Begin typing your search above and press return to search.

కొడుకు ప్లాస్మాతో తండ్రి వయసు పాతికేళ్లు తగ్గిపోయింది!

అవును... అమెరికాకు చెందిన వ్యాపారవేత్త బ్రెయిన్ జాన్సన్ జన్యుపరమైన చికిత్సతో వయసు తగ్గించుకోడానికి ప్రయత్నం చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   16 Nov 2023 4:11 AM GMT
కొడుకు ప్లాస్మాతో తండ్రి వయసు పాతికేళ్లు  తగ్గిపోయింది!
X

ఈ లోకంలో చాలా మందికి వయసు పెరగకూడదని, అందం తగ్గకూడదని కోరిక ఉంటుందనేది తెలిసిన విషయమే. అయితే ఎవరి పరిస్థితిని బట్టి, ఎవరి అందుబాటులను బట్టి వారు అందుకోసం తమ తమ చర్యలు తీసుకుంటుంటారు. ఈ క్రమంలో ఏడాదికి కోట్లాది రూపాయలను ఖర్చుచేస్తూ.. బ్రెయిన్ జాన్సన్ జన్యుపరమైన చికిత్సతో వయసు తగ్గించుకోడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా పాతికేళ్ల వయసు తగ్గిందని చెబుతున్నారు.

అవును... అమెరికాకు చెందిన వ్యాపారవేత్త బ్రెయిన్ జాన్సన్ జన్యుపరమైన చికిత్సతో వయసు తగ్గించుకోడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ చికిత్స వల్ల తన వయసు మాత్రమే కాకుండా అతడి తండ్రి వయసు కూడా తగ్గిందని చెబుతున్నాడు. ఈ మేరకు తన ఎక్స్ లో ఈ విషయాన్ని వెల్లడించాడు.

ఇందులో భాగంగా... తన బాడీ నుంచి తీసిన సుమారు ఒక లీటరు ప్లాస్మాను 71 ఏళ్ల వయసున్న తన తండ్రికి ఎక్కించడంతో ఆయన వయసు సుమారు పాతికేళ్లు తగ్గిందని.. ఫలితంగా ఇప్పుడు ఆయన వయసు 46 అయ్యిందని ట్విట్టర్‌ లో వెల్లడించాడు. ఈ సందర్హంగా ఆయన వృద్ధాప్య రేటు తగ్గడానికి తన నుంచి తీసుకున్న లీటరు కంటే అతడి స్వంత ప్లాస్మాలోని 600 మిల్లీలీటర్లను తొలగించడం వల్ల కూడా ఈ ఫలితం వచ్చి ఉండొచ్చని కూడా అభిప్రాయపడ్డారు.

ఈ సందర్భంగా... "నా రక్తంలోని లీటరు ప్లాస్మాను స్వీకరించిన మా నాన్న వృద్ధాప్య వేగం 25 సంవత్సరాలు తగ్గింది. చికిత్స తీసుకున్నన ఆరు నెలల తర్వాత కూడా అదే స్థాయిలో ఉంది. అంటే... మనం ఎంత పెద్దవారైతే అంత వేగంగా వృద్ధాప్యం వస్తుంది. నా ప్లాస్మాలో 1 లీటరు తీసుకున్న తర్వాత మా నాన్న 46 ఏళ్ల వయస్సుకు తగ్గిపోయారు.. గతంలో అతను 71 ఏళ్ల వయస్సు వృద్ధాప్యంలో ఉన్నాడు" అని ట్వీట్ చేశారు.

అయితే ఈ ప్రొసిజర్ కోసం సుమారు 2 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 16.5 కోట్లు) వెచ్చిస్తున్నట్లు తెలుస్తుంది. ఇందులో కొత్త ప్లాస్మా ఎక్కించడం ఒకెత్తు అయితే... పాత ప్లాస్మాను తొలగించడం మరొకెత్తు అని అంటున్నారు!

కాగా, ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బ్రెయిన్ తాను వయసు తగ్గించేందుకు తీసుకుంటున్న చికిత్సల గురించి వెల్లడించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రోజుకు 111 సప్లిమెంట్లను తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఈ సమయంలో మెదడు, కాలేయం, మూత్రపిండాలు, చర్మం, దంతాలు, వెంట్రుకలు, పురుషాంగం, పురీషనాళంతో సహా తన ప్రధాన అవయవాలన్నింటి ఎప్పటికప్పుడు ఏ మేరకు యవ్వనంగా మారుతున్నాయనేది పరిశీలిస్తుంటారు.

ఈ క్రమంలో... తన మొత్తం శరీరాన్ని యాంటీ ఏజింగ్ అల్గారిథం కి మార్చడమే లక్ష్యమని చెబుతున్న జాన్సన్ ప్రస్తుత వయసు 46 ఏళ్లు కాగా.. అవయవాలు 18 ఏళ్ల యువకుడిలా పనిచేయించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెబుతున్నారు. ఈ క్రమంలో తన తండ్రి వయసు కూడా 71 నుంచి పాతికేళ్లు తగ్గి 46 అయ్యిందని వెల్లడించారు!