విమానం టేకాఫ్ వేగాన్ని నియంత్రించిన అతి పెద్ద అడ్డు అదే ?
ఇక ట్రాక్ రికార్డు చూస్తే కనుక ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానం ఏఐ171 అన్ని విధాలుగా పర్ఫెక్ట్ అని అంటారు ఈ తరహా విమానాలకు ఎపుడూ భారీ ప్రమాదాలకు తావు లేదని అంటారు.
By: Tupaki Desk | 12 Jun 2025 7:53 PM ISTఅహ్మదాబాద్ లో గురువారం మధ్యాహ్నం ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఇది భారతీయ విమాన ప్రమాదానలో అగ్ర స్థానంలో ఉంది. అంతా బాగుంది. పౌర విమానయాన రంగంలో భారత్ అద్భుతాలు సృష్టిస్తోంది అని అంతా అనుకుంటున్న వేళ అందరినీ వణికించేలా ఈ ఘోర కలి ఉందని అంటున్నారు.
ఇదిలా ఉంటే ఎందుకు ఈ విమాహం కుప్ప కూలింది అన్న దాని మీద ఇంకా పూర్తి వివరాలు అయితే రావడం లేదు. ప్రాధమిక దర్యాప్తు తరువాత కొన్ని వాస్తవాలు బయటపడే అవకాశాలు ఉన్నాయి. అయితే అంతర్జాతీయ విమానాల విషయంలో అత్యంత కట్టుదిట్టమైన తనిఖీలు సేఫ్టీ మెజర్స్ విషయంలో ఒకటికి పదిసార్లు చెక్ చేసుకోవడాలుఉంటాయని అంటున్నారు.
ఇక అహ్మదాబాద్ లో ఎయిర్ పోర్టు నుంచి టేకాఫ్ తీసుకున్న విమానం ఎక్కువ సేపు ప్రయాణం చేయలేదు. ఇలా ఎగిరి అలా కుప్ప కూలింది. దాంతో ఏమి జరిగి ఉంటుంది దీని వెనక కుట్ర కోణం ఏమైనా ఉందా అన్న చర్చ కూడా సాగుతోంది. సాంకేతిక సమస్యలు ఉన్నట్లు అయితే అయితే ఎయిర్ పోర్టులో విమానం ల్యాండ్ అయినపుడే చెక్ చేస్తున్నపుడు కనిపించేవి అని అంటున్నారు.
ఏకంగా తొమ్మిది గంటల పాటు ప్రయాణించాల్సిన అంతర్జాతీయ విమానం ఇది. అందువల్ల పూర్తిగా అలెర్ట్ అయి అంతా ఉంటారు పైగా అత్యంత శక్తి సామర్థ్యం కలిగిన బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానం ఇది. ఒకేసారి మూడు వందల మంది దాకా ప్రయాణీకులను మోసుకెళ్ళే కెపాసిటీ కలిగి ఉంది. వేగం చూసినా సూపర్ పవర్ గా చెబుతారు.
ఇక ట్రాక్ రికార్డు చూస్తే కనుక ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానం ఏఐ171 అన్ని విధాలుగా పర్ఫెక్ట్ అని అంటారు ఈ తరహా విమానాలకు ఎపుడూ భారీ ప్రమాదాలకు తావు లేదని అంటారు. దాంతో చరిత్రలో ఈ రకం విమానాలలో అత్యధిక ప్రాణాలను పొట్టన పెట్టుకున్న నింద ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానం ఏఐ171కే దక్కింది అని అంటున్నారు.
ఇక అనుభవం కలిగిన పైలెట్లు ఉన్నారు. అన్నీ బాగున్న వేళ ఇంతలోనే ఇంత అన్నట్లుగా జరిగిన ఈ ప్రమాదం వెనక ఏమి జరిగి ఉంటుంది అని ఆలోచిస్తున్నారు అంతా గాలిలోనే జరిగింది అని అంటున్నారు. అయితే అహ్మదాబాద్ విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా విమానం కూలిపోవడానికి ఒక అతి ముఖ్యమైన కారణాన్ని నిపుణులు అంచనా వేస్తున్నారు. బహుశా అదే జరిగి ఉండొచ్చని దాని వల్లనే ఇంతటి ప్రమాదం సంభవించింది అని అంటున్నారు.
గాలిలో విమానం అతి వేగంతో టేకాఫ్ తీసుకుని దూసుకుని వెళ్తున్న వేళ అనూహ్యంగా పక్షి ఒకటి ఢీ కొట్టి ఉంటుందని అనుమానిస్తున్నారు. అలా జరగడం వల్ల అది కూడా టేకాఫ్ లో జరగడం వల్ల ఒక విమానానికి టేకాఫ్ సమయంలో అవసరమైన గరిష్టమైన వేగాన్ని సాధించే సామర్ధ్యాన్ని అది అడ్డుకుని ఉండొచ్చని అంటున్నారు.
నిజానికి టేకాఫ్ చాలా కీలకం. ఒక్కసారిగా అకాశంలోకి దూసుకునిపోవాల్సి ఉంటుంది. ఆ సమయంలో గరిష్ట వేగాన్ని ఏ మాత్రం తగ్గించినా అది పెను ప్రమాదానికి దారి తీస్తుందని నిపుణులు అంటున్నారు అంటే గాలిలోనే ఒక పక్షి రూపంలో ఇంతటి పెను విపత్తు సంభవించడానికి కారణం అయి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
దాంతో టేకాఫ్ కి తగిన వేగం సాధించలేక పెను ప్రమాదానికి గురి అయి ఎయిర్ పోర్టు నుంచి బయల్దేరిన కేవలం కొద్ది సేపు వ్యవధిలోనే కుప్ప కూలిందని భావిస్తున్నారు. అయితే ఇంకా ఏమైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా అన్న చర్చ కూదా సాగుతోంది ఏది ఏమైనా ఇది అతి పెద్ద దుర్ఘటనగా పేర్కొంటున్నారు.
