విషయానికి వస్తే.. ఏఐ వీడియోలు.. ప్రచారం విషయంలో ఆ పార్టీ కీలక రోల్ పోషించనుంది. ఇప్ప టి వరకు సోషల్ మీడియాతో 2025లో పార్టీ పనిచేసింది. ఇక, నుంచి ఏఐ వీడియోలు.. ఏఐ టెక్నాలజీని కూడా అంతే స్థాయిలో పార్టీకి వినియోగించుకునే దిశగా ఏఐ సైన్యాన్ని ఏర్పాటు చేస్తోంది. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఒక వింగ్‌ను ఇప్పటి కే ఏర్పాటు చేశారు. వచ్చే ఏడాదిఏఐ ద్వారా మరింత చొరవ తీసుకుని.. పార్టీని ప్రజలకు చేరువ చేయాలని నిర్ణయించారు.
అదేసమయంలో టీడీపీ కూడా.. ఈ పంథాను ఇప్పటికే అందిపుచ్చుకుంది. ప్రస్తుతం ఏఐ వినియోగం.. సాంకేతికతకు సంబంధించి సిబ్బంది నియామకాలపై టీడీపీ దృష్టి పెట్టింది. ఏఐ - టీడీపీ పేరుతో ప్రత్యేకంగా ఒక ఛానెల్‌ను తీసుకురావడం ద్వారా పార్టీ కార్యక్రమాలతో పాటు.. ప్రభుత్వ కార్యక్రమాలను కూడా ప్రజలకు చేరువ చేయనున్నారు. అంతేకాదు.. ప్రత్యర్థులు చేసే విమర్శలకు కూడా ఏఐతోనే సమాధానాలు చెప్పించే దిశగా అడుగులు వేస్తున్నారు మొత్తంగా 2026లో సరికొత్త ఏఐ రాజకీయాలు చూడబోతున్నారన్నది వాస్తవం.
