విమాన ప్రమాదంలో మృతులపై విదేశాంగ శాఖ కీలక ప్రకటన!
అవును... అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన ఎయిరిండియా విమానం టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే కుప్పకూలిన ఘటనపై తీవ్ర ఆందోళనలు నెలకొంటున్నాయి.
By: Tupaki Desk | 12 Jun 2025 6:56 PM ISTఅహ్మదాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్ బయలుదేరిన ఎయిరిండియా విమానం టెకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఆ విమానంలో 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది ఉన్నారు. దీంతో.. మృతుల సంఖ్యపై తీవ్ర ఆందోళన నెలకొందని అంటున్నారు.
ఈ 230 మంది ప్రయాణికుల్లోనూ 169 మంది భారతీయులు కాగా.. మిగిలినవారిలో 53 మంది బ్రిటిష్ జాతీయులు, 7 గురు పోర్చుగీస్ జాతీయులు, 1 కెనడియన్ జాతీయుడు ఉన్నారు. ఈ నేపథ్యంలో దుర్ఘటనపై కేంద్ర విదేశాంగ శాఖ ప్రకటన చేసింది. ఇందులో భాగంగా.. ఈ ప్రమాదంలో చాలా మంది మరణించినట్లు వెల్లడించింది.
అవును... అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన ఎయిరిండియా విమానం టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే కుప్పకూలిన ఘటనపై తీవ్ర ఆందోళనలు నెలకొంటున్నాయి. ఈ సమయంలో స్పందించిన విదేశాంగ శాఖ.. అహ్మదాబాద్ లో చోటుచేసుకున్న ఘటన మాటలకు అందని పెను విషాదం అని.. ఇప్పటివరకూ ఉన్న సమాచారం ప్రకారం చాలా మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపింది.
ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు తెలిపింది. మృతుల్లో ఎక్కువ మంది విదేశీయులు ఉన్నారని, ఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపింది. ఈ మేరకు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్ ధీర్ జైస్వాల్ ఈ వివరాలు వెల్లడించారు.
