పాక్ కు 'కునార్' షాక్... బిగ్ స్కెచ్ వేసిన ఆఫ్ఘనిస్తాన్!
పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్ తొలుత పాక్ కు దౌత్యపరమైన షాకులు ఇచ్చిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 22 May 2025 8:44 PM ISTపహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్ తొలుత పాక్ కు దౌత్యపరమైన షాకులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆపరేషన్ సిందూర్ కంటే ముందు సింధూ నదీ జలాల ఒప్పందాన్ని సస్పెండ్ చేసింది. దీంతో.. ఈ ప్రభావం ఇప్పటికే అనేక రకాల ఇబ్బందుల్లో ఉన్న పాక్ కు ముందు ముందు పెద్ద దెబ్బ అనే కామెంట్లు వినిపించాయి. ఈ సమయంలో ఆఫ్ఘాన్ కూడా అలానే ప్లాన్ చేస్తుంది!
అవును... అనేక రకాల ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్ కు దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది. ఇప్పటికే ఆపరేషన్ సిందూర్ అంటూ పాక్ ను భారత్ ఉక్కిరిబిక్కిరి చేసేయడంతో.. చెప్పుకోలేని బాధలో మునిగిపోయిందని అంటున్నారు. మరోపక్క పక్కలో బల్లెంలా మారింది బలూచిస్తాన్. గ్యాప్ ఇవ్వకుండా పాక్ ఆర్మీని ఇబ్బందిపెడుతోంది.
ఈ క్రమంలో ఇప్పటికే పాక్ భూభాగంలోని బెలుచిస్తాన్ ప్రాంతాన్ని స్వతంత్ర దేశంగా బలుచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించుకుంది. ఈ క్రమంలో పాకిస్థాన్.. ఆఫ్ఘనిస్తాన్ కూడా బలమైన షాకిచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ఆఫ్ఘానిస్తాన్ నుంచి పాకిస్థాన్ కు వెళ్లే నీటి ప్రవాహానికి ఆనకట్ట కట్టి అడ్డుకట్ట వేసే ప్లాన్ చేస్తోంది.
ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా స్పందించిన బలూచీ కార్యకర్త స్పందిస్తూ.. "ఇది తమ పాకిస్థాన్ ముగింపు ప్రాంతమని.. భారత్ తర్వాత, ఇప్పుడు పాకిస్థాన్ కు ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చే నీటి ప్రవాహాన్ని తగ్గించడానికి ఆనకట్టలను నిర్మించడానికి సిద్ధమవుతోందని పేర్కొన్నారు. అయితే.. ఈ వాదనను ఆఫ్ఘాన్ ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు.
కాకపోతే... ఈ ప్రాంతంలో నీటి వనరులపై పెరుగుతున్న డిమాండ్ ను ఈ విషయం తెరపైకి తెచ్చిందని అంటున్నారు. భారత్ తరహాలో పాక్ గొంతు ఎండగడితే అది ఒక రకంగా పొరుగుతున్న తమకు మంచిదని ఆఫ్ఘాన్ భావిస్తున్నట్లు చెబుతున్నారు! ఈ సందర్భంగా తెరపైకి వచ్చిన బలుచిస్తాన్ కార్యకర్త పొస్ట్ ప్రకారం.. ఆఫ్గాన్ ఆనకట్ట ప్లాన్ చేస్తుంది.
ఇదే సమయంలో.. తాలిబన్ జనరల్ ముబిన్ ఇటీవల ఆనకట్ట స్థలాన్ని పరిశీలించడానికి కునార్ ప్రాంతాన్ని సందర్శించారు.. కాబూల్ లోని ప్రభుత్వం నిధులు సేకరించి బహుళ ఆనకట్ట ప్రాజెక్టులను ప్రారంభించాలని కోరిందని బలూచీ కారకర్త పోస్టులో పేర్కొన్నారు. ఈ నీరు మన రక్తం.. మన విద్యుత్ అవసరాలను తీర్చడానికీ ఇది ఉపయోగపడుతుంది.. ఈ నీటిని మనం ఆపాలి అని పేర్కొన్నారు.
ఇదే క్రమంలో... ఈ నీటిని ఆపడం వల్ల మన వ్యవసాయాన్ని మరింత బలోపేతం చేసుకోవచ్చు అని ముబిన్ చెప్పినట్లు బలూచ్ కార్యకర్త పేఋకొన్నారు. కాగా... హిందూ కుష్ పర్వతాల్లో ఉద్భవించిన కునార్ నది.. కాబూల్ నదిలో కలిసి పాకిస్థాన్ లో ప్రవహిస్తుంది. ఈ నేపథ్యంలో కునార్ నదిపై ఆనకట్ట కట్టి నీటిని ఆపాలనేది ఆఫ్ఘాన్ ప్లాన్ అని అంటున్నారు.
