ఏఐ రంగంపై పెట్టుబడుల వరద.. బుడగ బద్ధలవుతుందట
ఇదిలా ఉంటే.. ఈ అంశంపై ఇటీవల ఒక పోల్ జరగ్గా.. పలువురు పెట్టుబడిదారులు ఇచ్చిన ఫీడ్ బ్యాక్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
By: Garuda Media | 18 Nov 2025 2:00 PM ISTఆ మధ్య వరకు కృత్రిమ మేధపై వస్తున్న వార్తలు.. సాంకేతిక రంగంలో చోటు చేసుకుంటున్న పరిణామాల్ని తక్కువగా అంచనా వేసిన ఎందరో.. ఇటీవల కాలంలో చోటు చేసుకుంటున్న మార్పుల్ని చూస్తున్నోళ్లంతా.. తమ తప్పుల్ని తెలుసుకుంటే.. ఈసారి ఏఐపై విపరీతమైన ఆశల్ని పెంచేందుకుంటున్నారు. ఇక్కడితో ఆగని ఎంతోమంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు విపరీతమైన ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. అంతేకాదు.. ఆ రంగంలో పెట్టుబడుల వరద సాగిస్తున్నారు. అయితే.. ఇదెంత వరకు సేఫ్? అన్నదిప్పుడు చర్చగా మారింది.
ఇదిలా ఉంటే.. ఈ అంశంపై ఇటీవల ఒక పోల్ జరగ్గా.. పలువురు పెట్టుబడిదారులు ఇచ్చిన ఫీడ్ బ్యాక్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆశించినంత రాబడులు రాని పక్షంలో ఈ బుడగ బద్ధలయ్యే అవకాశం ఉందన్న హెచ్చరికలు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. ఏఐ బుడగ బద్ధలైన పక్షంలో మొదటగా పర్ ప్లెక్సిటీ సంస్థ ఫెయిల్ అయ్యే అవకాశం ఉందంటూ ఇటీవల జరిగిన పోల్ లో పెట్టుబడిదారులు అభిప్రాయాల్ని చూస్తే.. ఏఐ బుడగ బద్ధలయ్యే రోజు దగ్గర్లోనే ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
అదే జరిగితే డాట్ కామ్ సంక్షోభం నాటి రోజులు మళ్లీ వస్తాయని చెబుతున్నారు. సెరిబ్రల్ వ్యాలీ ఏఐ కాన్ఫరెన్స్ లో దీనికి సంబంధించి ఒక పోల్ ను నిర్వహించారు. దీనికి సంబంధించి లైవ్ పోల్ లో ఆసక్తికర ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ పోల్ లో సుమారు 300 మంది స్టారప్ సంస్థల వ్యవస్థాపకులు.. పరిశోధకులు.. పెట్టుబడిదారులు పాల్గొన్నారు. ఏఐ బుడగ బద్ధలైన పక్షంలో తొలుత ఫెయిల్ అయ్యే సంస్థగా పర్ ఫ్లెక్సిటీగా పేర్కొన్నారు. ఆ తర్వాతి స్థానంలో చాట్ జీపీటీ రూపకర్త ఓపెన్ ఏఐ ఉందని తేలింది.
ఎందుకంటే.. కంపెనీ మార్కెట్ విలువ అమాంతం పెరిగిపోవటం.. అసాధారణంగా పెరిగిన అంచనాల నేపథ్యంలో నిధుల సేకరణ జరగటమే ప్రధాన కారణంగా చెబుతున్నారు. ప్రస్తుతం ఏఐ రంగంలో భారీగా పెట్టుబడులు వచ్చి పడుతున్నాయని.. కానీ అదెంతో కాలం సాగదని పలువురు పెట్టుబడిదారులు పేర్కొన్నారు. ఏఐ బుడగ బద్ధలవ్వొచ్చని కొందరు అంటుంటే.. మరికొందరు మాత్రం ఈ రంగం డెవలప్ మెంట్ లో ఇదో అనివార్య దశగా చెబుతున్నారు. ఏమైనా.. ఏఐ రంగంలో పెట్టుబడులు పెట్టే వారంతా ఆచితూచి అడుగులు వేయటం మంచిదన్న విషయాన్ని ఈ లైవ్ పోల్ చెప్పిందని చెప్పక తప్పదు.
