మరో విషాదం... ఆటో డ్రైవర్ కుమార్తె ఫస్ట్ & లాస్ట్ ఫ్లైట్ జర్నీ!
గురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదం వందల కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 14 Jun 2025 4:09 PM ISTగురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదం వందల కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపిన సంగతి తెలిసిందే. పిల్లలను చూడాలని బయలుదేరిన తల్లి తండ్రులు, భర్తతో కలిసి జీవించాలనే కోటి ఆశలతో విమానం ఎక్కిన నవ వధువు, ఉన్నత శిఖరాలను అదిరోహించాలనుకున్న యువకులు ఇలా ఎందరో.. క్షణాల్లో మృతుఒడికి చేరుకున్నారు.
ఇదే సమయంలో.. చిన్న పిల్లలను లండన్ లో వదిలి, భార్య చివరి కోరిక తీర్చడానికని వచ్చి అనంత లోకాల్లో కలిసి పోయిన వ్యక్తి ఒకరైతే... ఫ్యామిలీతో కలిసి లండన్ లో స్థిరపడాలనుకుని, ఎంతో ఆనందంగా తన భర్య, పిల్లలతో కలిసి విమాన ప్రయాణాన్ని ప్రారంభించి, ఆ జ్ఞాపకాలను సెల్ఫీ రూపంలో బంధించి, అనంతరం గాల్లో కలిసిపోయిన ఫ్యామిలీ ఒకరు.
ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు... విమానంలో ఉన్న 241 మందిలో ఒక్కొక్కరిదీ ఒక్కో కథ. గుండెలు పిండేసే విషాద కథ! ఈ క్రమంలో తన కుమార్తే జీవితం బాగుండాలని, ఉన్నత చదువులు చదవాలని, ఉజ్వల భవిష్యత్తు పొందాలని కలలుగన్న ఓ ఆటో డ్రైవర్.. తన కుమార్తె చదువుల కోసం ఎన్నో అప్పులు చేసి ఆమెను లండన్ పంపించాలనుకున్నాడు. ఆమె కూడా ఆ విమానంలోని మృతుల్లో ఒకరు.
అవును... ఎయిరిండియా విమానం ప్రమాదంలో మరణించిన ప్రయాణికుల్లో పాయల్ ఖాతిక్ ఒకరు. ఆమె ఓ ఆటో డ్రైవర్ కుమార్తె. ఆమె చదువుల కోసం ఎన్నో అప్పులు చేసిన తండ్రి.. ఆమె ఉజ్వల భవిష్యత్తు కోసం లండన్ పంపాలనుకున్నారు. తాజాగా అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన ఎయిరిండియా బోయింగ్ విమానంలో ఆమె ఉన్నారు. తాజాగా ఈ విషయాలను ఆమె బంధువు వివరించారు.
ఇందులో భాగంగా... పాయల్ ఖాతిక్ ఎయిరిండియా విమానంలో ఉందని.. ఆమె తమ బంధువు సురేష్ ఖాతిక్ కుమార్తె అని.. ఆమెకు వీడ్కోలు చెప్పడానికి తామంతా వెళ్లామని తెలిపారు. అయితే.. ఆ విమాన ప్రమాదం గురించి విన్న అనంతరం తామంతా అహ్మదాబాద్ వెళ్లామని.. తమ డీఎన్ఏ శాంపుల్స్ ఇచ్చామని తెలిపారు.
ఈ నేపథ్యంలోనే కుటుంబ ఆర్థిక ఇబ్బందులను ప్రస్థావించారు. ఇందులో భాగంగా.. పాయల్ తండ్రి ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్నారని, తన కుమార్తె చదువుల కోసం, లండన్ పంపించడం కోసం కుటుంబం ఎన్నో అప్పులు చేసిందని వెళ్లడించారు. ఎంతో గొప్ప భవిష్యత్తును తమ కుమార్తె కలిగి ఉంటుందని ఆ కుటుంబం భావించిందని.. అయితే ఆమె తాజా విమానప్రమాదంలో మరణించిందని తెలిపారు.
