విమాన ప్రమాదం వెనక అసలు విషయాలు ఇవేనా ?
ప్రస్తుతం విమాన ప్రమాదం గురించి ప్రజాల్లో అనేక అపోహలు ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.
By: Tupaki Desk | 14 Jun 2025 9:21 AM ISTఅహ్మదాబాద్ లో కుప్పకూలిన ఎయిర్ ఇండియా బోయింగ్ విమానం ఎందుకు ప్రమాదానికి గురి అయింది అన్నది ఇంకా ఎవరికీ తెలియడం లేదు. ఎందుకంటే పూర్తి స్థాయి దర్యాప్తు లోతుగా జరగాల్సి ఉంది. అయితే ఈలోగా నిపుణుల నుంచి మేధావుల వరకూ ఏ విధంగా ప్రమాదం జరగవచ్చు అన్న దాని మీద తమకు ఉన్న అవగాహనతో అంచనాలు వేసి వివరిస్తున్నారు.
ఇక అదే విభాగానికి చెందిన నిపుణులు కానీ అధికారులు కానీ చెప్పే విషయాలు చాలా ఆసక్తిగా ఉంటాయి. అంతే కాదు ఆ విధంగా జరిగే అవకాశాలు హెచ్చుగా ఉండొచ్చు అన్నది కూడా అనిపిస్తుంది. తెలంగాణాకు చెందిన ఏవియేషన్ డైరెక్టర్ భరత్ రెడ్డి అయితే అహ్మదాబాద్ లో కుప్పకూలిన విమానం వెనక ప్రమాదానికి దారి తీసిన విషయాలు గురించి చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం విమాన ప్రమాదం గురించి ప్రజాల్లో అనేక అపోహలు ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే విమానాలలో ఉండే సాంకేతికత భద్రతా ప్రమాణాల గురించి తాను స్పష్టత ఇవ్వదలచుకున్నట్లుగా వెల్లడించారు.
ఇక విమానాల్లో రెండు ఇంజన్లు ఉంటాయి. ఒకటి ఆగిపోతే మరొకటి పనిచేస్తుంది అన్నది కరెక్ట్ కాదని ఆయన అన్నారు. రెండూ ఒకేసారి పనిచేస్తాయని ఆయన చెప్పారు అంతే కాదు టేకాఫ్ కి ముందు రెండు ఇంజన్లను పరిశీలించిన మీదటనే రన్ వే మీదకు అనుమతి ఇస్తారని ఆయన వివరించారు.
ఇక విమానం గాలిలో ఉన్నపుడు ఇంధనం బ్లాక్ అయితే ప్రమాదం జరుగుతుంది అన్నది కూడా ఒక తప్పుడు అభిప్రాయం అన్నారు. అలా బ్లాక్ ఏర్పడినా మిగిలిన ఇంధనంతో ఆ విమానం క్షేమంగా తిరిగి ఎయిర్ పోర్టుకు చేరుకుంటుందని అంతే కాదు సురక్షింతంగా ల్యాండ్ అవుతుందని అన్నారు.
అదే విధంగా చూస్తే పక్షులు ఢీ కొట్టడం వల్ల ప్రమాదం జరగడం అన్నది కూడా కాదని చెప్పారు అలాగైతే విమానాశ్రయాలలో పక్షుల సంచారం అన్నది ఎపుడూ ఉండేదే అని అంటున్నారు. ఇక రెండు ఇంజన్లలోకి ఒకేసారి రెండు పక్షులు ప్రవేశించడం అరుదైన ఘటన అని అత్యంత అసాధారణ ఘటన కూడా అని ఆయన అన్నారు. అందువల్ల అలా జరగడానికి కూడా వీలు తక్కువ అని చెప్పారు.
మేడే సిగ్నల్ ఇవ్వడం విమానం అత్యంత ప్రమాదంలో ఉనని చెప్పడమే అన్నారు. అయితే అలాంటి సందర్భాలలో సైతం విమానాలు ప్రమాదాల నుంచి బయటపడిన ఘటనలు ఎన్నో ఉన్నాయని ఆయన చెప్పారు. అయితే అహ్మదాబాద్ దుర్ఘటన కేవలం నలభై సెకండ్లలోనే జరిగిపోయింది అని అన్నారు. దీని వల్ల పైలెట్ కి విమానాన్ని నియంత్రించుకునే అవకాశం కూడా లేకుండా పోయింది అని అన్నారు.
ఇవన్నీ పక్కన పెడితే ప్రమాదం జరగడానికి ఒక కారణాన్ని ఆయన అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది. విమానం టేకాఫ్ తీసుకుని పైకి ఎగిరే సమయంలో భూమి మీద కొన్ని వందల అడుగుల వరకూ గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది. దానిని అధిగమించి విమానం ముందుకు పైకి సాగుతుంది. అలా గురుత్వాకర్షణ శక్తిని అధిగమించేలా దానిని వ్యతిరేకంగా పనిచేసేలా ఒక టెక్నాలజీ ప్రతీ విమానంలో ఉంటుంది.
బహుశా అది ఫెయిల్ కావడం వల్లనే ఇంత పెద్ద ప్రమాదం సంభవించి ఉండొచ్చు అని ఆయన అంటున్నారు. సెకన్ల వ్యవధిలో జరిగిన ఈ ప్రమాదం చూసినపుడు ఆయన అంచనాలలే కరెక్ట్ అన్న భావన ఏర్పడుతోంది. అంతే కాదు విమాంలో ఉండే వింగ్ బ్లేడ్స్ కూడా విమాన స్థిరత్వానికి ఒక ఆయుధంగా పనిచేస్తాయి ఆయన అంటున్నారు ఇందులో ఏ ఒక్క వింగ్ బ్లేడ్ పనిచేయకపోయినా కూడా విమానం ప్రమాదంలో పడుతుందని అంటున్నారు.
అంటే ఇది కూడా ఏమైనా కారణం అవుతుందా అన్నది ఆయన మాటలను బట్టి ఆలోచిచుకోవాల్సి ఉందని అంటున్నారు. ఏది ఏమైనా ఈ అతి పెద్ద విమాన ప్రమాదం మాత్రం ఎన్నో సవాళ్ళను ప్రశ్నలను కళ్ళ ముందు ఉంచింది. దర్యాప్తులోనే జవాబులు కొన్ని అయినా దొరుకుతాయని అంటున్నారు.
