'ఇంధన కల్తీతో ఇంజిన్ ఫెయిల్ కు ఛాన్స్'... టీఎస్ఏఏ సీఈవో కీలక వ్యాఖ్యలు!
అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదంపై నిపుణులు వారి వారి అభిప్రాయాలను వెల్లాడిస్తూ, పలు సందేహాలు తెరపైకి తెస్తున్నారు.
By: Tupaki Desk | 13 Jun 2025 6:25 AMఅహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదంపై నిపుణులు వారి వారి అభిప్రాయాలను వెల్లాడిస్తూ, పలు సందేహాలు తెరపైకి తెస్తున్నారు. ఈ సందర్భంగా స్పందించిన తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమీ (టీఎసేఏ) సీఈవో ఎస్.ఎన్.రెడ్డి పలు కీలక విషయాలు వెల్లడించారు. ఈ సందర్భంగా బ్లాక్ బాక్స్ లో డీ.ఎఫ్.డీ.ఆర్. డీకోడ్ చేస్తే ప్రమాదంపై క్లారిటీ వస్తుందని అన్నారు.
అవును... అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదంపై దర్యాప్తు జరుగుతున్న వేళ.. 25 వేల కంటే ఎక్కువ గంటలు గగనతలంలో శిక్షణ ఇచ్చిన అనుభవం ఉన్న తెలంగాణ ఏవియేషన్ అకాడమీ సీఈవో కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా.. ప్రమాధాలు సాధారణంగా సాంకేతిక లోపం, అనుభవం లేని పైలెట్లు, వాతావారణం సరిగాలేకపోవడం వంటి వాటి వల్ల జరుగుతాయని అన్నారు.
అయితే... తాజాగా ప్రమాదానికి గురైన బోయింగ్ 787 అధునాతనమైనదని, దానికితోడు అనుభవం కలిగిన పైలెట్లు ఉన్నారని, పైగా వాతావారణం కూడా బాగానే ఉందని తెలిపారు. అందువల్ల ప్రమాదానికి కారణం ఏమై ఉంటుందనేది కచ్చితంగా తెలియదని.. కాక్ పీట్ వాయిస్ రికార్డర్, బ్లాక్ బాక్స్ ను డీకోడ్ చేస్తే కచ్చితంగా కారణం తెలిసే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.
వాస్తవానికి టేకాఫ్ కు ముందు ఇంజినీర్లు ప్రతీదీ పక్కాగా తనిఖీ చేసి సర్టిఫై చేసిన తర్వాతే పైలెట్లు ముందుకొస్తారని.. వారు అన్నీ చూసుకునే టేకాఫ్ చేస్తారని.. చాలా మంది అభిప్రాయపడుతున్నట్లు రెండు ఇంజిన్లూ విఫలమయ్యే అవకాశం చాలా అరుదుగా ఉంటుందని చెప్పిన ఎస్.ఎన్. రెడ్డి... ఒకటి రెండు పక్షులు వల్ల ఏమీ ఇబ్బంది ఉండదని.. ఒకేసారి వేల పక్షులు వస్తేనే ప్రమాదమని తెలిపారు.
పైవేవీ ప్రమాదానికి కారణాలుగా అనిపించని పక్షంలో... ఇంధన కల్తీతోనే ఇంజిన్లు ఫెయిలయ్యే అవకాశముందని చెప్పిన ఎస్.ఎన్. రెడ్డి... పైలెట్ నియంత్రణలో లేని విషయం ఏదో జరిగి ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఏది ఏమైనా బ్లాక్ బాక్స్ డీకోడ్ చేస్తే గంటల్లో 90శాతం కారణాలు తెలిసే అవకాశం ఉందని అన్నారు.