ఎటు చూసినా మాంసపు ముద్దలే.. జాబితాతోనే గుర్తింపు!
గుజరాత్‌లోని పారిశ్రామిక నగరం అహ్మదాబాద్ నుంచి గురువారం మధ్యాహ్నం 1.10 గంటలకు టేకాఫ్ అయిన ఏఐ 171 బోయింగ్ విమానం కొన్ని నిమిషాల్లోనే సమీపంలోని బీజే ఆసుపత్రిపై కుప్పకూలింది.
By: Tupaki Desk | 13 Jun 2025 4:49 AMగుజరాత్‌లోని పారిశ్రామిక నగరం అహ్మదాబాద్ నుంచి గురువారం మధ్యాహ్నం 1.10 గంటలకు టేకాఫ్ అయిన ఏఐ 171 బోయింగ్ విమానం కొన్ని నిమిషాల్లోనే సమీపంలోని బీజే ఆసుపత్రిపై కుప్పకూలింది. అప్పటికి ఫుల్లుగా ఉన్న రెండు ఇంధన ట్యాంకులు ఒక్కసారిగా పేలిపోయాయి. దీంతో భారీ ఎత్తున మంటలు చెలరేగి.. విమానం పూర్తిగా కాలిపోయింది. ఈ ఘటనలో బోయింగ్ సిబ్బంది సహా ప్రయాణికులు 242 మంది మృతి చెందారని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.
అయితే.. పరిసర ప్రాంతాలకు కనీసం కిలో మీటరు దూరం వరకు.. దట్టమైన పొగ అలుముకుంది. అదేవిధంగామంటల ధాటికి పదుల సంఖ్యలో కార్లు దహనమై పోయాయి. ఇక, ఇతర వాహనాలు కూడా అంతే సంఖ్యలో మంటలకు బూడిదయ్యాయి. మరోవైపు ప్రభుత్వం సహయాక చర్యలు చేపట్టినా.. అక్కడ మిగిలి ఉన్న వారు.. ప్రాణాలతో ఉన్న వారు ఒక్కరు కూడా లేకపోవడంతో కేవలం మంటలను ఆర్పేందు కు మాత్రమే సిబ్బంది పరిమితమయ్యారు.
ఇదిలావుంటే.. కనీసం శవాలను కూడా గుర్తించలేని విధంగా ఎటు చూసినా మాంసపు ముద్దలే కనిపించాయి. ఏది వస్తువో.. ఏది మాంసపు ముద్దో కూడా గుర్తించలేని పరిస్థితి ఏర్పడిందని స్థానిక పోలీసులు తెలిపారు. వందల కొద్దీ అంబులెన్సులను రంగంలోకి దింపినా.. కాలిపోయిన, బూడిదైపోయినా.. దేహాల ను మాత్రమే వాటిలో తరలించే పరిస్థితి ఏర్పడిందని అంబులెన్సుల నిర్వాహకులు చెప్పారు. ఇది క్షేత్రస్థాయిలో సహాయక చర్యలు చేపట్టేవారికి మరింత సవాలుగా మారింది.
విమానంఒ క్కసారిగా పేలడంతో చనిపోయిన వారి మృతదేహాలు.. మంటల్లో చిక్కుకుని భస్మమయ్యాయ ని అధికారులు వివరించారు. గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ మృతదేహం కోసం.. ప్రత్యేక గాలింపు చర్యలు చేపట్టినా.. ఫలితం లేకపోయిందని మంత్రి ఒకరు వ్యాఖ్యానించారు. ''మాకు ఇప్పుడున్నది కేవలం జాబితా మాత్రమే. దానిని చూసి మాత్రమే ఎవరు ఏంటనేది నిర్ధారించుకోవాలి. కొన్ని మృతదేహాలు.. పూర్తిగా కాలిపోయాయి. కొన్ని ముద్దలు ముద్దలుగా పడి ఉన్నాయి'' అని మంత్రి వ్యాఖ్యానించారు.