Begin typing your search above and press return to search.

ఏఐతో ప్రమాదం తప్పదా.. గాడ్ ఫాదర్ సంచలన కామెంట్!

దేశంలో రోజురోజుకు టెక్నాలజీ పెరిగిపోతోంది. ఒకప్పుడు సెల్ ఫోన్ అనేది ఊర్లో ఒక్కరికి కూడా ఉండేది కాదు.

By:  Madhu Reddy   |   16 Aug 2025 10:00 PM IST
ఏఐతో ప్రమాదం తప్పదా.. గాడ్ ఫాదర్ సంచలన కామెంట్!
X

దేశంలో రోజురోజుకు టెక్నాలజీ పెరిగిపోతోంది. ఒకప్పుడు సెల్ ఫోన్ అనేది ఊర్లో ఒక్కరికి కూడా ఉండేది కాదు. ఎవరికో ఒకరికి ల్యాండ్ ఫోన్ ఉండేది. ఆ ఫోన్ ద్వారానే ఊరు ఊరంతా మాట్లాడేది. అలాంటిది ప్రస్తుతం ఇంటింటికి ఓ సెల్ ఫోను ఉంది.. కాదు కాదు.. ఇంట్లో ఉండే ప్రతీ ఒక్కరి చేతిలో సెల్ ఫోన్ ఉంది.ఈ ఫోన్ ద్వారా ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా సరే క్షణాల్లో తెలుసుకోగలుగుతున్నాం. ఇది అద్భుత టెక్నాలజీ అనుకున్న తరుణంలో మరో టెక్నాలజీ ఏఐ రూపంలో మన ముందుకు వస్తోంది. దీని ద్వారా రాబోవు రోజుల్లో మానవుల్లో చాలావరకు శారీరక శ్రమ తగ్గిపోయి అన్నీ ఏఐ ద్వారానే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అయితే ఇది ఒకంతకు మంచిదే.. కానీ మరో రకంగా కాస్త ఇబ్బంది కలిగించే విధంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. అయితే తాజాగా ఓపెన్ ఏఐ సంస్థ రూపొందించినటువంటి చాట్ జిపిటి సైతం దీనిపైన ఆధారపడి పని చేస్తుంది. అయితే తాజాగా ఏఐ గురించి జాఫ్రీ హీంటన్ సంచలన విషయాలు బయట పెట్టారు. లాస్ వేగాస్ లో జరిగినటువంటి Ai4 సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. భవిష్యత్తులో ఏఐ మానవాళిని కూడా తుడిచి పెడుతుందని అన్నారు.. అందుకే దీనిని అధిగమించాలి అంటే భావోద్వేగ స్పందనలు కలిగి ఉండే విధంగా ఏఐ వ్యవస్థను తీసుకురావాలని తెలియజేశారు.

దీనివల్ల మానవుల సంరక్షణ పట్ల కాస్త అవగాహన కల్పించాలని తెలియజేశారు. ఫ్యూచర్ లో ఏఐ మానవ మేధస్సును అధిగమిస్తే మనం పెట్టిన పరిమితులు దాటి దానికి అదే సొంతంగా మార్గాలను అన్వేషిస్తుంది అని తెలియజేశారు. ఈ మధ్యకాలంలో ఓ ఏఐ వ్యక్తిగత రహస్యాలను బయటకు చెప్తానంటూ ఇంజనీర్ ని బెదిరించడం మనం చూశాం. భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బందులు రాకుండా మానవాళికి అనుగుణంగా ఉండే ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్సులు తీసుకురావాలని అన్నారు.. ఇందులో ముఖ్యంగా భావోద్వేగ స్పందనలు కలిగిన ఏఐని తీసుకురావడం మరింత మంచిదని తెలియ జేశారు.

ఏఐ ద్వారా ఔషధాల అభివృద్ధి, క్యాన్సర్ కి చికిత్స, భవిష్యత్తు రోగ నిర్ధారణకు సంబంధించి ఎంతో ఉపయోగపడుతుందని తెలియజేశారు. ఇలా ఏఐ ద్వారా నష్టం ఉన్నప్పటికీ దీన్ని కరెక్ట్ గా ఉపయోగించి ఆరోగ్య రంగంలో అనేక ప్రయోజనాలు పొందవచ్చని ఏఐ గాడ్ ఫాదర్ అయినటువంటి జాఫ్రీ హింటన్ తెలిపారు.